థ్రిల్లింగ్ వినోదం | Complete Entertainment With Thrilling | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ వినోదం

Published Mon, May 19 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

థ్రిల్లింగ్ వినోదం

థ్రిల్లింగ్ వినోదం

వినోదంతో కూడిన థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ జంట నిఖిల్, స్వాతి మళ్లీ ఇందులో కలిసి నటించారు. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అందరూ మెచ్చే సినిమా అవుతుందని నిర్మాత తెలిపారు. ‘‘ఇందులో హీరోహీరోయిన్లు వైద్య విద్యార్థులుగా కనిపిస్తారు. ఆద్యంతం వినోదాత్మకంగా, థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 27న పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. తనికెళ్ల భరణి, రావురమేశ్, రాజా రవీంద్ర, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, కూర్పు: కార్తీక శ్రీనివాస్, సమర్పణ: శిరువూరి రాజేశ్‌వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement