Best Actors
-
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్‌ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్‌ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్‌తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
రాశి బాగుంది
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. సినిమా రంగంలోనూ కాస్త వెనుకా ముందుగా గుర్తిస్తారు. అలా ఏళ్ల తరబడి పోరాడి గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రతిభను పక్కన పెడితే అదృష్టం కలిసొస్తే విజయాలతో పాటు ఆవకాశాలు తన్నుకొస్తాయి. ఇక్కడ సెంటిమెంట్, రాశిని ఎక్కువగా ఫాలో అవుతారు. నటీనటులు అద్భుతంగా నటించినా ఆ చిత్రం సక్సెస్ కాకపోతే ఆ నటీనటులపై లక్కు లేనివారనే ముద్ర పడుతుంది. అలా చాలా మంది ప్రతిభావంతులు మరుగున పడిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే తన పేరులోనే రాశిని చేర్చుకున్న నటి రాశీఖన్నాకు కోలీవుడ్‌లో అదృష్టం వెంటాడుతోందనే చెప్పాలి. ఈమెలో ప్రతిభ లేదా? అంటే అది నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి. ఇమైకా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ బ్యూటీ, అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. అసలు నటనకు శ్రీకారం చుట్టింది బాలీవుడ్లో.. టాలీవుడ్లో అవకాశాలు మందగిస్తున్న తరుణంలో కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అలా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ చిత్రంలో హీరోయిన్గా పరిచయం అయిన రాశీఖన్నాకు నిజానికి ఆ చిత్రంలో షో కేస్ బొమ్మ పాత్రనే పోషించింది. అయితేనేం ఆ చిత్రం హిట్. లక్కీ హీరోయిన్ ముద్ర వేసేశారు. ఆ తరువాత జయంరవికి జంటగా నటించే మరో లక్కీఛాన్స్‌ను కొట్టేసింది. అందులోనూ హీరోయిన్గా నామమాత్రపు పాత్రనే. అది సక్సెస్ అయ్యింది. ఇక ఇటీవల విశాల్‌తో అయోగ్య చిత్రంలో జత కట్టింది. ఇందులోనూ పరిమిత పాత్రలోనే కనిపించింది. అయోగ్య చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలా లక్కుతో రాశీఖన్నా హీరోయిన్గా లాగించేస్తోంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతితో సంఘ తమిళన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. దీనిపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి. కారణం హీరో విజయ్‌సేతుపతి. నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ లాంటి ప్లస్ పాయింట్స్ ఉండటమే. అలా రాశీఖన్నా రాశి చాలా జోష్‌లో పరుగులు తీస్తోందన్న మాట. -
బెస్ట్ యాక్టర్స్ రెడీ!
‘‘ఈ సినిమా చూస్తుంటే నాకు ‘లేడీస్ టైలర్’ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లోనే ఆ సినిమాను వందసార్లు ప్రదర్శించాం. కామెడీగా ఉందనే వారే కానీ, కొనేవాళ్లు ఒక్కళ్లూ కనపడలేదు. హాస్యాన్ని చిన్న చూపు చూశారు. అలాంటి పరిస్థితుల నుంచే నేను కామెడీని పండించే హీరోగా మారాను కానీ ఇప్పుడు ఆ హాస్యమే లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితులు వచ్చాయి’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అన్నారు. నందు, షామిలి జంటగా మారుతీ టీమ్ వర్క్స్ పతాకంపై కుమార్ అన్నమ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బెస్ట్ యాక్టర్స్’. జీవన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రప్రసాద్ బిగ్‌సీడీని ఆవిష్కరించి హీరో తరుణ్‌కు అందించారు. మారుతి మాట్లాడుతూ -‘‘ఓ మలయాళ చిత్రం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నాం. చాలా కష్టపడి అరుణ్ ఈ సినిమా రూపొందించారు’’అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎమ్ కీరవాణి, దర్శకుడు సురేందర్‌రెడ్డి, జీవన్, నందు, షామిలి, మధురిమ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.