
చక్రవర్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాను అభ్యుదయవాదిని వితంతు వైద్యురాళ్లకి జీవితాన్ని ఇస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయలు మోసం చేసిన యువకుడిని తిరువణ్ణామలై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరువణ్ణామలైకు చెందిన చక్రవర్తి అనే యువకుడు మ్యాట్రిమోనియంలలో తన పేరు అజయ్, విజయ్, విజయ్‌కుమార్, విదు, శరవణ్ ఇలా అనేక పేర్లతో నమోదు చేసుకున్నాడు. భర్తను కోల్పోయిన వైద్యురాళ్లనే లక్ష్యంగా చేసుకుని సంతానం ఉన్నా సరే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని నమ్మిస్తాడు.
అతని వలలో పలువురు వైద్యురాళ్లుపడ్డారు. చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు అతడికి రూ. 50 లక్షలు అప్పగించింది. అలాగే, లాల్కుడికి చెందిన మరో వైద్యురాలు రూ. 20 లక్షలు ఇచ్చి తనూ మోసపోయింది. అయితే, అతను పెళ్లి చేసుకోకుండా మోసం చేయడంతో లాల్కుడి వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికవేధింపులు, మోసం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment