marshal arts
-
ప్రపంచంలోని టాప్ 10 మార్షల్ ఆర్ట్స్ వీరులు వీరే
-
మన చందు ‘బంగారం’
సాక్షి, బచ్చన్నపేట(వరంగల్): ప్రతిభకు పేదరికం అడ్డురాదు. లక్ష్యం.. పట్టుదలకు కఠోర దీక్ష తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం అంజయ్యనగర్‌కు చెందిన బొలుగుల చందు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఐదో ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ (అండర్–19) కరాటే కుంగ్ ఫూ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించాడు. తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి కంకుల విక్రయం బొలుగుల యాదగిరి, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు చందు. నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరి రోజూ ఆటో నడుపుతుండగా.. భార్య సునీత మొక్కజొన్న కంకులు విక్రయించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చందు 5వ తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మండల కేంద్రంలో చదువుకున్నాడు. ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేటలో డిగ్రీ ఫస్టియర్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న చందు ఎనిమిదవ ఏట కరాటే కుంగ్‌ఫూ నేర్చుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ మాస్టర్ బచ్చన్నపేటకు వచ్చి కుంగ్‌ఫూ నేర్పించేవారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించేలా.. ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ కుంగ్‌ఫూ పోటీల్లో 14 దేశాలు పాల్గొనగా.. భారతదేశం నుంచి బొలుగుల చందు బరిలోకి దిగాడు. పలు దేశాల క్రీడాకారులతో తలపడి విజయం సాధించిన చందు ఫైనల్స్‌లో కొరియా ప్లేయర్‌పై 5–4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలిరౌండ్లో భూటాన్‌పై 5–3, సెమీ ఫైనల్లో నేపాల్ ప్లేయర్‌పై 5–3 తేడాతో విజయాలను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు పసిడి పతకం దక్కించుకున్నాడు. దాతల సాయంతో నేపాల్‌కు.. ఫైనల్ పోటీలకు ఎంపికైన చందు నేపాల్‌కు వెళ్లడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. కనీసం రవాణా చార్జీలకు సైతం చేతిలో డబ్బులు లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన పలువురు దాతలు, అలాగే మంత్రి కేటీఆర్ సహాయంతో నేపాల్ వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ మెరుపు మెరిసిన చందును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
పెళ్లిలో వధువు అద్భుత విన్యాసాలు: వావ్ అంటున్న నెటిజన్లు!
చెన్నై: సాధారణంగా పెళ్లంటే ఆటలు, పాటలు... బంధువులు, స్నేహితుల సందడి ఉంటుంది. వధూవరుల కుటుంబాలు పరస్పరం ఆటపట్టించుకోవడాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో ఓ వధువు మాత్రం తనలో దాగున్న నైపుణ్యాన్ని వెలికితీసి అతిథులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ప్రదర్శించి పెళ్లికి హజరైనవారితో ఔరా అనిపించుకుంది. వివరాలు.. తమిళనాడులోని తిరుకోలూర్ గ్రామానికి చెందిన నిషాకు ఆదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహం నిశ్చియించారు. అయితే, తమ వివాహ వేడుక సాదాసీదాగా కాకుండా సమాజానికి ఎంతోకొంత ఉపయోగంగా ఉండాలని భావించాడు వరుడు రాజ్‌కుమార్. కాబోయే భార్యతో గ్రామంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యాడు. వధూవరులు చేసిన పనిని బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. కాగా.. నిషా.. తన తల్లి ప్రోత్సహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. పెళ్లి సమయంలో సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణాలను ధరించి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించింది. నిషా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన వివాహ వేడుకలో హైలెట్‌గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఎలుగుబంటి కర్రసాము చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!
యానిమేషన్ కామిక్ సిరిస్‌లలో కుంగ్ఫు పాండాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చైనా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో పాండా చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి, నవ్విస్తాయి. అయితే చైనీయుల క్రియేషన్ పాండాతో పోటీ పడుతోంది ఇండియన్ ఎలుగుబంటి. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద తాజాగా కుంగ్ ఫూ బేర్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కర్రను చేతబట్టిన గుడ్డెలుగు కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అలవోకగా చేసింది. రూరల్ ఇండియాలో తీసిన కుంగ్ ఫూ బేర్ వీడియో చూసిన వాళ్ల మోముళ్లో నవ్వులు పూయిస్తోంది. Kung fu bear😧 pic.twitter.com/QmcpEvkjXx — Susanta Nanda IFS (@susantananda3) June 25, 2021 చదవండి : పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
దేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి వైఎస్సార్: సుమన్
సాక్షి, విజయవాడ: ఆయుధాన్ని నమ్ముకోవడం కంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శరీరాన్నే ఆయుధంగా మలుచుకోవాలని మార్షల్ ఆర్ట్స్‌కు స్ఫూర్తి, ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. ఒక్కోసారి ఆయుధం మొరాయిస్తుందని, అదే ఆయుధం ప్రత్యర్థి చేతికి చిక్కే సమస్య ఉంటుందన్నారు. ఇందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా స్వీయరక్షణకు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చన్నారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ స్మారక 10 జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీల్లో ప్రారంభోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారక కరాటే పోటీల్లో పాల్గొన డం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కా చెల్లిమ్మలకు రుణాలు ఇలా ఎన్నో ఎవరూ ఊహించని సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప మహానేత తనకు చాలా ఇష్టమన్నారు. ఆ మహానేత బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. దిశలాంటి సంఘటనలను ఎదుర్కొవడానికి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని, ఇందుకు ప్రతి పాఠశాలలో కరాటే విద్యను నేర్పించాలని తాను సీఎం జగన్‌ను కోరతానని అన్నారు. తొలుత ఈ పోటీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు చేసిన మార్చ్ఫాస్ట్ వందన స్వీకారాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్, అకాడమీ వ్యవస్థాపకుడు సైదులు, పోటీల నిర్వాహకులు చిన్నపురెడ్డి, కాత్యాయని, సత్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వేమారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, జార్జి వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కలర్ బెల్ట్ కేటగిరీలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ కైవసం చేసుకుంది. బ్లూబెల్ట్ కేటగిరీలో తమిళనాడు, గ్రీన్ బెల్ట్ కేటగిరీలో కర్ణాటక, పర్పుల్ బెల్ట్ కేటగిరీలో ఏపీ క్రీడాకారులు తమ సత్తాను చాటారు. దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారులు కరాటే విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్జేడీలకు, అన్ని జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. 100కు పైగా విద్యార్థినులున్న పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.9 వేల చొప్పున రూ.1.38 కోట్లు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద కేటాయించారు. 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,513 ఉన్నత పాఠశాలలు మొత్తంగా 1,544 పాఠశాలల్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణను ఈనెలలో ప్రారంభించి ఫిబ్రవరి వరకు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంచేశారు. ప్రతి వారం రెండు క్లాసులు (క్లాస్‌కు గంట చొప్పున రెండు గంటలు) నిర్వహించాలని, అర్హత కలిగిన వారితోనే శిక్షణ ఇప్పించాలని, వారికి నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలలు చెల్లించాలని సూచించారు. -
సరయు : డాన్స్, ఫైట్స్, ఆర్ట్స్
ఆ బాలిక కుంచె పట్టుకుంటే ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్ ఆర్ట్స్... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. ‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. మరోవైపు చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం కరాటే కిక్ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా... ‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది. మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను స్వంతం చేసుకుంది. నాట్యం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కైతే.. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్‌కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు స్పానిష్ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది. డెర్మటాలజిస్ట్ కావాలని..! ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్ బ్యాక్కల్యూరేట్ (ఐబి) కరిక్యులమ్కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన గ్రేడ్ టెన్ ఐబి పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. – ఎస్.సత్యబాబు -
పాడు చేతుల నుంచి కాపాడుకో
అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని దినదిన గండంగా మసులుకోవాలి? ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్ ఉద్యోగినులు మార్షల్ ఆర్ట్స్ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్‌చున్ కుంగ్‌ఫూ పేరొందింది. ఎందుకంటే... అన్నీ అనువైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం. మహిళల చేత.. మహిళల కోసం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్ చున్ కుంగ్ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్ మహిళ.. వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠవింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ... బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపి మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్ చున్ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు. శక్తి ప్రదర్శన కోసం కాదు ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్ వింగ్ చున్.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు. మగవాళ్లు / మహిళలు నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ నేర్పిస్తారు? స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జిఓ ‘స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణా కేంద్రం స్థాపించింది. రెండేళ్లు సాధన... ► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది. ► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు. ► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్‌లో ఉన్న అందరూ దీన్ని సాధన చేయవచ్చు. ► శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం అవసరం ఉండదు. ► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు. ► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం. వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు – ఎస్.సత్యబాబు -
అయికిడో ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో వచ్చని.. అందులో తనకు బ్లాక్ బెల్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అయికిడో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను ఆయన అధికార ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ అయికిడో ప్రాక్టీస్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. -
తైక్వాండోతో ఆత్మరక్షణ
కర్నూలు(టౌన్) : ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో అవసరమని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక యునైటెడ్ క్లబ్ యోగా హాల్లో రాష్ట్రస్థాయి యంగ్‌మూడో (తైక్వాండో) పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం ఆయుధం అవసరం లేని ఆయుధమే యంగ్‌మూడో క్రీడ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ క్రీడకు మంచి ప్రాచుర్యం పొందిందన్నారు. మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. అలాగే జాతీయ స్థాయి యంగ్‌మూడో పోటీల్లో ప్రతిభ కనపరచి విజేతలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యంగ్‌మూడో సౌత్‌జోన్ డైరెక్టర్ ఫ్రాంక్ ఎడెల్ సహాయ్ రాష్ట్ర ప్రతినిధి దాదాబాషా, సహాయ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో అవసరం
కర్నూలు(టౌన్): ఏకాగ్రత, క్రమశిక్షణకు తైక్వాండో క్రీడ ఎంతో అవసరమని తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఏ.క్యాంపు మాంటిస్సోరి స్కూలు ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో సబ్‌జూనియర్ బాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సబ్ జూనియర్ బాలికలు 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తైక్వాండో జిల్లా కార్యదర్శి జి. శోభన్ బాబు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో అభ్యసించడంతో క్రమబద్ధమైన జీవనం అలవాడుతుందన్నారు. బాలికలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు, మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
3న మార్షల్ ఆర్ట్స్ లోగో ఆవిష్కరణ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 3న మార్షల్‌ఆర్‌్ట్స లోగోను ఆవిష్కరించనున్నట్లు మార్షల్‌ఆర్‌్ట్స అసోసియేష¯ŒS ఆఫ్ అనంతపురం అధ్యక్షుడు అమర్నాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మాఆఆ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని యుధ్ధకâýæలు నేర్పించే మాస్టర్లందరూ హాజరుకావాలని ఆయన కోరారు. -
ఆ ఫైట్స్‌కు 35 కోట్ల బీమా
వెండితెరపై ప్రతినాయకుణ్ణి కథానాయకుడు రఫ్ఫాడిస్తుంటే, అది నటనే అయినా నిజమని ఫీలైపోయి అభిమానులు సంబరపడిపోతారు. అక్షయ్‌కుమార్ లాంటి హీరోలు మాత్రం ఎంత రిస్క్ అయినా సరే వెనక్కి తగ్గరు. స్వయంగా తామే ఫైట్స్ చేస్తారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అక్షయ్‌కుమార్ రిస్కులు తీసుకునే విషయంలో అప్పుడప్పుడు హద్దులు దాటేసి, జీవితాన్ని రిస్కులో పడేసుకుంటుంటారు. గాయాల బారిన పడితే కష్టమని ప్రమాద బీమా చేయించుకుంటారు. సాదాసీదా మనుషులైతే లక్షల్లో బీమా చేయించుకుంటారు. అక్షయ్ సూపర్ స్టార్ కాబట్టి ఏ కోటి రూపాయలకో తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ, ‘హాలీడే’ సినిమా కోసం ఆయన ఏకంగా 35 కోట్ల రూపాయలకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. హిందీ సినీ రంగంలో ఈ స్థాయిలో బీమా చేయించుకున్నది ఒక్క అక్షయ్కుమారేనట. విచిత్రం ఏమిటంటే, బాలీవుడ్లో భారీస్థాయి పారితోషికాలు తీసుకొనే షారుఖ్, ఆమిర్‌ఖాన్‌లు సైతం సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రత్యేకించి, బీమా చేయించుకోవడం లేదు. షూటింగ్ సమయంలో ఏదైనా గాయాలైతే, వైద్యఖర్చుల నిమిత్తం పనికొస్తుందని చిత్ర నిర్మాణ సంస్థలే యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ 5 నుంచి 10 లక్షల మేరకు బీమా చేస్తున్నాయి. ‘రౌడీ రాథోడ్’, ‘బేబీ’, ‘ఖిలాడీ 786’ లాంటి చిత్రాల్లో యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి, రిస్కీ ఫైట్స్‌తో ‘ఖిలాడీ కుమార్’ అని పేరు తెచ్చుకున్న అక్షయ్ గతంలోనూ గాయాల బారినపడ్డారు. అయితే, అక్షయ్ కుమార్ లాంటి కొందరిని పక్కన పెడితే, హిందీ సినీ రంగంలో ఇప్పటికీ చాలామంది స్టార్స్ బీమా అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రమే. -
సమసమాజాన్ని నిర్మించాలి
గుంటూరు ఈస్ట్ : సమసమాజ స్థాపన దిశగా యువతను తీర్చిదిద్దడానికి నెహ్రూ యువకేంద్రం కృషి చేయాలని అదనపు జేసీ వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. వసంతరాయపురంలోని కోల్పింగ్ సెంటరులో ఈ నెల 19వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరంలో బుధవారం జాతీయస్థాయి యువసాధికారత సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జేసీ మాట్లాడుతూ యువత దేశ సంక్షేమం, సమగ్రత కోసం కృషి చేయాలని హితవు పలికారు. జిల్లా యువ కేంద్రం కోఆర్డినేటర్ బి.జె.ప్రసన్న మాట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన గ్రామీణ యువతీ యువకులతోపాటు మన రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన వారు శిబిరంలో పాల్గొంటున్నారని చెప్పారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. శిబిరంలో పాల్గొన్న యువత ప్రదర్శించిన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్ ఆహూతులను అలరించాయి. జానపద నృత్యాలు, కర్రసాము, చెక్క భజనలు, కోలాటం చూపరులను కట్టిపడేశాయి. వివిధ జిల్లాల యూత్ కోఆర్డినేటర్లు, కోల్పింగ్ సెంటర్ యూత్ డెరైక్టర్ ఫాదర్ బాలస్వామి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్ బ్రిగేడ్’ రెడీ
రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచార వార్తలను ఖండిస్తూ బోలెడన్ని మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కి పోరాడుతున్నాయి. అయితే ఏం లాభం? అక్కడక్కడా రక్షించమంటూ... అమ్మాయిలు చేసే ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే... అమ్మాయిలే రంగంలోకి దిగాలంటూ పిలుపునిచ్చింది ఓ పాతికేళ్ల ఉపాధ్యాయురాలు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గర మదియవ కాలనీకి చెందిన ఉషా విశ్వకర్మ అనే టీచర్ ఏడాదిక్రితం ‘రెడ్ బ్రిగేడ్’ పేరుతో ఒక గ్యాంగ్ తయారు చేయాలనుకుంది. లైంగికదాడికి గురైన అమ్మాయిలు, వేధింపులకు గురైనవారితో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులను ఆ గ్యాంగ్‌లో చేర్చుకుంది. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు, వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా ఒంటపట్టించుకున్న ఈ గ్యాంగ్ సెలవుదినాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి తోటి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నాలు చేస్తోంది. పట్టుమని పాతికేళ్లు లేని టీచర్ ఉషకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏడాది క్రితం జరిగిన నిర్భయ ఘటన మాత్రమే కాదు. తన చుట్టుపక్కల అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులు కూడా. వీటిని అరికట్టడానికి ‘రెడ్ బ్రిగేడ్’ చాలా ధైర్యాన్నిస్తుందని చెబుతుందామె. ఈ గ్యాంగ్‌లో చేరినవారంతా ఎరుపురంగు దుస్తులు ధరించడం ఒక నియమం అన్నమాట. -
బ్రూస్లీ 40వ వర్థంతి