సాయి సుదర్శన్(ఫైల్ ఫొటో)
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో మ్యాచ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 180 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ బాబా అపరాజిత్ (88; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది.
గురువారం నాటి మూడో రోజు ఆట ఫస్ట్ సెషన్ సమయానికి 6 వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 336 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కంటే 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడు- ఆంధ్ర జట్ల మధ్య డిసెంబరు 20న టెస్టు ఆరంభమైంది.
ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర.. 297 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అభిషేక్ రెడ్డి 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రికీ భుయ్ 68, కరణ్ షిండే 55 పరుగులు చేశారు.
వాషీ ప్రభావం చూపలేకపోయాడు
తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు, వారియర్‌కు మూడు, సాయి కిషోర్‌కు మూడు, అజిత్ రామ్, విజయ్ శంకర్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయని వాషీ.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు.
13 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ప్రదర్శనను కొనియాడుతూ టైటాన్స్ ట్వీట్ చేసింది.
చదవండి: Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment