Baba aparajit
-
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్‌ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
సెంచరీతో మెరిసిన ‘టైటాన్స్’ బ్యాటర్.. వాషింగ్టన్ సుందర్ మాత్రం!
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో మ్యాచ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 180 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ బాబా అపరాజిత్ (88; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం నాటి మూడో రోజు ఆట ఫస్ట్ సెషన్ సమయానికి 6 వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 336 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కంటే 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడు- ఆంధ్ర జట్ల మధ్య డిసెంబరు 20న టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర.. 297 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అభిషేక్ రెడ్డి 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రికీ భుయ్ 68, కరణ్ షిండే 55 పరుగులు చేశారు. వాషీ ప్రభావం చూపలేకపోయాడు తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు, వారియర్‌కు మూడు, సాయి కిషోర్‌కు మూడు, అజిత్ రామ్, విజయ్ శంకర్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయని వాషీ.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. 13 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా సాయి సుదర్శన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ప్రదర్శనను కొనియాడుతూ టైటాన్స్ ట్వీట్ చేసింది. చదవండి: Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ -
సెంచరీతో చెలరేగిన బాబా అపరాజిత్.. ఆధిక్యంలో తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: బౌలర్ల వైఫల్యం కారణంగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 203/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 111.5 ఓవర్లలో 4 వికెట్లకు 510 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ (116; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే స్కోరు వద్ద కార్తికేయ కక్ బౌలింగ్‌లో అవుటవ్వగా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (273 బంతుల్లో 179; 18 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబా అపరాజిత్ (165 బంతుల్లో 115; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. అపరాజిత్ సోదరుడు ఇంద్రజిత్ (52 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అపరాజిత్ అవుటైన వెంటనే తమిళనాడు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. 115 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (14; 3 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్ కాగా... కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5 బ్యాటింగ్), తనయ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు పోరాడి ‘డ్రా’ చేసుకుంటారో చేతులెత్తేసి ఓటమిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి. చదవండి: Mohammed Rizwan: వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..! -
జగదీశన్ విధ్వంసం.. చెలరేగిన సిద్దార్థ! ఏకంగా 435 పరుగుల తేడాతో..
Vijay Hazare Trophy 2022- Narayan Jagadeesan: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సోమవారం తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్ ‘ఏ’ క్రికెట్(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఎలైట్ గ్రూప్- సీలో ఉన్న తమిళనాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అరుణాచల్ జట్టుకు తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, నారయణ్ జగదీశన్ చుక్కలు చూపించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చెలరేగిన సిద్ధార్థ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు తమిళనాడు బౌలర్లు. ఓపెనర్లు నీలమ్ ఓబి(4), రోషన్ శర్మ(2)ను సిలంబరసన్ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాత సాయి కిషోర్(ఒక వికెట్), సిద్దార్థ్(7.4 ఓవర్లలో 12 మాత్రమే పరుగులు ఇచ్చి 5 వికెట్లు), మహ్మద్(2 వికెట్లు) మిగతా బ్యాటర్ల పనిపట్టారు. 71 పరుగులకే కుప్పకూలిన అరుణాచల్ తమిళనాడు బౌలర్ల విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దారుణ వైఫల్యం మూటగట్టుకున్నారు. వరుసగా 4, 2, 11, 14, 17, 0, 6, 3(నాటౌట్), 0,0,0 స్కోర్లు నమోదు చేశారు. దీంతో 28. 4 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి అరుణాచల్ జట్టు ఆలౌట్ అయింది. 435 పరుగుల తేడాతో బాబా అపరాజిత్ బృందం జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. సమిష్టి కృషితో సంచలన విజయం అందుకుంది. చదవండి: Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..? #Jagadeesan (277) misses out on triple hundred. Gets a big ovation from teammates after world record List A score. @sportstarweb #VijayHazareTrophy2022 pic.twitter.com/s8CKYgUXsc — Ashwin Achal (@AshwinAchal) November 21, 2022 -
TNPL 2022: క్రికెటర్ అసభ్యకర సంజ్ఞ.. ఛీ.. నీకసలు బుద్ధుందా? ఇంత దిగజారుతావా?
Tamilnadu Premier League-2022: తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 గురువారం(జూన్ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, నెలాయి రాయల్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇండియన్ సిమెంట్ కంపెనీ గ్రౌండ్లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తీవ్ర ఉత్కంఠ.. టై ఈ క్రమంలో రాయల్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా రాయల్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ జట్టు బ్యాటర్ సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చెపాక్ సూపర్ గిల్లీస్ ఓపెనర్ ఎన్. జగదీశన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూల్స్ నచ్చకపోతే క్రికెట్ ఆడటం మానేసెయ్.. అంతేగానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బుద్ధి ఉందా అసలు? కాగా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్ ఇన్నింగ్స్ సమయంలో 3.4వ ఓవర్లో బాబా అపరాజిత్ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జగదీశన్ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్ జగదీశన్ మన్కడింగ్ చేయడంతో రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్ అసభ్యకర సంజ్ఞ చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌లోనే ఇలా వివాదానికి కారణమయ్యాడని, ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది.. ముందు నిబంధనలు తెలుసుకుని ఆడు అంటూ నెటిజన్లు జగదీశన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ది ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది రనౌటే! క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమల్లోకి రానున్నాయి. చదవండి: Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్మెంట్ గనుక ఉండి ఉంటే! TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! A royal comeback from the @NRKTNPL ! Watch Shriram Capital TNPL on @StarSportsTamil & @StarSportsIndia Also, streaming live for free, only on @justvoot ! Download the app now! #NammaOoruNammaGethu#TNPL2022#VootonTNPL#TNPLonVoot#TNPLonStarSportsTamil#CSGvsNRK pic.twitter.com/onCAfd4z58 — TNPL (@TNPremierLeague) June 23, 2022 🤐🤐🤐🤐 @Jagadeesan_200 @aparajithbaba senior players of tn🤐🤐🤐 pic.twitter.com/C9orMqRPL3 — Jayaselvaa ᅠ (@jayaselvaa1) June 23, 2022 -
Ranji Trophy: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్‌లో..
Ranji Trophy 2022 Tamil Nadu vs Chhattisgarh: రంజీ ట్రోఫీ-2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ చరిత్ర సృష్టించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరూ సెంచరీ సాధించి అరుదైన ఫీట్ నమోదు చేశారు. తద్వారా క్రికెట్ రికార్డు బుక్‌లో తమ పేరు లిఖించుకున్నారు. కాగా ఎలైట్ గ్రూపు హెచ్లో భాగంగా గువాహటి వేదికగా తమిళనాడు- ఛత్తీస్‌గఢ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టుకు ఓపెనర్లు కౌశిక్ గాంధీ, లక్ష్మేష సూర్యప్రకాశ్ శుభారంభం అందించలేకపోయారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన బాబా అపరాజిత్ 267 బంతులు ఎదుర్కొని 166 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన బాబా ఇంద్రజిత్ 141 బంతుల్లో 21 ఫోర్ల సాయంతో 127 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అరుదైన రికార్డు వీరి సొంతమైంది. ఇక వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో తమిళనాడు రెండో రోజు ఆటలో పటిష్ట స్థితికి చేరుకుంది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయానికి 118 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 470 పరుగులు చేసింది. చదవండి: Ind Vs Sl 1st T20: బుమ్రాను ఆడించడం ఏమిటి.. నిజంగా ఆశ్చర్యపోయా.. వాళ్ల సంగతి ఏంటి: టీమిండియా మాజీ బౌలర్ -
అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్..
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు దినేష్ కార్తీక్ అర్ధసెంచరీతో మెరిశాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఆరంభంలో తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దినేష్ కార్తీక్, బాబా అపరిజిత్ తమిళనాడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి తమిళనాడు 4వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో దినేష్ కార్తీక్(68), అపరిజిత్(49) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతోంది. చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ రీ ఎంట్రీ! -
భారత్ శుభారంభం
చిట్టగాంగ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ అండర్–23 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో శ్రీలంక జట్టుపై గెలిచింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగులు చేసింది. కెప్టెన్ బాబా అపరాజిత్ (100; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టాడు. హనుమ విహారి (56; 6 ఫోర్లు), శివమ్ (56; 7 ఫోర్లు) రాణించారు. తర్వాత శ్రీలంక 48.2 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది.