ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సికందర్ రజా లాంటి చాలా మంది స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఈ అన్ సోల్డ్ ప్లేయర్లతో ఓ పటిష్టమైన జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
ఈ జట్టుకు ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఉంటారు. వీరిద్దరు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి ఆడారు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. వయసు పైబడటం, పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.
పృథ్వీ షా విషయానికొస్తే.. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 147.5 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు చేశాడు. అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. పైగా షా ఓవర్ వెయిట్ అయ్యాడు. అతనిపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపడానికి ఇదీ ఒక కారణం అయ్యి ఉండవచ్చు.
వన్‌డౌన్ విషయానికొస్తే.. ఈ స్థానంలో విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్‌ను ఆడిస్తే బాగుంటుంది. మేయర్స్ గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. మేయర్స్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. నాలుగో స్థానం విషయానికొస్తే.. ఈ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడితే బాగుంటుంది. స్టీవ్‌కు పొట్టి ఫార్మాట్‌లో సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం వల్ల అతను అమ్ముడుపోలేదు.
ఐదో స్థానంలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వస్తే బాగుటుంది. బెయిర్‌స్టో ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. ఆరో స్థానంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆడితే బాగుంటుంది. ఏడో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఎనిమిదో స్థానంలో విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్ బరిలోకి దిగితే బాగుంటుంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమేశ్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బరిలోకి దిగితే ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు రూపుదిద్దుకుంటుంది.
ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లతో జట్టు..
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, కైల్ మేయర్స్, స్టీవ్ స్మిత్, డెవాల్డ్ బ్రెవిస్, సికందర్ రజా, అకీల్ హొసేన్, ఆదిల్ రషీద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఉమేశ్ యాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment