దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం | The End Of Diwali Festival Hundreds Throw Cow Dung At Each Other | Sakshi
Sakshi News home page

దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం

Published Mon, Nov 8 2021 7:56 AM | Last Updated on Mon, Nov 8 2021 1:47 PM

The End Of Diwali Festival Hundreds Throw Cow Dung At Each Other - Sakshi

గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా  కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది.  

(చదవండి: అ‍మ్మ బాబోయ్‌ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!)

అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి  కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు.

ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి  సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు  ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు.

(చదవండి: పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement