Sai Pallavi Has Refused The Opportunity To Act With Vijay And Ajith Movies, Check Here Reason - Sakshi
Sakshi News home page

Sai Pallavi: పెద్దగా ఆఫర్స్‌ లేవు.. అయినా ఆ స్టార్‌ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి

Published Sat, Feb 25 2023 8:46 AM | Last Updated on Sat, Feb 25 2023 9:28 AM

Is Sai Pallavi Rejects Vijay Varisu And Ajith Valimai Movie - Sakshi

డాక్టర్‌ అవ్వాల్సిన సాయిపల్లవి యాక్టర్‌ అయ్యారు. అయితే తన గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సాయి పల్లవి బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి అని. ఈమె ఒక చానల్‌ నిర్వహించిన యార్‌ ప్రభుదేవా అనే కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతే మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో కథానాయక పరిచయం అయ్యారు. ఆ ఒక్క చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. వెంటనే తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి చిత్రాలు విజయం సాధించడంతో కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది.

తమిళంలో ధనుష్‌కు జంటగా మారీ–2, సూర్యతో ఎన్‌జీకే చిత్రాల్లో నటించారు. అయితే ఇక్కడ మారీ–2 చిత్రం మినహా ఇతర చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించడానికి సాయిపల్లవి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న ఒక్క చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉంది. కాగా ఇటీవల ఇద్దరు తమిళస్టార్‌ హీరోల సరసన నటించే రెండు అవకాశాలను సాయిపల్లవి తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎవరో కాదు నటుడు విజయ్, అజిత్‌ కావడం విశేషం. విజయ్‌ కథానాయకుడు నటించిన తాజా చిత్రం వారిసులో హీరోయిన్‌గా ముందు సాయిపల్లవినే అనుకున్నారట.

అయితే ఆ చిత్రంలో కథానాయక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె నో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత నటి రష్మికను ఎంపిక చేశారు. ఆమె కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలుసిన విజయ్‌ సరసన నటించాలన్న కోరికతోనే వారిసు చిత్రంలో ఆమె నటించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాయిపల్లవి నిరాకరించిన మరో చిత్రం వలిమై. అజిత్‌ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు మొదట సాయిపల్లవినే అనుకున్నారట అయితే ఆ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నిరాకరించినట్లు సమాచారం. నిజానికి ఈ రెండు చిత్రాల్లోనూ గ్లామర్‌కు అవకాశం లేకపోయినా నటనకు కూడా అవకాశం లేకపోవడంతో సాయిపల్లవి నో చెప్పినట్లు తెలిసింది.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement