సాధారణ ప్రేమకథ | simple love story movie shooting completed | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రేమకథ

Feb 8 2014 11:39 PM | Updated on Sep 2 2017 3:29 AM

సాధారణ ప్రేమకథ

సాధారణ ప్రేమకథ

ప్రేమలో పడటం తప్పు కాదని, అయితే అదే ప్రపంచంగా బతికేయకుండా కెరీర్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే కథాంశంతో జి. శ్రీ చందన, ఎస్. కుమార్ నిర్మిస్తున్న చిత్రం

 ప్రేమలో పడటం తప్పు కాదని, అయితే అదే ప్రపంచంగా బతికేయకుండా కెరీర్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే కథాంశంతో జి. శ్రీ చందన, ఎస్. కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సింపుల్ లవ్‌స్టోరి’. కార్తీక్, కార్తికేయ, కిరణ్, అమితారావు, మధులగ్నదాస్, అన్విక ముఖ్య తారలు. రవివర్మ ఎమ్. దర్శకుడు. టాకీపార్ట్ పూర్తయ్యింది. ఈ 10 నుంచి అరకు లోయ, కేరళల్లో పాటలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదంతో పాటు చక్కని సందేశం ఉన్న చిత్రం ఇది. భానుచందర్‌గారు చేసిన కీలక పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. రమేష్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల మూడో వారంలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. కలర్‌ఫుల్‌గా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పాండు, సమర్పణ: డా. జి. ప్రవీణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement