PC: Twitter
విజయ్ హజారే ట్రోఫీ-2023లో తమిళనాడు తొలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది. తమిళనాడు కెప్టెన్, టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
252 పరుగుల లక్ష్య ఛేదనలో 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తమిళనాడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ జట్టును అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ కార్తీక్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఆఖరికి సిద్దార్ద్ కౌల్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.
దీంతో కార్తీక్ పోరాటం ముగిసింది. కార్తీక్ ఔటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 175 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో సిద్దార్ద్ కౌల్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డికే.. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కార్తీక్‌ను రిటైన్ చేసుకుంది.
చదవండి: ఐపీఎల్-2024 షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే?
Comments
Please login to add a commentAdd a comment