IPL 2022 Auction Day 1: దుమ్మురేపిన శ్రేయాస్‌ అయ్యర్‌.. కేకేఆర్‌ ఆటగాళ్లు వీరే | IPL 2022 Auction Day 1: Kolkata Knight Riders Purchased Players List Telugu | Sakshi
Sakshi News home page

IPL 2022 Auction Day 1- KKR: దుమ్మురేపిన శ్రేయాస్‌ అయ్యర్‌.. కేకేఆర్‌ ఆటగాళ్లు వీరే

Published Sun, Feb 13 2022 10:28 AM | Last Updated on Sun, Feb 13 2022 11:06 AM

IPL 2022 Auction Day 1: Kolkata Knight Riders Purchased Players List Telugu - Sakshi

టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌కు ఐపీఎల్‌ మెగావేలంలో కాసుల పంట పండింది. తొలిరోజు మెగావేలంలో ఈ యువ ఆటగాడిని కేకేఆర్‌ రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మిగతావారిలో నితీష్‌ రాణాను రూ. 8 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. కేకేఆర్‌‌‌‌లో ఇప్పటికి ఐదుగురిని కొంటే నలుగురి కోసమే 34.75 కోట్లు ఖర్చు చేసింది.

ఆ టీమ్‌‌‌‌లో  క్యాప్డ్‌‌‌‌ కీపర్ లేడు. ఆ టీమ్‌‌‌‌లో ఇంకా 16 ఖాళీలు ఉండగా.. కేవలం 12.65  కోట్లే మిగిలున్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో ఇంకా ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది. కాగా కేకేఆర్‌ రిటైన్‌ జాబితాలో ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు) ఉన్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:  
శ్రేయస్‌ అయ్యర్‌ : రూ. 12 కోట్ల 25 లక్షలు 
నితీశ్‌ రాణా :  రూ. 8 కోట్లు 
శివమ్‌ మావి : రూ. 7 కోట్ల 25 లక్షలు 
పాట్‌ కమిన్స్‌: రూ. 7 కోట్ల 25 లక్షలు 
షెల్డన్‌ జాక్సన్‌: రూ. 60 లక్షలు 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement