IPL 2023, KKR Vs RR: Sanju Samson Indicated Yashasvi Jaiswal To Go For The Six And Complete The Hundred - Sakshi
Sakshi News home page

#SanjuSamson: జైశ్వాల్‌ సెంచరీ కోసం తపించిన శాంసన్‌.. 

Published Thu, May 11 2023 11:34 PM | Last Updated on Fri, May 12 2023 8:47 AM

sanju-samson-Signals-Yashaswi-jaiswal-Complete-100 Runs-With-Six Vs KKR - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం కేకేఆర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ వన్‌సైడ్‌గా మారిపోయింది. యశస్వి జైశ్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మెరుపులు తోడవ్వడంతో 150 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 13.1 ఓవర్లలోనే చేధించింది. అయితే 13 బంతుల్లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మార్క్‌ సాధించిన జైశ్వాల్‌ సెంచరీ చేసే అవకాశం లభించింది.

చివర్లో కేకేఆర్‌ బౌలర్‌ సుయాశ్‌ శర్మ జైశ్వాల్‌ సెంచరీ చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు. అయితే సంజూ శాంసన్‌ మాత్రం జైశ్వాల్‌ సెంచరీ కోసం పరితపించాడు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ ఆఖరి బంతిని సుయాశ్‌ శర్మ వైడ్‌ వేయడానికి యత్నించగా.. శాంసన్‌ వైడ్‌బాల్‌ను గెలికి డాట్‌బాల్‌గా మార్చాడు.

అనంతరం జైశ్వాల్‌వైపు చూస్తూ బ్యాట్‌ను పైకెత్తి.. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకో అన్నట్లుగా సైగ చేశాడు. తోటి ఆటగాడి సెంచరీ కోసం పరితపించిన శాంసన్‌ను అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తారు. 

చదవండి: బంతుల పరంగా అతిపెద్ద విజయం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement