
ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేత : కాంతిలాల్ దండే
ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు.
విజయనగరం: ప్రజలు సహకరిస్తే కర్ఫ్యూ ఎత్తివేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. రేపు ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ఈరోజు కర్ఫ్యూ సడలింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. రేపు మరో గంట అదనంగా కర్ఫ్యూ సడలిస్తామన్నారు. ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలోనే కర్ఫ్యూ ఎత్తివేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఈరోజు రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోతేనే రేపు సడలింపు సమయం అమలౌతుందని ఎస్పి కార్తికేయ చెప్పారు. ఆస్తుల విధ్వంసం, పోలీసు వాహనాల ధ్వంసంకు సంబంధించి 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పి చెప్పారు.