AK 61: Ajith Third Film With H Vinoth, Details Inside - Sakshi
Sakshi News home page

AK 61: మళ్లీ ఆ దర్శకుడి వైపే అజిత్‌ చూపు.. ముచ్చటగా మూడోసారి!

Published Sun, Jan 23 2022 10:38 AM | Last Updated on Sun, Jan 23 2022 2:11 PM

AK 61: Ajith Third Film With H Vinoth - Sakshi

Ajith AK 61 Movie: వలిమై చిత్ర కాంబో రిపీట్‌ కానున్నట్లు సమాచారం. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఒకే దర్శకుడితో ఒకే నిర్మాణ సంస్థకు వరుసగా చిత్రాలు చేయడం పరిపాటిగా మారింది. ఇంతకుముందు బోనీ కపూర్‌ నిర్మాతగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో నేర్కొండ పార్వై చిత్రంలో నటించారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వెంటనే ఇదే కాంబినేషన్‌లో వలిమై చిత్రంలో నటించారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి నాయికగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా మరోసారి ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. ఇది పంచ్‌ డైలాగ్స్‌తో భారీ యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. చిత్ర షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement