
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు దినేష్ కార్తీక్ అర్ధసెంచరీతో మెరిశాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఆరంభంలో తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో దినేష్ కార్తీక్, బాబా అపరిజిత్ తమిళనాడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి తమిళనాడు 4వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో దినేష్ కార్తీక్(68), అపరిజిత్(49) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది.
చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment