
సాక్షి, చెన్నై: ఆగస్టు 31వ తేదీతో ముగుస్తున్న లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 5వ తేదీ నుంచి ఆదివారాల్లో అన్ని బీచ్‌లలో ఇకపై సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించారు. వారాంతపు మూడురోజులు (శుక్ర, శని, ఆది) అన్ని ప్రార్థనాలయాలు మూసివేసే ప్రక్రియను కొనసాగిస్తారు.
కేరళలో రోజుకు 30వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు–కేరళ సరిహద్దు ప్రాంతాలైన కోయంబత్తూరు, కన్యాకుమారీ, తెన్‌కాశీ, తేనీ జిల్లాల్లోని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని, కేరళ నుంచి వచ్చే పౌరులకు కరోనా పరీక్షలు చేసిన తరువాతనే అనుమతించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment