టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.
రూమర్లకు కారణం ఇదే!
అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు.
లైక్ కొట్టినంత మాత్రాన
అంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు.
క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం
కాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.
గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమే
ఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది.
అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.
అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో
ఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..!
Comments
Please login to add a commentAdd a comment