![Valimai Fans Bathe Producer Boney Kapoor Car With Curd, Milk - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/Valimai-Fans-Bathe-Producer-Boney-Kapoor-Ca.jpg.webp?itok=_8vbcUsU)
'మన ఊరి పాండవులు' హిందీ రీమేక్ 'హమ్ హై పాంచ్' సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించాడు బోనీ కపూర్. తాజాగా ఆయన నిర్మించిన వలిమై సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నటి హ్యూమా ఖురేషితో కలిసి చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించాడు బోనీ కపూర్.
ఈ క్రమంలో తన కారును థియేటర్ బయట పార్క్ చేశాడు. విషయం తెలుసుకున్న కొందరు క్రేజీ ఫ్యాన్స్ వలిమై నిర్మాత కారుకు పాలాభిషేకం చేశారు. పాలు, పెరుగుతో నిర్మాత కారుకు అభిషేకం చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన బోనీ కపూర్ తన కారు స్థితిని చూసి కొంత ఆశ్చర్యపోయినప్పటికీ అదే కారులో తిరిగి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment