విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ తొలిసారి ఛాంఫియన్‌గా నిలిచింది. జైపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తమిళనాడును ఓడించి హిమాచల్ ప్రదేశ్ టైటిల్‌ను ముద్దాడింది. కాగా ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఓటమి చెందినప్పటకీ.. ఆ జట్టు బ్యాటర్ దినేష్ కార్తీక్ విరోచిత ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కార్తీక్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. జట్టు 315 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కార్తీక్ కీలకపాత్ర పోషించాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా బెంగాల్, పుదుచ్చేరి జట్లుపైన వరుసగా 87,65 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు కేకేఆర్ దినేష్ కార్తీక్‌ని రీటైన్ చేసుకోలేదు. దీంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కార్తీక్‌ని సొంతం చేసుకునేందుకు రానున్న వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment