
Courtesy: IPL Twitter
Earthquake Live Rescue OP Updates👉మయన్మార్, థాయ్‌లాండ్�...
ఢిల్లీ : మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూ�...
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొ�...
నెపిడో: మయన్మార్‌లో ఈ ఉదయం భారీగా భూమ�...
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్�...
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ �...
సొంత ఇంటికే కన్నమేసినట్లు.. తాను పని చ...
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్�...
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద...
లండన్: విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బ�...
అబుదాబి: భారత్‌తో సత్సంబంధాలను మరింత...
సంగారెడ్డి, సాక్షి: బతుకుదెరువు కోసం �...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా �...
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప �...
విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్ట�...
Published Mon, Apr 18 2022 7:03 PM | Last Updated on Mon, Apr 18 2022 11:45 PM
Courtesy: IPL Twitter
IPL 2022: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
ఆఖరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజస్తాన్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో ఫించ్, శ్రేయాస్ అయ్యర్లు ధాటిగా ఆడడంతో లక్ష్యం దిశగా కదిలింది. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ హ్యాట్రిక్ సహా ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖర్లో ఉమేశ్ సిక్సర్లు, ఫోర్‌తో హడలెత్తించినప్పటికి ఓబెడ్ మెకోయ్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీశాడు. దీంతో కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ 5, మెకోయ్ 4, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు.
లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్‌కు చహల్ గట్టిషాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీశాడు. ముందుగా వెంకటేశ్ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రసెల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 66, వెంకటేశ్అయ్యర్ 1 పరుగుగో ఆడుతున్నారు.
ధాటిగా ఆడిన ఆరోన్ ఫించ్(58) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 51, నితీష్ రాణా(0) పరుగులతో ఆడుతున్నారు.
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఫించ్ 32, శ్రేయాస్ అయ్యర్ 35 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు సునీల్ నరైన్ డైమండ్ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే నరైన్ రనౌట్‌గా వెనుదిరిగాడు
కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసింది. జాస్ బట్లర్(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి, పాట్ కమిన్స్, రసెల్ తలా ఒక వికెట్ తీశారు
సంజూ శాంసన్(38) రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. రసెల్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది
కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. జాస్ బట్లర్ 90 పరుగులతో ఆడుతూ మరో సెంచరీకి దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 163 పరుగులు చేసింది. శాంసన్ 38 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో పడిక్కల్(24) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో పడిక్కల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 74, శాంసన్ 13 పరుగులతో ఆడుతున్నారు.
ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 46, పడిక్కల్ 8 పరుగులతో ఆడుతున్నారు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. బట్లర్ 17, పడిక్కల్ 4 పరుగులతో ఆడుతున్నారు. కాగా పడిక్కల్ ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది, టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ జట్టు ఐదు మ్యాచ్‌లాడి మూడు గెలిచి.. రెండు ఓడి ఐదో స్థానంలో ఉండగా.. మరోవైపు కేకేఆర్.. ఆరు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి.. మూడు ఓటమిపాలై ఆరో స్థానంలో ఉంది.
ఇక ఇరుజట్లు 24సార్లు తలపడగా.. కేకేఆర్ 13, రాజస్తాన్ 11 విజయాలు సాధించాయి. ఇక 2018 నుంచి చూసుకుంటే.. కేకేఆర్ రాజస్తాన్‌పై 9 మ్యాచ్‌ల్లో ఏడు గెలచి ఆధిపత్యం ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment