దినేశ్ కార్తిక్ (PC: BCCI)
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌కూ గుడ్‌బై?
అదే విధంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా డీకే గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు.
వికెట్ కీపర్‌గానూ మెరుగ్గా రాణించిన దినేశ్ కార్తిక్ ఖాతాలో ఒకే ఒక సెంచరీ(టెస్టుల్లో) ఉంది. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ఈ చెన్నై ప్లేయర్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 242 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4516 పరుగులు సాధించాడు. 133 డిస్మిసల్స్‌లోనూ భాగమయ్యాడు ఈ వికెట్ కీపర్.
2008 నుంచి ఇప్పటి దాకా
ఇక 2008లో ఈ టీ20 లీగ్ మొదలైన నాటి ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఇప్పటి వరకు ఆరు ఫ్రాంఛైజీలకు దినేశ్ కార్తిక్ ప్రాతినిథ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(కెప్టెన్‌గానూ)లకు ఆడిన డీకే.. గత రెండు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.
అనూహ్యంగా వరల్డ్‌కప్ జట్టులో
ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్‌గా అదరగొట్టిన దినేశ్ కార్తిక్.. ఆ ఏడాది అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మెగా టోర్నీలో విఫలమైన అతడు మళ్లీ భారత జట్టులో స్థానం పొందలేకపోయాడు.
అందుకే రిటైర్మెంట్ నిర్ణయం!
అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం తమిళనాడు తరఫున బరిలోకి దిగుతూనే ఉన్నాడు 38 ఏళ్ల దినేశ్ కార్తిక్. కామెంటేటర్‌గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 తర్వాత ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌కూ స్వస్తి పలికి.. కేవలం డొమెస్టిక్ క్రికెట్ మీద దృష్టి సారించాలని డీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ప్రచురించింది.
చదవండి: సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
Comments
Please login to add a commentAdd a comment