మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం.. | Uma Bharti Throws Cow Dung On Liquor Shop Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం..

Published Thu, Jun 16 2022 7:59 AM | Last Updated on Thu, Jun 16 2022 8:13 AM

Uma Bharti Throws Cow Dung On Liquor Shop Madhya Pradesh - Sakshi

భోపాల్‌/నివారీ:  మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అది కూడా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే ఇదంతా చేస్తోంది. ఈ సారి భిన్నంగా తన పోరాటాన్ని చూపించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమా భారతి. తాజాగా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆమె చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో ఓ మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ‘పేడ విసరడమే కాదు, దుకాణంపైకి రాళ్లు కూడా రువ్వుతున్నా’నని వీడియో తీస్తున్న వ్యక్తితో ఉమాభారతి అంటూ కన్పించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశాడు. గతంలోనూ ఉమాభారతి భోపాల్లోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లి బాటిళ్లపై రాళ్లు విసిరి పగలగొట్టడం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement