cow dung
-
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్‌లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు. -
ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ
టోక్యో: అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. BIG BREAKING NEWS - Japan tests Rocket Engine powered by Cow Dung 🔥🔥 Japanese engineers have successfully test-fired a space rocket engine which runs on Cow Dung ⚡ This is REVOLUTIONARY because it will combat pollution, reduce emissions and also address energy needs in… pic.twitter.com/3qzJ6TGyQz — Times Algebra (@TimesAlgebraIND) December 19, 2023 జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. / Breaking news from the test stand🔥 \ Here's a short footage of IST's first static fire test using Liquid Biomethane🚀 pic.twitter.com/695ld0kGmo — Interstellar Technologies (@istellartech_en) December 7, 2023 -
ఆవు పేడ కిలో రెండు రూపాయలకు కొంటాం: రాజస్తాన్ సీఎం
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు, గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ పీసీ పంపిణీ ఇందులో ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వీటిని నెరవేరుస్తామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. పాత పింఛను విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేలా చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే ల్యాప్‌టాప్ లేదా టాబ్ ఇస్తామన్నారు. ఇవికాకుండా, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందజేయడం, రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లోని ఒక్కో మహిళకు ఏడాదికి విడతలుగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గెహ్లోత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘దేశంలో ఈడీ వీధి కుక్కల కంటే ఎక్కువగా హడావుడి చేస్తోందని ఒక సీఎం(భూపేష్ బఘేల్) అనాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. అంత మాట అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘దర్యాప్తు విభాగాలు మీకు రాజకీయ ఆయుధాలుగా మారాయి. మోదీజీ, మీకు అర్థం కావడం లేదు. మీకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై గురువారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
భలే... పేడ కళ
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్. కిలో పేడ ఎంత? కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. తేలిక బొమ్మలు పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్. బొప్పాయి పాలు ‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ.. -
ఆవు పేడతో కరెంట్! వేములవాడలో బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు. ఈ విద్యుత్ ప్లాంట్‌ను జూన్ ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వేములవాడ మున్సిపల్ అధికారులు ప్లాంటు నిర్మాణ పనులను కోడెల సంరక్షణ కేంద్రం ఆవరణలో చేపట్టారు. సమీపంలోనే ఉన్న ప్రాంతీయ ఆస్పత్రికి ఇక్కడ ఉత్పత్తి అయ్యేవిద్యుత్‌ను అనుసంధానం చేయనున్నారు. నిత్యం 2.5 టన్నుల పేడతో.. తిప్పాపూర్‌లోని కోడెల సంరక్షణ కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండే 2.5 టన్నుల పశువుల పేడను బయోగ్యాస్ ప్లాంటుకు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే 30 కేవీఏ బయోగ్యాస్‌తో విద్యుత్ తయారు అవుతుంది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణహిత విద్యుత్‌ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, వేములవాడ రాజన్న ఆలయానికి వినియోగించనున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.. తిప్పాపూర్‌లో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంటు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. మరో పక్షం రోజుల్లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. – నర్మద, మున్సిపల్ ఏఈ, వేములవాడ -
ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు!
ఈ రైతు దంపతులు ప్రకృతిని, తనకున్న రెండు ఆవులను నమ్ముకున్నారు.. పేడ, గోమూత్రంతో ఘనజీవామృతం, జీవామృతాలను తయారు చేసుకొని ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. వీరి స్వయం కృషికి పంచభూతాలు సాయం చేస్తున్నాయి. మామిడి తోట మధ్యలో 40 సెంట్లలో ఫిబ్రవరి నుంచి అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి వారం మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీన్ని ‘ఏటీఎం నమూనా’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. కేవలం ఈ అంతరపంటల ద్వారా మొత్తం రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న నారాయణ, పార్వతి దంపతుల కృషిపై ‘సాక్షి’ ఫోకస్.. స్వయంకృషితో పాటు ప్రకృతిని నమ్ముకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడనడానికి హెచ్. నారాయణ, పార్వతి దంపతులే నిదర్శనం. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామం. తమకున్న 3.70 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అంతర పంటల్లోనూ మంచి ఆదాయం తమకున్న రెండు నాటు ఆవులను సంరక్షిస్తూ పేడ, గో మూత్రంతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. స్వయం కృషికి తోడుగా అతి తక్కువ పెట్టుబడితోనే మామిడిలో, అంతర పంటల్లోనూ మంచి ఆదాయం ఆర్జిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మామిడి తోటలోని 40 సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరి 13న ఎంపిక చేసుకొని బోదెలు సిద్ధం చేసుకున్నారు. ఐదు వరసల్లో 5 రకాల పంటలను విత్తుకున్నారు. గోరుచిక్కుడు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్నతో పాటు మెంతాకు, కొత్తిమీర, గోంగూర సాగు చేస్తున్నారు. బోరు నీటిని అందిస్తున్నారు. ఘనజీవామృతం వేస్తున్నందు వల్ల నీరు కూడా ఎక్కువ అవసరం రావటం లేదు. ఒక్క తడి ఇస్తే 15–20 రోజులు ఉంటుంది. కెమికల్ వేసిన పొలం అయితే ఐదారు రోజులకే నీరు మళ్లీ అడుగుతుంది. తోట పనులను నారాయణ, ఆయన భార్య కలసి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్లో, ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు. గోరుచిక్కుడు ద్వారా 30 వేలు ఇప్పటివరకు గోరుచిక్కుడు (చోలా కాయల) ద్వారా రూ.30 వేలు, ముల్లంగి ద్వారా రూ.50 వేలు, కొత్తిమీరలో రూ.20 వేలు, మెంతాకు, గోంగూరలలో మరో రూ.20 వేలు ఆదాయం వచ్చింది. ముల్లంగి, ఆకుకూరలు తీసేవి తీస్తూ ఉంటే మళ్లీ విత్తుతున్నారు. మొక్కజొన్న, అలసంద, క్యారెట్, బీట్రూట్ పంటలు మరో ఒకటిన్నర నెలల్లో చేతికొస్తాయి. క్యారెట్, బీట్రూట్ మంచి ధర పలుకుతాయని, మొత్తంగా 40 సెంట్లకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుందని, ఇదంతా నికరాదాయమేనని నారాయణ ధీమాగా చెబుతున్నారు. రూ. 1,500లతో విత్తనాలు కొనటం తప్ప వేరే ఏ ఖర్చూ లేదన్నారు. రసాయనాలు వేయకుండా పంటలను పసిబిడ్డల్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నామని నారాయణ చెప్పారు. అంతర పంటల ద్వారా నిరంతరం ఆదాయం వస్తోందని చెబుతూ.. ఇదే ఏటీఎం మోడల్ పంటల వల్ల లాభం అన్నారు. తనను చూసి తన పక్క పొలం రైతు కూడా 20 సెంట్లలో ఈ నమూనాలో పంటలు వేశాడన్నారు. క్లస్టర్లో మరో 25 మంది రైతులు వేశారన్నారు. మామిడిలోనూ మంచి ఆదాయం మామిడి పంటను కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నారాయణ దంపతులు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి రాగా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 6 టన్నులు పంట కోత కోశారు. మరో 3 టన్నులు పంట చేతికొస్తుంది. మామిడి ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని నారాయణ చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయని, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు సంతోషంగా మంచి ధరకు తీసుకుంటున్నారని నారాయణ, పార్వతి ఆనందంగా చెబుతున్నారు. వీరి పొలాన్ని ఇటీవల పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ రైతు సాధికార సంçస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు నేను అయిష్టంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఏడేళ్ల క్రితం మొదలు పెట్టాను. డీపీఎం లక్ష్మానాయక్, మాస్టర్ ట్రైనర్ శివశంకర్ అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెప్పి సహకరించారు. ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంటలకు ఎలాంటి తెగుళ్లు, వైరఃస్లు రాలేదు. పండ్ల తోటల్లో కూడా ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మనకు పంట చేతికొస్తుంది. మంచి నికరాదాయం వస్తుంది. ఇది రైతులకు ఎంతో మేలైన పద్ధతి. భూమి కూడా గుల్లబారి బాగుంటుంది. వాన నీరు బాగా ఇంకుతుంది. సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నన్ను చూసి కొందరు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. – హెచ్.నారాయణ (95504 84675), ప్రకృతి వ్యవసాయదారుడు, మల్లాపురం గ్రా., కళ్యాణదుర్గం మం., అనంతపురం జిల్లా స్వయంగా చూస్తే గానీ నమ్మలేరు.. పది రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు సుమారు 400 మంది అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో అధికాదాయం పొందుతున్నారు. స్వయంగా వచ్చి చూస్తే గానీ ఇంత ఆదాయం వస్తున్నదని నమ్మకం కలగదు. నారాయణ, పార్వతి రైతు దంపతులు తమ మామిడి తోటలో 40 సెంట్లలో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ ఆదాయం రూ. 3 లక్షలకు పెరుగుతుందని రైతు ధీమాగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి, ఏపీ రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్ కూడా ఇటీవల నారాయణ తోటను సందర్శించారు. అంత ఆదాయాన్ని పొందే అవకాశాలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయన్నది ఈ తోటలను స్వయంగా చూసిన వారికి అర్థం అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు కూరగాయలను విక్రయిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. అందువల్లనే ఈ నమూనాను ‘ఏటీఎం మోడల్’ అని పిలుస్తున్నాం. – లక్ష్మానాయక్ (83310 57583), ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్, అనంతపురం జిల్లా - ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
సూపర్ ట్రాక్టర్.. ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే!
గోమయమే ఇంధనంగా నడిచే ఈ ట్రాక్టర్‌ను ఇటాలియన్ కంపెనీ ‘న్యూహాలండ్’ కంపెనీ భాగస్వామ్యంతో ‘బెన్నామాన్’ అనే బ్రిటిష్ కంపెనీ రూపొందించింది. ఆవుపేడ నుంచి వచ్చే మీథేన్ గ్యాస్‌ను మైనస్ 162 డ్రిగీల ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించుకునేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించారు. వంద ఆవుల మంద నుంచి సేకరించిన పేడ నుంచి వచ్చే మీథేన్ ఈ ట్రాక్టర్‌కు ఏడాది పొడవునా ఇంధనంగా సరిపోతుంది. గోమయం నుంచి సేకరించిన మీథేన్‌తో నడిచే వాహనాల్లో ఇదే ప్రపంచంలో మొట్టమొదటిదని బెన్నామాన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు క్రిస్ మాన్ చెబుతున్నారు. ఇది సాధారణ డీజిల్ ట్రాక్టర్లకు దీటుగా పనిచేస్తుందని, డీజిల్ ట్రాక్టర్లతో పోల్చుకుంటే, దీని నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏడాదికి 2500–500 టన్నులు తక్కువేనని ఆయన వెల్లడించారు. అమెరికాలో గత డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ట్రాక్టర్ పనితీరును ప్రదర్శించారు. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర! నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
గోహత్యపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు
గుజరాత్ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్‌కి గురికావని సైన్స్ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది. (చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!) . -
అమ్మకు వందనం.. పాతికేళ్లుగా గో సేవ.. పాలు పితకరు, అమ్మరు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ల బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతుంటుంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు. మదన్‌లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్లు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రాణించాడు మదన్‌లాల్. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు. 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్ పాల్ జీవ్ దయా ట్రస్ట్’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు బదాంబాయి దంపతులు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు. బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్‌బాక్స్ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్‌లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు. పాతికేళ్ల అనుబంధం... ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే చాలు వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. అలాగే దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించి ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు. ఇప్పుడు గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158కి చేరింది. ప్రతి రోజూ ఉదయమే బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్ లు ఆవులకు దాణా, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వేస్తారు. ఆదివారం, సెలవు రోజుల్లో కొడుకులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా గోశాలకు వచ్చి పనులు చేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అమ్మ వచ్చిందంటే చాలు ఆవులన్నీ ఆమెకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. ఆమె వయసు పైబడటం, ఆరోగ్య దృష్ట్యా అమ్మకు ఇబ్బంది కలగగూడదన్న ఉద్దేశ్యంతో ఇటీవల అడ్డుగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. జాలీల నుంచి వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తుంటుంది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని వివరిస్తుంది బదాంబాయి. అన్నీ తానై.. 2008లో బదాంబాయి భర్త మరణించాడు. అయినా, ఆమె గో సంరక్షణ మానుకోలేదు. 21 ఆవులతో మొదలైన వాటి సంఖ్య వందల్లోకి చేరింది. గడ్డివేయడం, గోశాల శుభ్రం చేయడం, బెల్లం, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆవులతో ఆమె అనుబంధం పెంచుకుంటూనే ఉంది. ప్రతి గోవు బాగోగులు దగ్గర ఉండి చూసుకోవడంలోనే ఆమె రోజు మొత్తం గడుపుతుంటుంది. పాలు పితకరు, అమ్మరు ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు. కాగా ఆవు పేడను ఒక చోట జమ చేసి ఏడాదికోసారి అమ్ముతారు. పేడ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను గోసేవా ట్రస్టుకే జమ చేస్తారు. ఆవులను మేపడం, గడ్డి కోసి వేయడం వంటి పనుల కోసం ఇప్పుడు నలుగురు పనివాళ్లను నియమించారు. వారికి వేతనాలతో పాటు దాణా కొనుగోలు కోసం నెలకు దాదాపు రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు బదాంబాయి కొడుకులు. నాలుగెకరాల్లో గడ్డి పెంపకం.... ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు. ఈ జాగ్రత్తతో పాటు ఎండుగడ్డినీ కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. దాతలు కొందరు గడ్డిని అందిస్తారు. ఏటా ఎండు గడ్డి కోసం రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేస్తామని బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్‌లు తెలిపారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా -
గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!
పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు. నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ (క్లిక్ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
ఆవు పేడతో వినాయక విగ్రహాలు
బోడుప్పల్: జీవ జాతులకు హాని కలుగకుండా... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆవు పేడతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆయా విగ్రహాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది బోడుప్పల్ బాలాజీహిల్స్ కాలనీలోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. ►ఆవు పేడతో 300 రకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కుప్ప శ్రీనివాస్ తెలిపారు. వినాయక విగ్రహాలు, గోడకు వేలాడ దీసే బొమ్మలు, ఇంటి ముఖ ద్వార తోరణాలు, ఆది యోగి విగ్రహాలు, శివలింగాలు, జ్ఞాపికలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలు, జప మాలలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెన్ను స్టాండ్లు, సెల్‌ఫోన్ స్టాండులు, విభూది, దంత మంజరి (పళ్లపొడి), తయారు చేస్తున్నారు. అలాగే గో మూత్రంతో పినాయిల్, వేప, హ్యాండ్‌వాచ్‌ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆవు పేడతో చెప్పులు తయారీ, ఆసనాల కోసం వేసుకునే పీటలు, దూబ్‌బత్తి, దోమల కోసం మచ్చల బత్తి వంటి ఉత్పతులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ►గోశాలకు విరాళాలు అందజేసే వారికి పేడతో తయారు చేస్తున్న ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. భావితరాలకు గో జాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం..
భోపాల్/నివారీ: మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అది కూడా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే ఇదంతా చేస్తోంది. ఈ సారి భిన్నంగా తన పోరాటాన్ని చూపించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమా భారతి. తాజాగా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆమె చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో ఓ మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ‘పేడ విసరడమే కాదు, దుకాణంపైకి రాళ్లు కూడా రువ్వుతున్నా’నని వీడియో తీస్తున్న వ్యక్తితో ఉమాభారతి అంటూ కన్పించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశాడు. గతంలోనూ ఉమాభారతి భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లి బాటిళ్లపై రాళ్లు విసిరి పగలగొట్టడం తెలిసిందే. -
ఆవు పేడతో సూట్‌కేస్.. అసెంబ్లీకీ తీసుకువెళ్లిన ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ బుధవారం వెరైటీ బ్రీఫ్‌కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది వరకే బడ్జెట్ సమావేశాలకు సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పద్ధతులకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఛతీస్‌గఢ్ సీఎం కూడా ఇంకాస్త ముందడుగా వేసి ఏకంగా ఆవు పేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకుని అసెంబ్లీకి వెళ్లారు. ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు హ్యాండిల్, కలపతో తయారు చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో “గోమయే వసతే లక్ష్మి” అని రాసి ఉంది. అంటే దీని అర్థం “లక్ష్మి దేవత ఆవు పేడలో ఉంటుంది”. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత నెలలో పశువుల పెంపకం గ్రామస్తులు, గౌతన్‌లు, గౌతమ్ కమిటీలతో సంబంధం ఉన్న మహిళా సంఘాల కోసం తన ప్రధాన పథకం గోధన్ న్యాయ్ యోజన కోసం రూ.10.24 కోట్లను విడుదల చేసింది. పశువుల యజమానులకు కనీస ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం లక్ష్యం. ఆవు పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని 2020లో రాష్ట్రం ప్రకటించింది, భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. -
వైరల్:‘అరె బాబు స్వీటు అనుకున్నావా ఏంటి.. పేడను అలా తినేస్తున్నావ్’..!
ఓ వైద్యుడు ఆవు పేడను తింటున్న వీడియో ఇంటర్నెట్లో దూసుకుపోతోంది. అతని ట్విటర్ ఖాతా ప్రకారం ఆ వ్యక్తి డాక్టర్ మనోజ్ మిట్టల్గా గుర్తించారు. అతను హర్యానాలోని కర్నాల్‌కు చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణుడు. ఆ వీడియోలో ఆ వైద్యుడు ఓ పశువుల శాల వద్దకు వెళ్లి.. ఆవు నుంచి లభించే ‘పంచగ్రావ్య’ లేదా ఆవుల నుంచి పొందగలిగే ఐదు అంశాల గురించి వివరించారు. తన తల్లి ఉపవాసం ఉండేటపుడు ఆవు పేడను తినేవారని చెప్తూ, ఆయన కూడా కొంచెం పేడను తిన్నారు. పేడ మన మనస్సును, ఆత్మను ప్రక్షాళన చేసే సామర్థ్యం ఉందని, అది వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత, శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుందని ఆయన అన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇక వంట చేయాల్సిన పని లేదు, కనీసం అందులో ఉప్పు కూడా వెయ్యనక్కర్లేదు? సూపర్ ఫుడ్ అని ఒకరు కామెంట్ చేయగా, స్వీటు అనుకున్నావా ఏంటి .. ఆవు పేడను అలా తినేస్తున్నావ్ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. Dear Doctors of Twitter, I present you this gentleman!pic.twitter.com/YtFHGo9cQH — عادل مغل 🇵🇸 (@MogalAadil) November 13, 2021 చదవండి: Haunted Hotels In UK: ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి.. -
దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం
గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది. (చదవండి: అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!) అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. (చదవండి: పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!) #WATCH | Villagers of Gumatapura on the Tamil Nadu-Karnataka border throw cow dung on each other as part of Deepavali celebrations, marking the end of the festival. (06.11.2021) pic.twitter.com/w1fhrp0na5 — ANI (@ANI) November 8, 2021 -
గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..
వినాయకుడు వరములు ఇచ్చువాడు. ఇవాళ ప్రపంచానికి ఒక వరం కావాలి. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల గతి తప్పుతున్న రుతువులను, ఉష్ణోగ్రతలను అదుపులోకి తేవడం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు. కాని ఒక విషయంలో మాత్రం పదే పదే విఘ్నాలు కలిగించాలి. ఏ విషయంలో? పర్యావరణానికి హాని చేసే ఏ పని ఎవరు మొదలెట్టినా అది జరగకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉండాలి. అప్పుడు గిరులు పచ్చగా ఉంటాయి. ఝరులు కళకళలాడుతాయి. వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి. Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung: భోపాల్‌లోని కాంతా యాదవ్ వినాయకుడి శక్తి ప్రకృతికి అందాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఇంతకాలం ఆమె కుటుంబం దేవతల విగ్రహాలు చేస్తూ బతికింది. అవి దాదాపు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే పదర్థాలతోనే అయి ఉండేవి. కాని ఈసారి కొత్త పని మొదలెడదాం అనుకుందామె. కొత్త పని అంటే ప్రకృతికి మేలు చేసేదే. వినాయకుడి పూజకు మట్టి విగ్రహం తయారు చేయడం ఒక మంచి ఆలోచన. కాని కాంతా యాదవ్ కొంచెం ముందుకు వెళ్లి వినాయకుడు తిరిగి మొక్కకు శక్తిగా మారే విధంగా విగ్రహం తయారు చేయాలనుకుంది. అందుకు గోమయం (ఆవుపేడ)ను ఎంచుకుంది. ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది. ‘ఆవు పేడను ఎండ పెడతాను. తర్వాత దానికి రంపంపొట్టు, మైదా పిండి కలిపి మెత్తటి పదార్థంగా చేసి అచ్చులో పోసి విగ్రహం తయారు చేస్తాను. ఇది తయారు చేయడం పది నిమిషాల పనే అయినా ఆరడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత రంగులు వేస్తాను. విగ్రహం పూజలు అందుకున్నాక నీటి బకెట్టులో సులభంగా నిమజ్జనం అవుతుంది. ఆ తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే ఎరువు అవుతుంది. ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది బొమ్మలు కొంటున్నారు. అంతే కాదు ఢిల్లీ, పూనా నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అంది కాంత. కాంత ఈ పనిని అందరికీ నేర్పుతుంది. బహుశా వచ్చే సంవత్సరం నాటికి చాలాచోట్ల గోమయ వినాయకుడు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చదవండి: మహా గణపతిం మనసా స్మరామి... -
పిడుగుపాటు గురైన యువకుడు.. ఆవు పేడతో వైద్యం..
రాయ్‌పూర్: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే గుడ్డిగా నమ్మాతూ పాటిస్తున్నారు. ఇదే తరహా ఘటన చత్తీస్‌ఘడ్‌లో చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడుని బతుకుతాడనే నమ్మకంతో ఆవు పేడతో కొన్ని గంటల పాటు పాతిపెట్టారు. చత్తీస్‌ఘడ్‌లోని పలు చోట్ల టౌటే తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఓ వ్యక్తి ఇంటి బయట, ప్రాంగణంలో పేరుకుపోయిన మురుగు నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూ, అడ్డుకున్న కాలువను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అతను పిడుగుపాటు గురై అక్కడికక్కడే మూర్ఛపోయాడు. పెద్ద శబ్ధం రావడంతో ఇంటి చుట్టూ పక్కన వాళ్లంతా గుమిగూడారు. వారందరూ ఆ యువకుడిని ఆవు పేడ గొయ్యిలో పాతిపెట్టమని సూచించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆ యువకుడి మొఖం తప్ప మిగతా శరీరాన్ని ఆవు పేడతో కొన్ని గంటల పాటు పూడ్చి పెట్టారు. అయినప్పటికీ, ఆ వైద్యం ఫలించకపోవడంతో వారు 108 అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం ఉదయపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. చదవండి: న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. -
వార్నింగ్: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు, జాగ్రత్త!
అహ్మదాబాద్: ఆవు పేడను శరీరానికి పూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది సరికాదని, దీనివల్ల కరోనా నుంచి రక్షణ లభించదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. పేడను ఒంటికి పట్టించడం మూలంగా బ్లాక్ ఫంగస్ సహా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 200 ఆవులున్న స్వామినారాయణ్ గోశాలకు వారాంతాల్లో కొద్దిమంది వస్తూ... రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే భావనతో ఆవుపేడను ఒళ్లంతా పట్టించి... ఆపై గో మూత్రాన్ని రాసుకుంటున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆవు పేడ, పాలతో శరీరాన్ని కడిగేసుకుంటున్న వీడియోలు, ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విధంగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, కరోనా నుంచి రక్షణ లభిస్తుందని చెప్పడం సరికాదని వైద్యులు తప్పు పడుతున్నారు. అలా తగ్గుతుందని ఏ పరిశోధనల్లోనూ తేలలేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, గాంధీనగర్ డైరెక్టర్ దిలీప్ మౌలాంకర్ స్పష్టం చేశారు. ప్రజలకు అశాస్త్రీయ పద్ధతులు నేర్పి వారిని ప్రమాదంలోకి నెట్టి వేయొద్దని హితవు పలికారు. చదవండి: ఆవు పేడతో తగ్గుతున్న కరోనా, ఆందోళనలో డాక్టర్లు? చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
దహన సంస్కారాలు కట్టెలతో కాదు పిడకలతో
న్యూఢిల్లీ: సాధారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు వినియోగిస్తారు. కానీ ఇకపై ఢిల్లీలో కట్టెల బదులు ఆవు పేడతో చేసిన పిడకలు వినియోగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలు చేయనున్నట్లు మేయర్ అనామిక ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే ఆవుపేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. దీనికి పలు సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పిడకలతో దహన సంస్కారాలు సంప్రదాయమని.. దీంతోపాటు ఖర్చు తక్కువ ఉండడంతో పేదలకు ప్రయోజనకరమని మేయర్ అనామిక వివరించారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసకోవడంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అమలుచేసింది. గంగానది కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా 2018లో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పిడకలతో దహనం చేస్తే దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో కూడా ఆవుపేడతో తయారుచేసిన పిడకలతోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. -
అమెజాన్‌లో ఆవు పిడకలు.. ఛీ రుచిగా లేవంటూ..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో దొరకని వస్తువు అంటూ ఉండదు. నిత్యావసర సరుకుల నుంచి పండగలకు వాడే సంప్రాదాయ వస్తువుల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అమెజాన్ ఆవు పేడ పిడకలను కూడా అమ్ముతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లోని భారతీయుల దృష్ట్యా వారు జరపుకునే సాంప్రదాయ పండగలకు, పూజల నిమిత్తం నాణ్యమైన ఆవు పేడ పిడకలను ఆమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ‘కౌవ్ డంగ్ కేక్’ అనే పేరుతో విక్రయిస్తుంది. అవి చూసిన ఓ విదేశీ కస్టమర్ వీటిని కొత్తరకం కేకులు అనుకున్నాడేమో కానీ ఆర్టర్ చేసుకున్నాడు. అనంతరం అవి తిని అతడు ఇచ్చిన రివ్వూ ప్రస్తుతం నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. ఇది చూసిన భారత కస్టమర్స్, నెటిజన్లు అవాక్కవుతున్నారు. డాక్టర్ సంజయ్ ఆరోరా అనే ట్వీటర్ యూజర్ అమెజాన్ యాప్‌లో అతడి రివ్యూ ఫొటోను పోస్టు చేయడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ‘యే మేరా ఇండియా.. ఐ లవ్ ఇండియా’ అంటూ చేసిన ఈ ట్వీట్లో రెండు ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో అమెజాన్ కౌవ్ డంగ్ కేక్ పేజీ రివ్యూతో ఉండగా మరో దాంట్లో ‘ఛీ.. వీటి రుచి అస్సలు బాగాలేదు. ఇందులో మట్టి, గడ్డి కలిసినట్టుగా ఉంది. ఇవి తిన్న తర్వాత నాకు లూజ్ మోషన్స్ కూడా అయ్యాయి. ప్లీజ్ వీటిని తయారు చేసేటప్పుడు కాస్తా శుభ్రత పాటించండి. అలాగే కొంచెం క్రంచిగా ఉండేలా కూడా చూసుకోండి’ అంటూ రివ్యూ ఇచ్చాడు. దీంతో అతడికి ఇవి ఏంటనేది స్పష్టత లేదని అర్థం అవుతోంది. అయితే ఆమెజాన్ ఈ ప్రోడక్ట్ కింద ‘ఇవి పండగలు, పూజలు ఇతర సాంప్రదాయా కార్యక్రమాలు వాడే పిడకలు. సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసిన కౌవ్ డంగ్ కేక్స్’ అని కూడా స్పష్టంగా రాసింది. అయినప్పటికి అతడి ఇవి ఏంటనేది స్పష్టంగా తెలియదని అర్థమౌవుతోంది. అయితే డాక్టర్ ఆరోరా చేసిన ఈ పోస్టుకు మాత్రం నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఇది నిజమేనా!!’,‘నిజంగానే ఇది జరిగిందా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరూ ‘హహ్హహ్హ అవును కచ్చితం క్రంచీ గా ఉండాలి మరి’ అంటూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. Ye mera India, I love my India…. :) pic.twitter.com/dEDeo2fx99 — Dr. Sanjay Arora PhD (@chiefsanjay) January 20, 2021 -
పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి
ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం) షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. -
ఆవుపేడతో రేడియేషన్‌కు చెక్ పెట్టొచ్చట..!
న్యూఢిల్లీ: ఆవు హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలానే ఆవు పేడ, మూత్రాన్ని కూడా అనేక రకాలుగా వినియోగిస్తారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. ఇక ఆవు పేడను కూడా ఇప్పటికే దీన్ని ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆవు పేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడకు రేడియేషన్‌ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా తెలిపారు. ఆవు పేడతో తయారైన చిప్‌ని ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్‌ని నివారించడానికి ఈ ఆవు పేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది’’ అన్నారు కతిరియా. (చదవండి: అమెరికాలో పిడకల వేట!) ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవు పేడ చిప్‌ని ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి ‘గౌసత్వా కవచ్’ అని పేరు పెట్టారు. రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్‌ను ఫోన్లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. ‘గౌసత్వ కవచ్’ పేరుతో రూపొందించిన ఈ చిప్‌ను గుజరాత్‌కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. -
పేడ ఉత్పత్తులతోనే దేశీ పశువుల సంరక్షణ!
దేశీ గో జాతుల పరిరక్షణకు కృషి చేసే వారు ఈ జాతి పశువుల పేడతో తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకుంటే చాలని, పాలపై ఆధారపడనక్కర లేదని అపర్ణ రాజగోపాల్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆమె న్యూఢిల్లీకి దగ్గరలోని ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో 10 ఎకరాలలో ‘బీజోమ్’ పేరిట సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతున్నారు. న్యూఢిల్లీ నుండి అరగంట ప్రయాణం. కబేళాలకు తరలిస్తున్న దేశీ గోజాతుల పశువులను రక్షించి తన క్షేత్రంలోనే గోసంరక్షణ శాలను ఏర్పాటు చేసి పోషిస్తున్నారు. ప్రస్తుతం 12 వేర్వేరు భారతీయ జాతులకు చెందిన 120 ఆవులు ఉన్నాయి. అపర్ణ ఒక ప్రత్యేకమైన వ్యాపార నమూనాను అనుసరిస్తున్నారు. ఆమె ఈ ఆవుల పాలను అమ్మరు, దూడల కోసం ఉంచుతారు. బదులుగా, ఆమె వాటి పేడ నుండి ఒక వ్యాపారాన్ని సృష్టించారు. తన సంస్థను ఆమె ‘డంగ్ హోమ్’ అని పిలుస్తుంటారు. కేవలం పేడ అమ్మటం లాభదాయకంగా ఉంటుందా? ముఖ్యంగా అ2 బీటా–కేసిన్ కలిగిన దేశీయ ఆవుల పాలకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఇలా చేయగలగడం సాధ్యమా? అని మనకు సందేహం కలగవచ్చు. అయితే, పాలకు బదులు పేడను అమ్మే తన వ్యాపార నమూనా కూడా అంతే ప్రభావ వంతంగా ఉంటుందని అపర్ణ రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. 120 ఆవులు ప్రతి రోజూ 1,300 కిలోగ్రాముల పేడ వేస్తాయి. పేడను అలాగే అమ్మేయకుండా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చి మంచి ధరకు అమ్మడమే ఆమె వ్యాపార విజయ రహస్యం. పేడ హోమ్‌లో తయారు చేసిన అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తులలో ఒకటి ఆవు పేడ కట్టెలు! ప్రత్యేకమైన యంత్రం సహాయం తో పచ్చి పేడతోనే నాలుగు పలకలుగా, మీటర్ పొడుగ్గా వుండే దుంగలను తయారు చేస్తారు. స్మశానంలో మృతదేహాల దహనానికి చెట్ల కలప లేదా బొగ్గుకు బదులుగా ఈ పేడ కట్టెలను ఉపయోగించవచ్చు. వీటిని కాల్చడం వల్ల కలపను కాల్చడం కంటే తక్కువ కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. పేడతో కట్టెలతో పాటు, బీజోమ్ సంస్థ పూల కుండీలు, భారతీయ దేవతల విగ్రహాలు, పూజా కిట్లు, పేడ ఎరువు, జీవ పురుగుమందులను కూడా తయారు చేసి విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులన్నీ ఆవు పేడ, మూత్రంతోనే తయారవుతాయి. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఆవుల పేడ మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంకర జాతి పశువుల పేడలో కంటే వీటి పేడలో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. ‘పేడ నుంచి ఈ విలువ–ఆధారిత ఉత్పత్తులను సృష్టించడం వెనుక ఉన్న వనరులను సమర్థవంతంగా పునర్ వినియోగించటం, తద్వారా పాలు తక్కువగా ఇచ్చే లేదా పాలు ఇవ్వని దేశీయ పశువులను స్థిరమైన మార్గంలో సంరక్షించవచ్చు‘ అని అపర్ణ రాజగోపాల్ అంటారు. ఈ నమూనా చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుందని అపర్ణ అభిప్రాయపడ్డారు. -
పైశాచికత్వం: భార్యను చంపి.. ఆవు పేడతో..
కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ పైశాచిక భర్త. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మాంత్రికుని సహాయంతో మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి తిరిగి బతికించుకునేందుకు సాహసించాడు ఆ ప్రబుద్దుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. బేతుల్ జిల్లాలోని చిచోలి గ్రామంలో భైయలాల్(46), ఆయన భార్య నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భైయలాల్ మద్యానికి బానిస అవ్వడంతో గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు సంభవిస్తుండేవి. దీంతో అతని ముగ్గురు పిల్లలు వేరే చోట నివసిస్తున్నారు. (‘చిత్ర హింసలు పెట్టి.. కొట్టి చంపేశారు’) ఈ క్రమంలో ఆగష్టు 26న తాగి వచ్చిన భైయలాల్ తన భార్యతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో చెక్క కర్రతో ఆమె తలపై గట్టిగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే చనిపోయిన తన భార్యను మళ్లీ బతికించుకోవచ్చని ఓ మాంత్రికుడు చెప్పడంతో అతని సలహా మేరకు ఆమె శరీరాన్ని ఆవు పేడతో కప్పి రెండు రోజులపాటు అలాగే ఉంచాడు. ఈ లోపు నిందితుడి ఇంటికి మాంత్రికుడు చేరుకోకముందే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆగష్టు 28న పాక్షికంగా కృళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిచోలీ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాంత్రికుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చిచోలి పీఎస్ ఇంచార్జి దీపక్ పరాషర్ తెలిపారు. (139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు) -
అమెరికాలో పిడకల వేట!
మన గొప్పదనమేమిటో అమెరికా వాడు గుర్తించేదాకా మనకు తెలియదు కదా. ఈ మాట మరోమారు రుజువైంది. అక్కడ అమ్ముతున్న కౌ–‘డంగ్’ కేక్‌ను చూసి ఇప్పుడు యావత్ ప్రపంచ ప్రజలంతా ‘డంగై’పోతున్నారు. ‘ఉదరపోషణార్థం బహుకృత వేషమ్’ అనే సామెత మనమందరమూ విన్నదే. ఉదరం లేకపోయినా పేడ కూడా చాలా వేషాలే వేస్తుంటుంది. నీళ్లలోకి జారి కళ్లాపి (సాన్పి) అవుతుంది. గోడకు చేరి పిడకవుతుంది. ముగ్గులో దిగి గొబ్బెమ్మవుతుంది. చేనుకు చేరి చేవవుతుంది. ఎందరెందరో ఉదరాలు నింపడానికిలా పాపమది ఇన్ని వేషాలూ వేస్తుంది. అంతేకాదు.. పవిత్రమైంది పేడ. అందునా ఆవుపేడ. ‘కాదేదీ మార్కెట్కనర్హం’ అన్న మాట తెలిసిందే.మరి ఓ హీరో రెండు వేషాలేసి, డబుల్ యాక్షన్ చేసి, పాన్–ఇండియా ఫిల్మ్ తీస్తేనే బాక్సాఫీసు బద్దలవుతుందే... అలాంటిది మరి ‘పేడ’? పైన చెప్పిన వేషాలన్నీ వేసి పాన్–అమెరికన్ అయిపోయాక... మరెన్ని కాసులు కురిపిస్తుందో ఊహించండి. అదలా కాసుల వర్షం కురిపించగలదని గుర్తించేశారు అమెరికన్ మార్కెటీర్లు. అంతే... పవిత్ర క్రతువుల్లో వాడటానికి వీలుగా పిడకలు తయారు చేశారు. వాటిని న్యూజెర్సీలోని ఓ పెద్ద మాల్లో అమ్మకానికి పెట్టారు. ధర కూడా చాలా సరసమే. పది పిడకల పాకెట్ 2.99 డాలర్లు. అంతే... ఇక ఇప్పుడీ కౌడంగ్ కేక్‌లు హాట్‌కేకుల్లాగా అమ్ముడవుతున్నాయట. ఈ న్యూస్ ఇంటర్నెట్లోకి రాగానే నెటిజన్లు ఎన్నో జోకులు విసురుకుంటున్నారు. మనకు నచ్చని హీరో పోస్టర్ మీద పేడ విసరడం మనకలవాటే కదా. అలాగే... కుకీలను నిరసిస్తూ... కేకుల్ని బాగా ఇష్టపడే ఒకాయన... ‘‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిని కౌడంగ్ కుకీస్ అని పిలవండి. కేక్‌లు అనకండి’’ అంటూ ఫేస్బుక్ గోడమీదికి పేడ విసరనే విసిరాడు. ఇంకో ఆయన శంకరాభరణం శంకరశాస్త్రిగారిలా కండువా సవరించుకుంటూ... ‘పవిత్రమైన ఆవు పేడ ఒకలా ఉంటుంది. తుచ్ఛమైన ఆ మ్లేచ్ఛావు పేడ మరోలా ఉంటుంది. ఒక్కొక్క పేడకు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్పసుంది. పనుంది. ఇంతకీ అక్కడ అమ్ముతున్నది పవిత్రమైన గోమాత పేడేనా... లేక సంకరజాతి పశువుల పేడా?’’ అంటూ విసుక్కుంటూ విసుర్లు విసురుతున్నాడు. వాళ్లంతే... వాళ్లంతే... ప్రతిదీ మార్కెట్ దృష్టితోనే చూస్తారు. కానీ... మన పేడ మనకెంత గొప్పది? పశువుల కొట్టంలో పశువులూ, ఆవులు పేడ వేయగానే చెక్కదంతితో సిబ్బి లోకి లాగేసి కుప్ప మీద వేస్తారు. తొలకరికి కాస్తంత ముందుగా పొలానికి తరలించి సారంగా మార్చేస్తారు. గరిసెలోని ధాన్యానికి చీడ పట్టకుండా పేడ రాసేస్తారు. పండగ ముందు రోజున ఇల్లలికేస్తారు. గంపా, గరిసే, తట్టా, బుట్టా, తడకా, చేటా... ప్రతిదానికీ రాసి చీడపీడల నుంచి కాపాడతారు. పండగ ముందు రోజున అలకాల్సిన మన వసారా పేడకుప్పలు రాసుకుని ఎలా ఉంటుంది? అచ్చం భూమాత తన తలకు హెన్నా పెట్టుకున్నట్టుంటుంది. ఆ మర్నాడు తలస్నానం చేశాక జుట్టు మెరిసినట్టుగా... మన గచ్చూ మిలమిలలాడుతుంటుంది. ఆ పేడ అలికిన గచ్చు ఇకపై ప్రతిరోజూ చక్కగా, చల్లగా మన పాదాలకి ముద్దెడుతూ, అడుగులకు మడుగులొత్తుతూ ఉంటుంది. ఇప్పుడీ పిడకలవేట గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే... ‘చూశారా... అమెరికావాడెంత వ్యాపారదక్షుడో!’ అంటూ అచ్చెరువొందడానికి. ఒక్క పిడక గురించి తెలిసినందుకే ఇంత మార్కెటింగ్ అయితే... ఈ విషయాలన్నీ ఎవరైనా విడమరిచి చెబితే... ఇంకేముందీ? ఇకనుంచి ‘బుల్షిట్’ అంటూ విసుక్కోవడం మానేస్తాడేమో. పేడకు పేటెంట్ అడిగేస్తాడేమో! పేడ తాలుకు కంటెంటంతా తనదే అనేస్తాడేమో!! – యాసీన్ -
‘పేడ కాస్త రుచి చూస్తే తెలిసిపోతుంది’
న్యూజెర్సీ: ఆవుపేడ కేకులు.. ఇది ఈపాటికే వినే ఉంటారు. మన దేశంలో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు వీటి అమ్మకాలను ఎప్పుడో ప్రారంభించాయి. అయితే ఆవు పేడ కేకులు ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుకాణంలో ఆవుపేడతో చేసిన కేకులు అమ్మకానికి పెట్టారు. దీని ధర ఆన్లైన్ రేట్ల కన్నా తక్కువగా ఉన్నాయి. పది కేకులు రూ. 214కే లభ్యమవుతాయి. దీనితో అక్కడి దుకాణానికి వచ్చిన జనం ఓసారి దాన్ని పరిశీలించాకే వెనుదిరుగుతున్నారు. అయితే ఇక్కడ ఓ ముఖ్య గమనిక.. ఈ కేకులు తినడానికి మాత్రం కాదు అని దుకాణదారులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసమే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పేడ కేకుల ప్యాకెట్‌పై భారత ప్రోడక్ట్ అని రాసి ఉంది. దీన్ని ఫొటో తీసిన మహిళ ఆమె సోదరుడు సమర్ హలంకర్‌కు పంపించింది. అతడు దాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు అతనికి తలెత్తిన ప్రశ్నను వెలిబుచ్చాడు. ‘ఇంతకీ ఇది దేశీ ఆవుల పేడతో చేసినవా? లేక విదేశీ ఆవుల పేడతో చేసినవా?’ అని అనుమానపడ్డాడు. దీనికి నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ‘ఏముంది? అనుమానం నివృత్తి చేసుకోడానికి పేడ కేకులను కాస్త రుచి చూడండి.. మీకే తెలుస్తుంది’ అంటూ ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు. -
ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?
బిజనోర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పూర్ణిమకు రకరకాల డిజైన్ల రాఖీలు మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ జిల్లాలో శ్రీకృష్ణా గోశాల నిర్వాహకులు విభిన్నంగా ఆవు పేడతో రాఖీలు తయారు చేశారు. సహజ రంగులు, దారాలతో పర్యావరణ హితంగా వీటిని తయారు చేసినట్టు ఎన్నారై మహిళ అల్కా లహోటి(52) తెలిపారు. తన తండ్రికి తోడుగా గోశాల నిర్వహణను చూసుకునేందుకు ఇండోనేసియాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె బిజనోర్‌కు వచ్చేశారు. ‘జునా అఖహరాతో కలిసి ఆవు పేడతో మేము తయారుచేసిన రాఖీలను మొదటసారి కుంభమేళాలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. ప్రజల కోసం ఇలాంటి రాఖీలు రూపొందించాలని స్వాములు సూచించారు. ఇతర నిపుణుల సాయంతో రాబోయే రాఖీ పండగ కోసం వేల సంఖ్యలో రాఖీలు తయారుచేశాం. ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశా నుంచి ఆర్డర్లు వచ్చాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో టెంప్లేట్స్ తయారుచేసుకుని వీటిలో ఆవు పేడ నింపుతాం. తర్వాత వీటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచుతాం. ఆరిపోయిన తర్వాత పర్యావరణహిత రంగులద్ది, రంగు రంగుల దారాలు కడతాం. చైనా రాఖీలతో పోలిస్తే ఈ రాఖీలు పర్యావరణహితమైనవి. వీటిని తయారుచేయడంలో మొదట్లో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ రాఖీలు త్వరగా ఇరిగిపోయేవి. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఈ సమస్యను అధిగమించాం. గట్టిగా, దృఢంగా ఉండేలా వీటిని రూపొందించగలిగాం. తక్కువ ధరకే వీటిని విక్రయిస్తాం. మిగిలిపోయిన రాఖీలను ఉచితంగా పంచిపెడతామ’ని అల్కా లహోటి వివరించారు. శ్రీకృష్ణా గోశాలలో 117పైగా ఆవులున్నాయి. ఆవు మూత్రంతో ఫినాయిల్, పేడతో పూలకుండీలు కూడా తయారుచేస్తున్నారు. -
కూల్‌గా ఉండేందుకు సూపర్ ఐడియా!!
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ విలవిల్లాడి పోతున్నారు. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణంలో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఓ మహిళ కారు మొత్తాన్ని పేడతో అలికింది. ఈ విషయం గురించి...‘ ఆవు పేడను ఇంత బాగా ఉపయోగించడం నేనెప్పుడూ చూడలేదు’ అంటూ రూపేశ్ అనే వ్యక్తి సదరు మహిళ కారు ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో..‘ఎండ నుంచి తప్పించుకునేందుకు భలే ఐడియా ఇచ్చారుగా మేడమ్. ఇందులో కూర్చుంటే ఏసీ వేసుకోకున్నా సరే చాలా చల్లగా ఉంటుందట. మీరూ ట్రై చేయండి’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు, చలికాలంలో వేడిమి కోసం ఇంటి గోడలను పేడతో అలుకుతున్నారన్న సంగతి తెలిసిందే. -
పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు
ఈ-కామర్స్ వెబ్సైట్ల రాకతో మనకు కావాల్సిన వస్తువులను కాలు కదపకుండా ఇంటికి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. ఆన్లైన్ ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు చెంతకు వచ్చి చేరుతోంది. అయితే మనం కొనాల్సిన వస్తువు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూల మీద ఆధారపడుతుంటాం. ఇలాంటి రివ్యూలే ఇప్పుడు మనకు హాస్యం పండిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో పిడకల మీద పెట్టిన రివ్యూలు చూస్తే కడుపు చెక్కలవాల్సిందే. హిందువులు వివిధ క్రతువుల్లో ఆవు పేడ పిడకలను వినియోగిస్తుంటారు. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకలను ‘కౌ డంగ్ కేక్’ పేరుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి. వీటి గురించి తెలియని కొంత మంది రాసిన రివ్యూలు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘ఇవి చాలా బాగున్నాయి. వీటి వాసన గులాబి పూల మాదిగా ఉందని’ పేర్కొంటూ ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ‘వీటి సైజు చాలా పెద్దగా ఉంది. నోటితో కొరకడానికి వీలు కాదంటూ’ మరొకరు పేర్కొన్నారు. దీని రుచి అమోఘం అంటూ మరొకరు పొడిగారు. ‘దీన్ని కొనకండి. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ బాలేదంటూ’ ఇంకొరు ఒక స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఈ రివ్యూలు చూసిన తర్వాత మనోళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. ఇంట్లో డెకరేషన్ కోసం పిడకలు వాడతారని సదరు వెబ్సైట్లు పేర్కొనడం కొసమెరుపు. -
ఆవు పేడ చోరీ.. జైలు పాలైన ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, బెంగళూరు: డబ్బు, బంగారం, విలువైన వస్తువులే కాదు.. ఆవు పేడను కూడా చోరీ చేస్తున్నారు. ఆవు పేడ చోరీ చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగి జైలు పాలయ్యాడు. లక్షల్లో జీతం వస్తున్నా.. పేడ కోసం కక్కుర్తిపడి ఇలా కటకటాలపాలవడం అందినీ ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటకలోని చిక్కమాళలూరు జిల్లా బీరూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బీరూర్ పశుసంవర్ధక శాఖ సుమారు 30-40 ట్రక్కుల పేడను సేకరించింది. దాని విలువ రూ. 1.25 లక్షలు. అయితే అక్కడ నిల్వ ఉంచిన పేడ రాత్రికిరాత్రే మాయమైంది. ఈ చోరీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పశుసంవర్దక శాఖ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శాఖలోనే సూపర్వైజర్గా పనిచేస్తున్న ఉద్యోగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. దొంగలించిన పేడను ఓ ప్రైవేట్ స్థలంలో దాచినట్టు.. పేడను కాజేసీ రైతులకు అమ్మాలని భావించానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై గోవులతో పాటు వాటి పేడపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం వస్తుందేమోనని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కాగా, భారతీయ వ్యవసాయ విధానంలో ఆవు మూత్రం, పేడకు ప్రత్యేక స్థానముంది. పశువుల పెంటను పంటపొలాలకు ఎరువుగా చల్లుతారు . దీంతో ఆవు పేడకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. -
మంత్రగాడి మాటలు నమ్మినందుకు..
-
పాము కాటు.. ఆవు పేడతో పూడ్చిపెట్టారు..
బులంద్షార్, ఉత్తరప్రదేశ్ : పాము కాటుకు గురైన మహిళను కాపాడేందుకు ఆవు పేడలో పూడ్చి పెట్టిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వంట చెరకు కోసం పుల్లలకు వెళ్లిన దేవేంద్రీ(35) అనే మహిళను నాగుపాము కాటేసింది. దీంతో ఆమె భర్త స్థానిక మంత్రగాడికి కబురు పెట్టాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మంత్రగాడు బాధితురాలిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆవు పేడలో మహిళను కప్పివుంచితే అది విషాన్ని లాగేస్తుందని చెప్పడంతో గ్రామస్థులు అందుకు ఏర్పాటు చేశారు. దేవేంద్రీ శరీరాన్ని 75 నిమిషాల పాటు ఆవు పేడతో కప్పిపెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దేవేంద్రీకి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మంత్రగాడి మాటలు నమ్మినందుకు తన భార్య ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందని భర్త కన్నీరుమున్నీరు అయ్యాడు. -
ఆవుపేడతో అడవికి జీవం
సాక్షి, ఆసిఫాబాద్: ఏళ్ల నాటి చెట్టు కళ్ల ముందే కనుమరుగవుతుంటే ఏమి చేయలేక ఇన్నాళ్లు నిరాశపడిన అటవీ అధికారులకు ఓ చక్కటి పరిష్కారం దొరికింది. సహజ సిద్ధంగా ఎటు వంటి ఖర్చు లేకుండా ఆవుపేడ, బంకమట్టి తో ఎండిపోయే చెట్లకు పునర్జీవం పోయడమే ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా అడవి లోని చెట్లను కలప కోసమో లేక అటవీ భూమిని సాగుచేయాలనో స్థానికులు చెట్లను నరికివేస్తారు. కానీ కొన్ని చెట్లు ధృఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కష్టం. దీంతో చెట్టు కాండానికి గొడ్డలితో గాటు పెట్టి కొద్ది రోజుల తర్వాత వాటంతట అవే ఎండిపోయేలా చేసి అక్కడి భూమిని సాగు చేయడమో లేక ఎండిన కలపను అక్రమంగా తరలించడమో చేసేవారు. అటవీ అధికారు లు ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టడం, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయడమో చేసేవారు. కానీ గొడ్డలి గాయలతో ఉన్న చెట్లు మాత్రం నెల రోజుల వ్యవధిలో చూస్తుండగానే ఎండిపోయేవి. గాటు పెట్టి వదిలివేయడం అక్రమంగా అడవిలో చెట్లను నరికేవాళ్లు గొడ్డలి వంటి ఆయుధాలతో నరికి వేసి తమకు అనువైన సమయంలో వాటిని తరలిస్తారు. కానీ నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లు ధృ«ఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కొంత కష్టంతో పని. అంతేకాక ఒక వేళ కష్టపడి చెట్టును నరికి వేసిన దానిని మరల ముక్కలుగా చేసి అటవీ ప్రాంతం నుంచి బయటికి తరలించడం మరింత కష్టం. ఎలాగైనా చెట్లను అక్కడి నుంచి తొలగించాలని భావించిన వాళ్లు ముందుగా ఆ చెట్టు కాండం చుట్టూ దాదాపు 10 సెంటీమీటర్ల వరకు గొడ్డలితో ఒక పెద్ద గాటు పెడతారు. దీంతో కాండంపై ఉన్న బెరడు తొలగిపోవడంతో ఆ చెట్టు కొమ్మలపై భాగానికి కింది భాగంలో ఉండే వేరు వ్యవస్థకు పోషక పదార్థాల సరఫరా ఆగిపోతుంది. దీంతో నెల రోజుల్లోనే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు చెట్టు మొదలు వద్ద నిప్పు పెట్టడంతో మొత్తం బూడిద అవుతుంది. అలాకాక దుంగలు అవసరముంటే ఎండిన తర్వాత ముక్కలుగా చేసుకుని అక్కడి నుంచి తరలిస్తారు. దీంతో చెట్టు దానంతట అదే కింద పడిపోయి చనిపోయిందనుకునేలా అటవీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొంత మంది ఈ ఎత్తుగడను అనుసరించేవారు. దీనికి విరుగుడుగా ఆసిఫాబాద్ డివిజన్ అటవీ అధికారి డి.రవీందర్‌గౌడ్ ఓ కొత్త పద్ధతిని తెలుసుకుని ఆ చెట్లను బతికించి నిరూపించారు. ఆవుపేడ, బంక మట్టితో చెట్టు కాండం చుట్టూ గొడ్డలితో చేసిన గాటును మొదట సున్నితంగా ఎండిన బెరుడు కణాల్ని తొలగించారు. ఆ ప్రాంతాన్ని నునుపుగా చేసి జీవం ఉన్న కణాలకు పైభాగాన్ని కింది భాగాన్ని కలుపుతూ ఆవుపేడ, బంక మట్టిని నీటితో కలిపి చేసిన మిశ్రమాన్ని ఆ గాటు పడిన ప్రాంతంలో అతికించారు. ఇలా కొద్దిరోజుల వరకుపై బెరుడుకు కింది బెరడు ద్వారా పోషక పదార్థాల సరఫరా జరిగి చెట్టుకు మళ్లీ పునరుజ్జీవనం కలిగింది. ఈ పద్ధతిలో గత సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని దహెగం మండలం రావులపల్లి అడవిలో సుమారు 70పైగా నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లకు జీవం పోశారు. ఈ ప్రయోగంతో అటవీశాఖకు ఓ పరిష్కారం దొరికినట్టేనని అటవీ అధికారులు పేర్కొన్నారు. -
17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే!
ఆవులను పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని మనకు ఇన్నాళ్లుగా తెలుసు. అయితే ఇప్పుడు ఓ సరికొత్త ప్రయోజనం కూడా ఉందని కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నిరూపించింది. ఆవు పేడ నుంచి తయారుచేసిన బయో గ్యాస్‌తో బస్సులను నడిపిస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. సాధారణంగా డీజిల్‌తో నడిపించే బస్సులకు లీటర్ డీజిల్‌తో మహా అయితే నాలుగైదు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజి రాదు. డీజిల్ ధర లీటరు 60 రూపాయలకు పైనే ఉంది. కానీ ఇప్పుడు వీళ్లు కనుగొన్న కొత్త పద్ధతిలో బయో గ్యాస్‌తో బస్సు నడిపితే.. 17 కిలోమీటర్లకు ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుందట. తాజాగా ఈ బస్సును కోల్‌కతా నగరంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ ప్రయాణంలో మొత్తం 17.5 కిలోమీటర్ల దూరానికి లెక్క కడితే ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయే ఖర్చయింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత చవకైన ప్రజారవాణా వ్యవస్థ ఇదేనని అంటున్నారు. ఢిల్లీలో బస్సులను సీఎన్జీతో నడిపించినా కూడా కిలోమీటరకు దాదాపు నాలుగైదు రూపాయలు చార్జీ అవుతోంది. ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్ అనే ఈ కంపెనీ ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేసింది. ఈ సంస్థ అశోక్ లేలాండ్ కంపెనీతో చేతులు కలిపింది. 54 సీట్లున్న బస్సును రూ. 13 లక్షలకు అందించారు. ఇలాంటివి సుమారు 15 బస్సులను త్వరలోనే కోల్‌కతాలో నడిపిస్తామని చెబుతున్నారు. అన్నింటిలోనూ ఒకే తరహా చార్జీలు ఉంటాయి. జంతువులు, వృక్షాల వ్యర్థాల నుంచి మీథేన్‌తో కూడిన బయోగ్యాస్ తయారవుతుంది. ఇది ప్రమాదరహితం, రంగులేని గ్యాస్. దీన్ని వాహనాలకు, విద్యుత్ ఉత్పత్తికి, వంటకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణ అనుకూలమైన ఇంధనం. ప్రస్తుతం తాము బీర్భూమ్ జిల్లాలోని తమ ప్లాంటులో ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేస్తున్నామని, దీన్ని ట్యాంకర్ల ద్వారా కోల్‌కతా తరలిస్తున్నామని ఫోనిక్స్ ఇండియా గ్రూపు సీఎండీ జ్యోతి ప్రకాష్ దాస్ తెలిపారు. బయోగ్యాస్ ఉత్పత్తికి కిలో రూ. 20 చొప్పున ఖర్చవుతుంది. కిలో గ్యాస్‌తో బస్సు 5 కిలోమీటర్లు నడుస్తుంది. దాస్ బోటనీలో పీహెచ్డీ చేశారు. గత 8 ఏళ్లుగా బయో గ్యాస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు తాము జర్మనీ సంస్థ నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని, కిలో గ్యాస్‌తో 20 కిలోమీటర్లు నడిచేలా చూస్తున్నామని అన్నారు. ట్యాంకులో 80 కిలోల గ్యాస్ పడుతుందని, దాన్ని ఫుల్ చేస్తే 1600 కిలోమీటర్లు వెళ్తుందని, అందుకే చార్జీలు బాగా తక్కువ ఉంటాయని ఆయన వివరించారు. -
ఆవుపేడపై పరిశోధనకు ఓ కమిటీ!
వ్యాధులను నయం చేయడంలో గోమూత్రం, గోమయం (ఆవుపేడ) పాత్ర ఏమైనా ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవు పవిత్రమైనదని, దాని మూత్రం, పేడలతో అపార ప్రయోజనాలున్నాయని చెబుతున్న వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ విషయంలో వాస్తవాలను శాస్త్రీయంగా రుజువు చేసేందుకు ఈ కమిటీని నియమిస్తామని కేంద్రం తెలిపింది. ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి.. వీటన్నింటితో కూడిన 'పంచగవ్య'కు ఔషధ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఐఐటీ ఢిల్లీలోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (సీఆర్డీటీ) ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. ఐఐటీ ఢిల్లీలో జరిగే జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై వివరంగా చర్చిస్తామని సీఆర్డీటీ అధిపతి ప్రొఫెసర్ వీరేంద్రకుమార్ తెలిపారు. స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ త్వరలోనే తెలియజేస్తుందని ఆవు మూత్రం, పేడలపై దీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్న విజయ్ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కమిటీ విషయాన్ని తెలిపారు. అయితే కమిటీ కోసం ప్రత్యేకంగా నిధులు మాత్రం ఏమీ కేటాయించలేదు. ఆర్ అండ్ డీ స్కీము కిందే దీనికి నిధులిస్తామన్నారు. -
ఆవు పేడతో అదిరే డ్రస్
ఆవు పేడతో ఇళ్ల ముందు కళ్లాపి చల్లుకోవడం మనకు తెలుసు.. పిడకలు కొట్టి, గోబర్‌గ్యాస్ ప్లాంట్ ద్వారా ఇంధనంగా వాడుకోవడమూ చూసుంటాం. మరి.. ఆవు పేడతో వస్త్రాన్ని తయారు చేయడం మీరెప్పుడైనా చూశారా? ఫొటోలో మోడల్ ధరించింది ఆవుపేడతో తయారైన దుస్తులే అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి మరి. ఎందుకంటే నెదర్లాండ్స్‌కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ ఆల్రెడీ ఈ పనిచేసేసింది కాబట్టి. నెదర్లాండ్స్ డెయిరీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఫలితంగా పాడిపశువుల వ్యర్థాలు ప్రతేడాది పెరిగిపోతున్నాయి. వ్యర్థాలు నీటిలో కలసిపోయి పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఎసాడీ ప్రతిపాదిస్తున్న వినూత్న మార్గం ఈ పేడ దుస్తులు! కొన్ని రసాయన ప్రక్రియలతో పేడలోని సెల్యులోజ్‌ను వేరుచేసి బయోప్లాస్టిక్, బయో పేపర్, బయో వస్త్రాలుగా మార్చవచ్చని ఎసాడీ నిరూపించింది. ఈ దుస్తులకు ఎసాడీ పెట్టిన పేరు ‘మెస్టిక్’(డచ్ భాషలో పేడను మెస్ట్ అంటారు). ఆవు పేడను ఎరువుగా, ఇంధనంగా వాడటం సమస్యను సగమే పరిష్కరిస్తుందని, వస్త్రాలు తయారు చేస్తే సహజ వనరులను కాపాడుకోవచ్చని అంటున్నారు ఎసాడీ. ఈ ఏడాది జూన్‌లో ఎసాడీ ఎందోవెన్ మున్సిపాలిటీ భాగస్వామ్యంతో మెస్టిక్ వస్త్రాల ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు. -
ఆవుపేడతో వెనీలా పరిమళం
పరిపరి శోధన గోమయాన్ని... అనగా ఆవుపేడను మనదేశంలో పవిత్ర పదార్థంగా భావిస్తారు. అందువల్ల మనదేశంలో దీనికి ఎనలేని డిమాండ్ ఉంది. ఇతర దేశాల వారు దీనిని పెద్దగా పట్టించుకోరు. వారికి ఏ పేడ అయినా ఒకటే! అయితే, జపాన్‌లోని ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ పరిశోధకులు మాత్రం ఆవుపేడపై నానా పరిశోధనలు సాగించి, దాని నుంచి ఐస్‌క్రీములు, కూల్డ్రింకులు వంటివాటికి రుచి కలిగించే వెనీలా పరిమళాన్ని పుట్టించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పీడనకు గురిచేస్తే ఆవుపేడ నుంచి వెనీలా పరిమళం పుడుతుందనే మహత్తర విషయాన్ని లోకానికి చాటారు. ఆవుపేడ నుంచి పుట్టించిన ఈ పరిమళంతో మసాచుసెట్స్‌లోని ఒక కంపెనీ ఐస్‌క్రీముల తయారీ కూడా ప్రారంభించడం విశేషం. -
పేడే పెన్నిధి!
ఆల మందను చూసి ఆడపిల్లని ఇవ్వాలి అనేది పెద్దల మాట. పాడి ఉన్న చోట పంట ఉంటుందని, ఇవి ఉన్న ఇంటిలో ఆడపిల్ల హాయిగా బతుకుతుందని నాటి పెద్దల భరోసా. పాడికి పంటకు ఉన్న సంబంధం దండలో దారం లాంటిది.. ఒక్కమాటలో.. పంటకు పేడే పెన్నిధి! పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి. ఇంతకూ పేడలో ఏముంది? మనిషిని, అతని చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు శాసిస్తుంటాడనేది కొందరి విశ్వాసం. జీవుల మనుగడ వెనుక కంటికి కనిపించకుండా అంతటా ఆవరించిన శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్ధారిత నిజం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయమే శక్తి. ఆవు పేడ, మూత్రాలలో హితోపకారులైన ఈ సూక్ష్మజీవుల సముదాయాలు కోటాను కోట్లున్నాయి. ఒక గ్రాము పేడలో మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులున్నాయని అంచనా. ఇవి తమ జీవనక్రియ ద్వారా మనిషి మనుగడకే కాదు.. నేల మీద ఉనికిలో ఉన్న అన్ని రకాల జీవజాలం మనుగడకు అవసరమైన వనరులను అందిస్తున్నాయి. ప్రధానంగా పంటల విషయానికి వస్తే.. ఇవి నేల, గాలి, నీరులో ఉన్న అన్ని రకాల పోషకాలను సంగ్రహించి మొక్కలకు అందజేస్తున్నాయి. సూక్ష్మజీవులే పంటకు పోషణ, రక్షణ! పేడ ఎరువు ద్వారా పొలం మట్టిలోకి చేరిన ‘మేలు చేసే’ సూక్ష్మజీవులే మన పంటలకు పోషకాలను అందిస్తున్నాయి. కీడు చేసే ఇతర రకాల బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలను నియంత్రించే కాపాలాదారులుగా కూడా వ్యవహరిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టుకునే సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఇదే. ఇవి విరామమెరుగక చెమటను చిందించే రైతు కంటే ఎక్కువగా అనుక్షణం శ్రమిస్తుంటాయి. ఇవే కాకుండా మొక్కల మనుగడకు, ఎదుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నాయి. వీటికి తోడు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, రాగి, సల్ఫర్, మాంగనీస్, మల్బేడినమ్, వనాడియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు పంటలకు అత్యవసరమైన అమినో ఆమ్లాలు పేడలో ఉన్నాయి. తొలి వ్యవసాయ సమాజాలు ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన అనుభవాలను క్రోడీకరించి పూర్వీకులు ప్రాచీన భారతీయ వ్యవసాయ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ‘కృషి పరాశర’, ‘వృక్షాయుర్వేద’, ‘కృషివల్లభ’, ‘కాష్యపీయ కృషి సూక్తి’, ‘లోకోపకార’ తదితర ప్రాచీన భారతీయ వ్యవసాయ విజ్ఞాన గ్రంథాలన్నిటిలోనూ పశువుల పేడ, పశువుల మూత్రంను వివిధ పద్ధతుల్లో వ్యవసాయానికి ఎలా వాడేదీ వివరించారు. పేడ, మూత్రంలను ఎరువులుగా, చీడపీడల నివారిణులుగా ఉపయోగించడం గురించి విశదపరిచారు. ఏభయ్యేళ్ల క్రితం వచ్చిపడిన పారిశ్రామిక వ్యవసాయ విధానంతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మజీవరాశికి నిలయమైన పేడ తదితర సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యం తగ్గి.. వివిధ రకాల రసాయనాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం అభివృద్ధి మాటెలా ఉన్నా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాలం అకాలమై, రుతువులు గతి తప్పాయి. ఈ విషయాన్ని వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలు సాధారణ వ్యవసాయ కూలీల వరకు అందరూ గుర్తించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం తిరిగి తన మూలాలను శోధించుకోవాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి. కృత్రిమ రసాయనిక ఎరువుల స్థానంలో.. పేడ, మూత్రంలతో తయారైన సహజ ఎరువులు, పంటల వ్యర్థాలతో తయారయ్యే కంపోస్టులే భూమికి బలిమిని, రైతుకు కలిమిని ఇస్తున్నాయి. ఎందరో రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. - ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఆవు పేడతో ఉపయోగాలెన్నో! ఆవు పేడ ఉపయోగాలేమిటి? అని అడగటం అంటే.. సూర్యుడి ప్రయోజనం ఏమిటి? అని అడగటం వంటిదే! రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం. వ్యవసాయానికి దిబ్బ ఎరువు, పంచగవ్య, బీజామృతం, జీవా మృతం, అమృత్‌పానీ తయారీలో ఆవు పేడ వాడకం తప్పనిసరి. పంచగవ్యను మనుషులకూ ఔషధంగా వాడుతున్నారు. కిలో పేడతో ‘నాడెప్’ పద్ధతిలో 20 కిలోల ఎరువును చేయొచ్చు. సేంద్రియ పురుగుమందులతోపాటు సౌందర్య సాధనాలు, కాగితం, దోమల కాయిల్స్, ధూప్ స్టిక్స్ తయారీలో ఉపయోగ పడుతోంది. గ్రామస్థాయిలో గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసు కోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేడ ప్రయోజనాలు ఇంకెన్నో.. మెట్ట ప్రాంతాల ఆవుల పేడ శ్రేష్టం సాధారణంగా పశువుల పేడలో నత్రజని 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1% ఉంటాయి. అయితే, జంతువును బట్టి, జాతిని బట్టి, మేతను బట్టి పేడలో పోషకాల శాతం మారుతుంటుంది. మెట్ట ప్రాంతాల్లో గడ్డి మేసే ఆవుల పేడలో అన్ని రకాల (స్థూల, సూక్ష్మ) పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. - డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు, అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థ, పటాన్చెరు, హైదరాబాద్ పాశ్చాత్యులకూ పేడంటే ప్రేమే! సూక్ష్మజీవులు, వానపాములు వ్యవసాయం లో అంతర్భాగమని తొలుత గుర్తించి, ప్రకటించిన మహానుభావుడు జీవపరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన స్ఫూర్తితో.. బాలలకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయులను అమెరికాకు చెందిన ఎఫ్‌ఎఫ్‌ఎ సంస్థ సన్మానిస్తోంది. ఎండిన ఆవు పేడ ముద్దకు బంగారు పూతపూసి బహుమతిగా ఇస్తోంది. 2013లో బెట్టీకూన్ అనే ఉపాధ్యాయినికి ఈ అవార్డు దక్కింది. ప్రాణ రక్షక ఔషధం పేడ! పేడ సజీవమైన ఎరువు. మట్టిలోని జీవులకు పేడ ప్రాణ రక్షక ఔషధం వంటింది. భూసారాన్ని పెంపొందించడంలో పేడ పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ, తండ్రులు, తాతల నాటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలో చాలా వరకు వదిలేశాం. కర్నాటక, మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఇప్పటికీ పట్టుదలగా సేంద్రియ సాగు కొనసాగిస్తున్నారు. పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం, బీజామృతం వంటి వాటిల్లో పేడను విరివిగా వాడుతున్నారు. - డా. అంకిరెడ్డి ఓబిరెడ్డి (ankireddyobi@yahoo.co.in), విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు