రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం ఈసారి భారీ మొత్తమే ఖర్చుపెట్టింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అనూహ్య రీతిలో అతడి కోసం రూ. 11.50 కోట్లు ధారపోసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సాల్ట్ కోసం.. తొలుత ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడింది.
ధరను ఏకంగా రూ. 8 కోట్ల పెంచి కేకేఆర్‌కు సవాలు విసిరింది. అయినప్పటికీ కోల్‌కతా వెనుకంజ వేయలేదు. రూ. 10 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఆ తార్వత ఆర్సీబీ ఏకంగా ధరను రూ. 11.50 కోట్లకు పెంచగా కేకేఆర్ తప్పుకొంది. దీంతో సాల్ట్ ఆర్సీబీ సొంతమయ్యాడు.
అతడొక విధ్వంసర బ్యాటర్.. పవర్ ప్లేలో..
అయితే, సాల్డ్ కోసం అంతమొత్తం వెచ్చించడం సరైందేనా అన్న చర్చల నడుమ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఫిల్ సాల్ట్.. అతడి గురించి ఏమని చెప్పాలి?!... అతడొక విధ్వంసర బ్యాటర్. పవర్ ప్లేలో ఏ బౌలర్ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు.
అలాంటి ఆటగాడు మా జట్టులో సానుకూలాంశం. ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కావాలో.. ఫిల్ అలాంటివాడే’’ అని డీకే సాల్ట్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆర్సీబీ జితేశ్ శర్మ రూపంలో మరో వికెట్ కీపర్ కోసం రూ. 11 కోట్ల ఖర్చుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సాల్ట్, జితేశ్‌లలో ఎవరు కీపింగ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టోర్నీ మొదలైన తర్వాతే మేము ఈ విషయంపై సరైన నిర్ణయానికి రాగలము. అత్యుత్తమ ఆటగాడినే మేము ఎంచుకుంటాము’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.
మూడు సెంచరీలు
కాగా ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ సగటున 36.86తో 1106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 165.32. అతడి ఖాతాలో మూడు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.
ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో సాల్ట్ 268 మ్యాచ్‌లు పూర్తి చేసకుని 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 6517 రన్స్ సాధించాడు సాల్ట్. ఇందులో మూడు సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. గతేడాది కేకేఆర్‌కు ఆడిన సాల్ట్ 12 మ్యాచ్‌లలో కలిపి.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 435 పరుగులు చేశాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
రిటెన్షన్స్: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) ,రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) ,యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు)
వేలంలో కొన్నప్లేయర్లు
హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు)
ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు)
జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)
భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు)
లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు)
రసిక్ ధార్ (రూ.6 కోట్లు)
కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు)
టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు)
జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు)
సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు)
పడిక్కల్ (రూ. 2 కోట్లు)
తుషార (రూ. 1.60 కోట్లు)
రొమరియో (రూ. 1.50 కోట్లు
ఇన్‌గిడి (రూ. 1 కోటి)
స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు)
మనోజ్ (రూ. 30 లక్షలు)
మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు)
అభినందన్ (రూ. 30 లక్షలు)
స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు)
చదవండి: Mohammed Siraj: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment