
Ajith Valimai Box Office Collections: తమిళ నాట హీరో అజిత్‌కు ఉండే క్రేజ్ గరించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన ‘వలిమై’ చిత్రం ఫస్ట్‌డే తమిళ నాడు దాదాపు రూ. 36 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం చూస్తుంటే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రెంజ్ ఉందో అర్థమవుతోంది. వినోద్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన వలిమై ఫిబ్రవరి 24న తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం వీకెండ్‌లో సైతం అదే జోరుతో వసూళు చేసింది.
చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్
ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లకిపైగా వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. అక్కడ మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగుతుందని అంటున్నారు. ఎందుకంటే దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు. ఇక తెలుగులో కూడా ఈ సినిమాను అదే టైటిట్‌తో విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా రెస్పాన్స్ కనిపించడం లేదు. అందుకు కారణంగా అందరి దృష్టి 'భీమ్లా నాయక్' పై ఉండటమే.. ఆ సినిమాకి హిట్ టాక్ రావడమే కారణం.
Comments
Please login to add a commentAdd a comment