టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.
తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా.
దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.
దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!
ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.
నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.
తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.
2004లో అరంగేట్రం
తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.
మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.
చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!
Comments
Please login to add a commentAdd a comment