ఐపీఎల్ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. చాలా మంది స్టార్ ఆటగాళ్లు వెలంలో పాల్గొనబోతున్నారు. దీంతో ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు దినేష్ కార్తీక్‌ను రీటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మనసులోని మాటను బయట పెట్టాడు. రానున్న సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉంది కార్తీక్ తెలిపాడు. అయితే రానున్న వేలంతో తనని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవడం చాలా చాలా కష్టమని అతడు చెప్పాడు.
కాగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,ఢిల్లీ, పంజాబ్, ముంబై ఇండియన్స్, కేకేఆర్‌తో సహా ఆరు జట్లకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించాడు. నాకు ఈ ఏడాది సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉంది. కానీ అది జరగడం చాలా కష్టం. కానీ నేను ఏ ఫ్రాంచైజీకి ఆడతానో అదే నా ముఖ్యం. నేను ఆడే ఫ్రాంచైజీకి నేను చేయగలిగినదంతా చేస్తాను. నన్ను ఏ జట్టు కొనుగోలు చేసినా అది నాకు దక్కిన గౌరవం గానే భావిస్తాను. ఈ రోజుల్లో నేను చేస్తున్న ప్రాక్టీస్ అంతా ఐపీఎల్ లాంటి టోర్నీల్లో రాణించడం కోసమే అని కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment