సంజు శాంసన్ (PC: Disney+Hotstar)
ఐపీఎల్-2022లో అంపైర్‌ల తప్పిదాలు పునరావృతం అవుతున్నాయి. సోమవారం రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌లు తీసుకున్న నిర్ణయాల పట్ల అభిమానులు మండిపడుతున్నారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్‌లో బౌల్ట్ వేసిన షాట్ బాల్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే సంజూ శాంసన్ క్యాచ్‌కు అప్పీల్ చేయగా.. అంపైర్ అనూహ్యంగా దాన్ని వైడ్ ప్రకటించాడు.
వెంటనే సంజూ రివ్యూ తీసుకోగా.. రీప్లే లో క్లియర్‌గా గ్లోవ్స్‌ను తాకినట్లు కన్పించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో హై డ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అంపైర్ నితిన్ పండిత్ మూడు బంతులను వైడ్స్‌గా ఇచ్చాడు. ముఖ్యంగా అదే ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ బాల్‌ను అంపైర్ బాల్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో.. రాజస్తాన్ కెప్టెన్ శాంసన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఈ డ్రామా అంతటితో ముగిసిపోలేదు. ఓవర్ అఖరి బంతికి స్టైక్‌లో ఉన్న రాణాకు ప్రసిద్ధ్ వైడ్ యార్కర్ వేశాడు. అయితే బంతికి రానా బ్యాట్‌ను చాలా దగ్గరగా వెళ్లింది. అనూహ్యంగా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దీంతో మరోసాని ఆసహానానికి గురైన కెప్టెన్ సంజూ అంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం
#Samson pic.twitter.com/GMlUZyGpDE
— Vaishnavi Sawant (@VaishnaviS45) May 2, 2022
Comments
Please login to add a commentAdd a comment