Courtesy: IPL Twitter
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక...
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్�...
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వ...
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్...
జైపూర్: రాజస్థాన్‌లోని ఓ పెట్రోల్ �...
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప�...
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదే�...
Published Tue, May 17 2022 6:50 PM | Last Updated on Tue, May 17 2022 11:32 PM
Courtesy: IPL Twitter
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్
కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయంతో మెరిసింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో ఆఖర్లో ఆశలు కల్పించాడు. అంతకముందు రోహిత్ శర్మ 48, ఇషాన్ కిషన్ 43 పరుగులు సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీశారు.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తడబడుతుంది. 10 ఓవర్ల వరకు పటిష్టంగా కనిపించిన ముంబై.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 15 పరుగులు చేసిన డేనియల్ సామ్స్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ప్రియమ్ గార్గ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జగదీష్ సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 29, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఆడుతున్నారు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ 42, నికోలస్ పూరన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రమన్‌దీప్ 3, బుమ్రా, మెరిడిత్, డేనియల్ సామ్స్ తలా ఒక వికెట్ తీశారు.
నికోలస్ పూరన్(38) రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్‌లో మయాంక్ మార్కండేకు క్యాచ్ ఇచ్చి పూరన్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. త్రిపాఠి 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దాటిగా ఆడుతోంది. రాహుల్ త్రిపాఠి (69*), పూరన్(37*) మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ 16 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులతో దాటిగా ఆడుతున్న ప్రియమ్ గార్గ్ రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దూకుడు కనబరుస్తోంది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికి రాహుల్ త్రిపాఠి(32), ప్రియమ్ గార్గ్(30) వేగంగా ఆడుతుండడంతో స్కోరు పరిగెడుతుంది. ప్రస్తుతం ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
ముంబైతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అభిషేక్ శర్మ డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో మయాంక్ మార్కండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ 5 పరుగులతో ఆడుతున్నాడు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 8, ప్రియమ్ గార్గ్(0) క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్-2022లో మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన స్థితిలో ఉన్న ఎస్ఆర్హెచ్.. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబైకి పెద్ద ఇబ్బంది లేకపోయినా.. ఎస్ఆర్హెచ్కు కాస్త కీలకమనే చెప్పొచ్చు.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముఖాముఖి 17 సార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్‌ల్లో, ముంబై 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment