PC: BCCI
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై... హిమాచల్ ప్రదేశ్ ఐదు వికెట్లతో ఉత్తర ప్రదేశ్‌పై గెలిచాయి. కర్ణాటకతో మ్యాచ్‌లో తొలుత తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగులు చేసింది. జగదీశన్ (102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు.
షారుఖ్ ఖాన్ (39 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. మరో క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రశాంత్ చోప్రా (99; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), హిమాచల్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం!
WHAT. A. WIN! 👍 👍
— BCCI Domestic (@BCCIdomestic) December 21, 2021
The @rishid100-led Himachal Pradesh beat Uttar Pradesh by 5 wickets in the #QF1 of the #VijayHazareTrophy & seal a place in the semifinals. 👏 👏 #HPvUP
Scorecard ▶️ https://t.co/gXfyqMBD2N pic.twitter.com/MW6Yl0XYkw
Comments
Please login to add a commentAdd a comment