PC : IPL Twitter
Breadcrumb
IPL 2022: ఎస్ఆర్హెచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
Published Thu, May 5 2022 7:02 PM | Last Updated on Thu, May 5 2022 11:33 PM
Live Updates
IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ అప్డేట్స్
ఎస్ఆర్హెచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 208 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 186 పరుగులే చేయగలిగింది. పూరన్ 62 మినహా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ 2, నోర్ట్జే, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్‌లు చెరొక వికెట్ తీశారు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్లో ఐదో విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
నికోలస్ పూరన్(62) ఔట్.. పరాజయం దిశగా ఎస్ఆర్హెచ్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పరాజయం దిశగా పయనిస్తోంది. దాటిగా ఆడుతున్న నికోలస్ పూరన్(62) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
మార్క్రమ్(42) ఔట్.. నాలుగో వికెట్ డౌన్
నిలకడగా ఆడుతున్న మార్క్రమ్(42) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 38, శశాంక్ సింగ్ 6 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 90/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మార్క్రమ్ 42, నికోలస్ పూరన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 48/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. మార్క్రమ్ 11, నికోలస్ పూరన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 22 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్ గెలవాలంటే 66 బంతుల్లో 160 పరుగులు చేయాలి.
టార్గెట్ 208.. రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ చేధనలో తడబడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 21, ఎయిడెన్ మార్ర్కమ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
వార్నర్, రోవ్‌మెన్ పావెల్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ 207/3
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 92*, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మెన్ పావెల్(35 బంతుల్లో 67*, 3 ఫోర్లు, 6 సిక్సర్లు)విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ , శ్రేయాస్ గోపాల్, సీన్ అబాట్ తలా ఒక వికెట్ తీశారు.
వార్నర్, పావెల్ జోరు.. భారీ స్కోరు దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పరిగెడుతుంది. వార్నర్ 74, పావెల్ 28 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం 16 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
పంత్(26) ఔట్.. మూడో వికెట్ డౌన్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ గోపాల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా ఒక ఫోర్ బాదిన పంత్.. ఆ ఓవర్ ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ 47, పావెల్ 1 పరుగుతో ఆడుతున్నారు.
వార్నర్ దూకుడు.. ఢిల్లీ క్యాపిటల్స్ 62/2
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. వార్నర్ 41, పంత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మిచెల్ మార్ష్(10) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
మిచెల్ మార్ష్(10) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి మన్దీప్ సింగ్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ 2022లో గురువారం ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఎస్ఆర్హెచ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఇరుజట్లు ముఖాముఖి 9 సార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో గెలిపొందింది.
Related News By Category
Related News By Tags
-
వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ స్థానిక క్రికెటర్ చేతిలో దారుణంగా మోసపోయాడు. ఖరీదైన వాచీలు అమ్మిపెడతానని చెప్పిన సదరు క్రికెటర్ దాదాపు 2 కోట్ల వరకు విలువ చేసే పంత్ సొత్తును కాజేశాడు. వివరాల...
-
పంత్‌ను నిందించాల్సిన అవసరం లేదు.. శ్రేయస్ తర్వాత: పాంటింగ్
IPL 2022 DC Vs MI- Ricky Ponting Comments: ‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా రిషభ్ పంత్ సరైన ఛాయిస్ అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. గత సీజన్లో.. ఇప్పుడు కూడా తను తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడ...
-
ఊహించని ట్విస్ట్; మనం ఒకటి తలిస్తే దేవుడు మరోలా..
ఐపీఎల్ 2022 సీజన్లో శనివారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 ...
-
IPL 2022: మా ఓటమికి కారణం అదే.. ఇకనైనా: రిషభ్ పంత్
ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసే కీలక మ్యాచ్‌లో గెలుపునకై తమ జట్టు పోరాటం సరిపోలేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చే...
-
ముంబై ఇండియన్స్‌పై ఎస్ఆర్హెచ్ విజయం
Comments
Please login to add a commentAdd a comment