ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్పై ఏడు వికెట్లు తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 71, 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్(36 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ 2, పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment