ఈ వారం సందడి చేసే పెద్ద సినిమాలు ఇవే.. | Upcoming Movies Release Theaters And OTT March 4th Week | Sakshi
Sakshi News home page

Upcoming Movies: ఈ వారం సందడి చేసే పెద్ద సినిమాలు ఇవే..

Published Mon, Mar 21 2022 1:07 PM | Last Updated on Mon, Mar 21 2022 2:42 PM

Upcoming Movies Release Theaters And OTT March 4th Week - Sakshi

పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌, భీమ్లా నాయక్‌, రాధేశ్యామ్‌ చిత్రాలతో సినీ లవర్స్‌ పండుగ చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పండుగను కొనసాగించే సమయం వచ్చేసింది. థియేటర్లలో ఒకే ఒక్క భారీ చిత్రం విడుదల కానుండగా.. ఓటీటీల్లో బడా చిత్రాలు సందడి చేయనున్నాయి. వారంలో ఒక స్టార్‌ హీరో సినిమా వస్తుందంటేనే ఆ సందడి మాములుగా ఉండదు. అలాంటిది థియేటర్‌లో, ఓటీటీల్లో నలుగురు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ ఉత్సాహం అంతకుమించి అన్నట్టుగానే ఉంటుంది. అయితే ఒక మల్టీ స్టారర్‌ చిత్రం థియేటర్లలో దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉంటే రెండు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు ఓటీటీల్లో అదరగొట్టనున్నాయి. 

1. రౌద్రం.. రణం.. రుధిరం
మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ వంటి ఇద్దరు అగ్ర హీరోలతో ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్‌ఆర్ఆర్'. ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిస్టారికల్‌ ఫిక్షనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ బీజీఎం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగనుంది. 

2. భీమ్లా నాయక్‌
పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో ఫిబ్రవరి 25న విడుదలైన చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా స్క్రీన్‌ ప్లే, సంభాషణలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాశారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లలో మార్చి 25 నుంచి 'భీమ్లా నాయక్‌' స్ట్రీమింగ్‌ కానుంది. 

3. వలిమై
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా ఫిబ్రవరి 24న రిలీజైన మూవీ 'వలిమై'. హెచ్. వినోద్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్‌  హీరో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా హిట్‌ కొట్టన 'వలిమై' కూడా మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికా 'జీ5'లో ప్రదర్శితం కానుంది. థియేటర్‌లో ఆర్‌ఆర్ఆర్, ఓటీటీల్లో భీమ్లా నాయక్, వలిమై సినిమాలతో మూవీ లవర్స్‌కు బంపర్‌ ట్రీట్‌ అందనుంది. 

ఓటీటీల్లో రిలీజయ్యే మరికొన్ని సినిమాలు:

నెట్‌ఫ్లిక్స్
1. బ్రిడ్జిటన్‌ (వెబ్ సిరీస్‌), మార్చి 25

అమెజాన్‌ ప్రైమ్
2. డ్యూన్‌, మార్చి 25

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్
3. పారలెల్స్‌, మార్చి 23

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement