MI Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం | IPL 2021 MI Vs SRH Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

MI Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం

Published Fri, Oct 8 2021 6:53 PM | Last Updated on Fri, Oct 8 2021 11:33 PM

IPL 2021 MI Vs SRH Match Live Updates And Highlights - Sakshi

Photo Courtesy: IPL

ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం
236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో మనీష్‌ పాండే 69 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జేసన్‌ రాయ్‌ 34, అభిషేక్‌ శర్మ 33 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో బుమ్రా, కౌల్టర్‌ నీల్‌, నీషమ్‌ తలా రెండు వికెట్లు తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (84) సూర్యకుమార్‌ యాదవ్‌(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో హోల్డర్‌ 4, రషీద్‌ ఖాన్‌ 2, ఉమ్రాన్‌ మాలిక్‌ 1 వికెట్‌ తీశారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 88/2
33 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ జిమ్మీ నీషమ్‌ బౌలింగ్‌లో కౌల్టర్‌ నీల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 8 ఓవర్లలో 95/2గా ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 70/1
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 70 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 30, మనీష్‌ పాండే 1 పరుగుతో ఆడుతున్నారు. ముంబై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌ను 65 పరుగులకు ఆలౌట్‌ చేయాలి.. అయితే ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ ఐదో బంతికి ఎస్‌ఆర్‌హెచ్‌ సింగిల్‌ తీయడం ద్వారా 65 పరుగులు పూర్తి చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 236
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (84) సూర్యకుమార్‌ యాదవ్‌(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో హోల్డర్‌ 4, రషీద్‌ ఖాన్‌ 2, ఉమ్రాన్‌ మాలిక్‌ 1 వికెట్‌ తీశారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌.. 18 ఓవర్లలో 217/7
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కౌల్టర్‌ నీల్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో నబీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 70, చావ్లా 0 పరుగులతో ఆడుతున్నారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్‌ కిషన్‌ 84 పరుగులు చేసి ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్‌ ఉన్నంతసేపు సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 31 బంతుల్లో 84 పరుగులు చేసిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు.. 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. పొలార్డ్‌ 7, సూర్యకుమార్‌ 11 పరుగులతో ఆడుతున్నారు. 

హార్దిక్‌ పాండ్యా ఔట్‌.. 9 ఓవర్లలో ముంబై 124/2
10 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా హోల్డర్‌ బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 84, పొలార్డ్‌ 5 పరుగులతో ఆడుతున్నారు.

రోహిత్‌ శర్మ ఔట్‌.. 6 ఓవర్లలో ముంబై 83/1
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) రూపంలో ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్వేర్‌లెగ్‌ దిశలో భారీ షాట్‌కు యత్నించగా మహ్మద్‌ నబీ క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ముంబై 6 ఓవర్ల్లలో వికెట్‌ నష్టానికి 82 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 63, హార్దిక్‌ 1 పరుగుతో ఆడుతున్నారు. 

చుక్కలు చూపిస్తున్న ఇషాన్‌ కిషన్‌.. 4 ఓవర్లలో 63/0
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16 బంతుల్లో 8 ఫోర్లు.. రెండు సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ముంబై స్కోరు 4 ఓవర్లలో 63 పరుగులుగా ఉంది.అతనికి రోహిత్ శర్మ 12 పరుగులతో సహకరిస్తున్నాడు. 


Photo Courtesy: IPL
అబుదాబి: ఐపీఎల్‌ 2021లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య కీలకమ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై 171 పరుగుల తేడాతో విజయం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్‌ చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్‌ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబైనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 137 పరుగులకే పరిమితమై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 17సార్లు పోటీపడగా.. 9 సార్లు ముంబై.. 8సార్లు ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా మనీష్‌ పాండే వ్యవహరించనున్నాడు. 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్

ఎస్‌ఆర్‌హెచ్‌: జేసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీష్ పాండే (కెప్టెన్‌), ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement