
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించాలనే పట్టుదలతో హిమాచల్‌ప్రదేశ్... ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో తమిళనాడు... జైపూర్‌లో నేడు జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత క్రికెటర్ రిషి ధావన్ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ చేరిన హిమాచల్ ప్రదేశ్ ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందో లేదో చూడాలి.
ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్‌పై గురి పెట్టింది. బాబా అపరాజిత్, వాషింగ్టన్ సుందర్‌లతోపాటు చివర్లో మెరుపులు మెరిపించే షారుఖ్‌ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం తమిళనాడుకు సానుకూల అంశం. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
చదవండి: IND-19 Vs PAK-19: పాక్‌పై చివరి బంతికి ఓడిన భారత్..
Comments
Please login to add a commentAdd a comment