Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో శనివారం రాత్రి ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి పాత ఎస్‌ఆర్‌హెచ్‌ను గుర్తుచేసిన జట్టు.. ఒక్కసారిగా ఫుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీతో మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ 72 బంతులు మిగిలి ఉండగానే ముగించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు అందుకుంది.
Courtesy: IPL Twitter
ఐపీఎల్‌లో బంతులు ఎక్కువగా మిగిలిన సందర్భాల్లో విజయం సాధించిన నాలుగో జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 72 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక తొలి స్థానంలో ముంబై ఇండియన్స్(87 బంతులు, 2008లో కేకేఆర్‌పై) ఉండగా.. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్(76 బంతులు, 2011లో రాజస్తాన్ రాయల్స్‌పై) రెండో స్థానంలో, పంజాబ్ కింగ్స్(73 బంతులు, 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై) మూడో స్థానంలో, ఆర్‌సీబీ(71 బంతులు, 2018లో పంజాబ్ కింగ్స్‌పై) ఐదో స్థానంలో ఉంది.
చదవండి: IPL 2022: ఏప్రిల్ 23.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజు
IPL 2022: ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మూడో బౌలర్‌గా..!
An emphatic win for #SRH as they beat #RCB by 9 wickets 👏🔥
— IndianPremierLeague (@IPL) April 23, 2022
Splendid performance from Kane & Co. This is one happy group right now 😃😃
They move to No.2 on the points table #TATAIPL | #RCBvSRH | #IPL2022 pic.twitter.com/TocgmvruFL
Comments
Please login to add a commentAdd a comment