Vijay Hazare Trophy Final 2021: Dinesh Karthik Century 314 Vs Tamil Nadu - Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy Final: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్‌ 21 బంతుల్లో 42! హిమాచల్‌కు గట్టి సవాల్‌

Published Sun, Dec 26 2021 1:02 PM | Last Updated on Sun, Dec 26 2021 5:30 PM

Vijay Hazare Trophy Final HP Vs TN: Dinesh Karthik Century TN Score 314 - Sakshi

PC: BCCI

Vijay Hazare Trophy Final HP Vs TN- Dinesh Karthik Century: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్‌లో తమిళనాడు బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అదరగొట్టాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఊపిరినిచ్చి ప్రత్యర్థికి గట్టి సవాల్‌ విసరడంలో తన వంతు పాత్ర పోషించాడు. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ దేశవాళీ టోర్నమెంట్‌ తుదిపోరులో తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌ పోటీపడుతున్నాయి. 

ఇందులో భాగంగా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు అపరాజిత్‌(2 పరుగులు), జగదీశన్‌(9) సహా సాయి కిషోర్‌(18), అశ్విన్‌(7) ఘోరంగా విఫలమయ్యారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ అద్భుతమైన సెంచరీతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి తోడుగా ఇంద్రజిత్‌ సైతం 80 పరుగులతో రాణించాడు. ఇక షారుఖ్‌ ఖాన్‌ సైతం 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలో తమిళనాడు 10 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో పంకజ్‌ జైస్వాల్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement