
చెన్నై: సాధారణంగా పెళ్లంటే ఆటలు, పాటలు... బంధువులు, స్నేహితుల సందడి ఉంటుంది. వధూవరుల కుటుంబాలు పరస్పరం ఆటపట్టించుకోవడాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో ఓ వధువు మాత్రం తనలో దాగున్న నైపుణ్యాన్ని వెలికితీసి అతిథులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ప్రదర్శించి పెళ్లికి హజరైనవారితో ఔరా అనిపించుకుంది. వివరాలు.. తమిళనాడులోని తిరుకోలూర్ గ్రామానికి చెందిన నిషాకు ఆదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం నిశ్చియించారు.
అయితే, తమ వివాహ వేడుక సాదాసీదాగా కాకుండా సమాజానికి ఎంతోకొంత ఉపయోగంగా ఉండాలని భావించాడు వరుడు రాజ్‌కుమార్. కాబోయే భార్యతో గ్రామంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాడు. వధూవరులు చేసిన పనిని బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. కాగా.. నిషా.. తన తల్లి ప్రోత్సహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. పెళ్లి సమయంలో సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలను ధరించి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించింది. నిషా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన వివాహ వేడుకలో హైలెట్‌గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment