
జరిగిన సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం
మా తమ్ముడు కష్టపడి జీవితంలో పైకొచ్చాడు
ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్లు చెప్పలేదు
కాకినాడలో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడి ఆవేదన
కాకినాడ రూరల్: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్ (37)ఎంబీఏ, ఎంకామ్ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్(7), యూకేజీ చదువుతున్న నిఖిల్(6)ను ఇటీవలే స్కూల్ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు.
తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్రకిశోర్ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్‌ఆర్ హెడ్ సునీల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కలకలం రేపిన ఘటన..
ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్‌లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్రకిశోర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్‌లో ఉంటున్నాడు.
హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్‌కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment