IPL 2022: Shreyas Iyer Named as Kolkata Knight Riders Captain Announced - Sakshi
Sakshi News home page

IPL 2022: కోల్‌కతా కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు.. కేకేఆర్‌ అధికారిక ప్రకటన

Published Wed, Feb 16 2022 4:33 PM | Last Updated on Wed, Feb 16 2022 4:55 PM

IPL 2022: Shreyas Iyer Named As Kolkata Knight Riders Captain Announced - Sakshi

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కేకేఆర్‌ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ‘‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. అమ్మాయిలు.. అబ్బాయిలు... కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు హలో చెప్పండి’’ అంటూ తమ సారథులతో కూడిన ఫొటోను షేర్‌ చేసింది.

ఇందులో సౌరవ్‌ గంగూలీ, బ్రెండన్‌ మెకల్లమ్‌, గౌతమ్‌ గంభీర్‌, దినేశ్‌ కార్తిక్‌, ఇయాన్‌ మోర్గాన్‌... ప్రస్తుత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా కేకేఆర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించి శ్రేయస్‌కు మంచి రికార్డు ఉంది. అయితే, గాయం కారణంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ తొలి దశకు అతడు దూరం కాగా.. టీమిండియా యువ కెరటం రిషభ్‌ పంత్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.

జట్టును విజయాల బాట పట్టించాడు. దీంతో అయ్యర్‌ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు మెగా వేలం నేపథ్యంలో ఢిల్లీ అయ్యర్‌ను రిటైన్‌ చేసుకోలేదు కూడా. దీంతో అతడు ఆక్షన్‌లోకి రాగా కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కాగా గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది.

కేకేఆర్‌ జట్టు ఇదే..
రిటైన్డ్‌ ఆటగాళ్లు: 
ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు)
వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు)
వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు) 
సునీల్‌ నరైన్‌ (6 కోట్లు)

మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 
శ్రేయస్‌ అయ్యర్‌ (12.25 కోట్లు)
నితీశ్‌ రాణా (8 కోట్లు)
పాట్‌ కమిన్స్‌ (7.25 కోట్లు)
శివమ్‌ మావి (7.25 కోట్లు)
సామ్‌ బిల్లింగ్స్‌ (2 కోట్లు)
ఉమేశ్‌ యాదవ్‌ (2 కోట్లు)
అలెక్స్‌ హేల్స్‌ (1.5 కోట్లు)
అజింక్య రహానే (కోటి)
మహ్మద్‌ నబీ ( కోటి)
షెల్డన్‌ జాక్సన్‌ (60 లక్షలు)
అశోక్‌ శర్మ (55 లక్షలు)
అభిజీత్‌ తోమర్‌ (40 లక్షలు)
రింకు సింగ్‌ (20 లక్షలు)
అంకుల్‌ రాయ్‌ (20 లక్షలు)
రసిక్‌ దార్‌ (20 లక్షలు)
బి ఇంద్రజిత్‌ (20 లక్షలు)
ప్రీతమ్‌ సింగ్‌ (20 లక్షలు)
రమేశ్‌ కుమార్‌ (20 లక్షలు)
అమాన్‌ ఖాన్‌ (2 లక్షలు)

చదవండి: .
IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా!
IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్‌
Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్‌ ఆఫర్‌.. వైస్‌ కెప్టెన్‌గా ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement