స్వామి రారాకి సెకండ్ పార్ట్ | Swamy Ra Ra to have a sequel | Sakshi
Sakshi News home page

స్వామి రారాకి సెకండ్ పార్ట్

Published Thu, May 1 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

Swamy Ra Ra to have a sequel

 గత ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించి, ‘పెద్ద సినిమా’గా నిలిచినవాటిలో ‘స్వామి రారా’ ఒకటి. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత చక్రి చిగురుపాటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నారు. దీనికి ‘స్వామి స్వామి రారా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ది సాగా కంటిన్యూస్’ అనేది ఉపశీర్షిక. ఎన్. బోస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్తదనానికి నిర్వచ నంగా నిలిచిన ‘స్వామిరారా’కి సీక్వెల్ చేస్తున్నాం. ఓ ప్రముఖ కథా నాయకునితో, భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా నిర్మించను న్నాం’’ అని చెప్పారు. దీనికి సహ నిర్మాత: బీఎస్ వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement