రాశి బాగుంది | Rashi Khanna Best Acting In All Movies | Sakshi
Sakshi News home page

రాశి బాగుంది

May 17 2019 10:06 AM | Updated on May 17 2019 10:06 AM

Rashi Khanna Best Acting In All Movies - Sakshi

తమిళసినిమా: ఏ రంగంలోనైనా ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. సినిమా రంగంలోనూ కాస్త వెనుకా ముందుగా గుర్తిస్తారు. అలా ఏళ్ల తరబడి పోరాడి గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రతిభను పక్కన పెడితే అదృష్టం కలిసొస్తే విజయాలతో పాటు ఆవకాశాలు తన్నుకొస్తాయి. ఇక్కడ సెంటిమెంట్, రాశిని ఎక్కువగా ఫాలో అవుతారు. నటీనటులు అద్భుతంగా నటించినా ఆ చిత్రం సక్సెస్‌ కాకపోతే ఆ నటీనటులపై లక్కు లేనివారనే ముద్ర పడుతుంది. అలా చాలా మంది ప్రతిభావంతులు మరుగున పడిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే తన పేరులోనే రాశిని చేర్చుకున్న నటి రాశీఖన్నాకు కోలీవుడ్‌లో అదృష్టం వెంటాడుతోందనే చెప్పాలి.

ఈమెలో ప్రతిభ లేదా? అంటే అది నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి. ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ బ్యూటీ, అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. అసలు నటనకు శ్రీకారం చుట్టింది బాలీవుడ్‌లో.. టాలీవుడ్‌లో అవకాశాలు మందగిస్తున్న తరుణంలో కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది. అలా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్‌ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం అయిన రాశీఖన్నాకు నిజానికి ఆ చిత్రంలో షో కేస్‌ బొమ్మ పాత్రనే పోషించింది. అయితేనేం ఆ చిత్రం హిట్‌. లక్కీ హీరోయిన్‌ ముద్ర వేసేశారు. ఆ తరువాత జయంరవికి జంటగా నటించే మరో లక్కీఛాన్స్‌ను కొట్టేసింది.

అందులోనూ హీరోయిన్‌గా నామమాత్రపు పాత్రనే. అది సక్సెస్‌ అయ్యింది. ఇక ఇటీవల విశాల్‌తో అయోగ్య చిత్రంలో జత కట్టింది. ఇందులోనూ పరిమిత పాత్రలోనే కనిపించింది. అయోగ్య చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అలా లక్కుతో రాశీఖన్నా హీరోయిన్‌గా లాగించేస్తోంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతితో సంఘ తమిళన్‌ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. దీనిపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. కారణం హీరో విజయ్‌సేతుపతి. నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ లాంటి ప్లస్‌ పాయింట్స్‌ ఉండటమే. అలా రాశీఖన్నా రాశి చాలా జోష్‌లో పరుగులు తీస్తోందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement