యశస్వి జైశ్వాల్ శివ తాండవం.. రాజస్తాన్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. యశస్వి జైశ్వాల్(48 బంతుల్లో 98 నాటౌట్, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) శివతాండవం ఆడగా.. సంజూ శాంసన్ 29 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం.
భారీ విజయం దిశగా రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయం దిశగా దూసుకెళుతుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. జైశ్వాల్ 89, శాంసన్ 48 పరుగలతో ఆడుతున్నారు.
రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 150
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 22 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు.
వెంకటేశ్ అయ్యర్(57)ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీతో రాణించిన వెంకటేశ్ అయ్యర్(57 పరుగులు) చహల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో కేకేఆర్ 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
14 ఓవర్లలో కేకేఆర్ 110/4
14 ఓవర్లలో కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 45, రింకూ సింగ్ 2 పరుగులతో ఆడుతున్నారు.
నితీశ్ రానా(22) ఔట్.. కేకేఆర్ 77/3
22 పరుగులు చేసిన నితీశ్ రానా చహల్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
9 ఓవర్లలో కేకేఆర్ 58/2
9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. నితీశ్ రానా 17, వెంకటేశ్ అయ్యర్ 11 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
జేసన్ రాయ్(10) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా వేదికగా గురువారం 57వ మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్‌కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో జోరు చూపిన రాజస్తాన్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. మరోవైపు కేకేఆర్ మాత్రం విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment