Uma bharathi
-
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర
నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు. పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్‌లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! #WATCH | Ayodhya, UP: On Ram Temple 'pran pratishtha', Sadhvi Ritambhara, Founder of Param Shakti Peeth and Vatsalyagram, says, " This is the happy hour of 'pran pratishtha', whole Country and the whole world have been decorated...kar sevaks' sacrifices have become… pic.twitter.com/vLp6ORtabZ — ANI (@ANI) January 21, 2024 -
హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన హిమాలయాల పర్యటనను రద్దు చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నవంబర్ 9 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందు ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని నిరాకరించి, తాను హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు నమోదు కాలేదు. అయితే ఆ తరువాత ఆమె మనసు మార్చుకుని, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమాభారతి లలిత్పూర్ రైల్వే స్టేషన్లో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి గాయం అయ్యింది. తరువాత ఆమె ఝాన్సీలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. తరువాత వైద్యుల సూచన మేరకు భోపాల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని ఇటీవల స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు -
మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం..
భోపాల్/నివారీ: మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అది కూడా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే ఇదంతా చేస్తోంది. ఈ సారి భిన్నంగా తన పోరాటాన్ని చూపించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమా భారతి. తాజాగా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆమె చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో ఓ మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ‘పేడ విసరడమే కాదు, దుకాణంపైకి రాళ్లు కూడా రువ్వుతున్నా’నని వీడియో తీస్తున్న వ్యక్తితో ఉమాభారతి అంటూ కన్పించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశాడు. గతంలోనూ ఉమాభారతి భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లి బాటిళ్లపై రాళ్లు విసిరి పగలగొట్టడం తెలిసిందే. -
తేజస్వీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు
భోపాల్ : బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఆమె ప్రతిపక్షాలపై తరుచూ విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థులను పొగడటం చాలా అరుదు. బుధవారం భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమాభారతి మాట్లాడుతూ.. తేజస్వీ యాదవ్ మంచి కుర్రాడని, అతడికి మంచి భవిష్యత్ ఉందని ఆమె ప్రశంసించారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని.. కానీ ఎప్పటికైనా బిహార్‌ను పాలించేది అతనేనని జోస్యం చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపైనా ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి పరిపాలన అందించిఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఆయన తన పెద్దన్నయ్య లాంటి వాడని, ఈ ఎన్నికల కోసం ఎంతో నేర్పుగా పనిచేశారని ప్రశంసించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ19 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైన విషయం విదితమే. (బిహార్‌లో సరికొత్త అడుగులు!) -
ఉమా భారతికి కరోనా పాజిటివ్
-
ప్రియాంకకు ‘చౌకీదార్’ అర్థం తెలియదు
ముజఫర్‌నగర్: బీజేపీ ఉపాధ్య క్షురాలిగా ఇటీవల నియమించబడిన సీనియర్ నేత ఉమాభారతి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రాపై విరుచుకుపడ్డారు. ఆమెకు చౌకీదార్ (కాపలాదారు) అర్థమే తెలియదని విమర్శించారు. బీజేపీ చౌకీదార్లు కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారన్న ప్రియాంక వ్యాఖ్యలపై ఉమాభారతి స్పందించారు. ప్రియాంకకి చౌకీదార్ అర్థం తెలియదని, గ్రామాల్లో పేదల రక్షణ కోసం నిలబడేవారిని చౌకీదార్లు అంటారని ఆమె వివరించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ నియోజవకర్గంలో ఉమాభారతి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బల్యన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్ఎల్డీ, ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ స్థానంలో సంజీవ్ బల్యన్కు పోటీగా ఆర్ఎల్డీ చీఫ్ అజిత్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’గా అభివర్ణించిన ఉమాభారతి, భారీ గెలుపుతో మోదీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
‘అద్వానీపై ఫైర్‌బ్రాండ్ నేత కీలక వ్యాఖ్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, దిగ్గజ నేత ఎల్కే అద్వానీని పార్టీ పక్కనపెట్టిందనే ప్రచారం సరైంది కాదని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ‘ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు అద్వానీజీ గతంలోనే చెప్పార’ ని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ గురువారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో అద్వానీ పేరులేకపోవడం గమనార్హం. మరోవైపు అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్ధానానికి అమిత్ షాను బీజేపీ బరిలోకి దింపింది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలకు చోటుదక్కింది. అద్వానీ స్ధానం అమిత్ షాకు కేటాయించడంతో దిగ్గజ నేతను పార్టీ దూరం పెడుతున్నదనే విమర్శలు జోరందుకున్నాయి. సోషల్ మీడియాలోనే ఇదే అంశంపై ఆసక్తికర చర్చ సాగింది. -
‘మందిర్‌పై బీజేపీకి పేటెంట్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : రామ మందిరంపై బీజేపీకి పేటెంట్ లేదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి అన్నారు. అయోథ్యలో ఆలయ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోథ్య సందర్శించి మందిర నిర్మాణం కోసం పట్టుబట్టడాన్ని ఆమె సమర్ధించారు. ఉద్ధవ్ థాకరే ప్రయత్నాలను తాను సమర్ధిస్తానని, రాముడు అందరివాడనీ, అయోథ్యలో మందిర నిర్మాణం కోసం ఎస్పీ, బీఎస్పీ, అకలీదళ్ సహా అసదుద్దీన్ ఓవైసీ, ఆజం ఖాన్‌తో పాటు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. కాగా,ఈ వారాంతంలో అయోథ్యను సందర్శించిన ఉద్దవ్ థాకరే రామాలయ నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆదివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలతో చెలగాటం వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు హితవు పలికారు. మరోవైపు మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని సంఘ్ పరివార్ నేతలు మోదీ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. -
కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చిన మహాత్ముడి మరణం
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్యా గాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా లబ్దిపొందగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఇబ్బందులను, నష్టాలను అనుభవించిందని ఆమె వ్యాఖ్యానించారు. గుజరాత్లో పర్యటిస్తున్న ఉమాభారతి.. ఒక సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ మహాత్ముడి మరణం వల్ల లబ్ది పొందిన వ్యక్తులు, పార్టీ ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. ఇదే క్రమంలో సంఘ్ నేతలు జైలుకు వెళ్లారు.. సంఘ్‌పై నిషేధం విధించారు.. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంఘ్ కార్యకర్తలు ఇబ్బందులు, సమస్యలనే ఎదుర్కొంటూనే ఉన్నారు అని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలు ఆయనకు తెలుసుకు కాబట్టే.. స్వతంత్రం వచ్చాక.. కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ సూచించారని ఆమె అన్నారు. -
రాజీనామాపై ఉమాభారతి నో కామెంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాజీనామా వార్తల నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్పందించారు. ఆ అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, కామెంట్ కూడా చేయబోనని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ పేర్లతోసహా సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ఆయా మంత్రులను సంప్రదిస్తూ వస్తోంది. రాజీవ్ ప్రతాప్ రూడీ గురువారమే రాజీనామా చేయగా, తన నిర్ణయం కాదని.. అధిష్టానం ఆదేశాలమేరకే తాను రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశ దక్కిందని, ఇప్పుడు పార్టీకి సేవలు చేస్తానని రూడీ తెలిపారు. మరో మంత్రి మహేంద్ర నాథ్ పాండేను యూపీ బీజేపీ అధ్యక్ష పదవి అప్పజెప్పగా, తదనంతరం ఆయన రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి పదవికి సంజీవ్ బల్యన్ కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. వీరంతా అధిష్టానం ఒత్తిడి మూలంగానే రాజీనామా చేస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇక మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా జేడీ(యూ) కు రెండు బెర్త్‌లు దక్కే అవకాశం ఉంది. మోదీ కొత్త టీంకు ముహుర్తం? -
గోదావరి బోర్డుపై కేంద్రానికి ఫిర్యాదు!
-
గోదావరి బోర్డుపై కేంద్రానికి ఫిర్యాదు!
♦ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ రేపు ఢిల్లీకి మంత్రి హరీశ్‌రావు ♦ కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి బోర్డు అంశం తీసుకెళ్లే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు గోదావరి బోర్డు చేస్తు న్న ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై కేంద్రా నికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ వెళ్లనున్న నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతి ని కలసి బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను ఆమె దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు న్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన గోదావరి బోర్డు... శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడం తెలి సిందే. ముసాయిదా అమల్లోకి వస్తే ప్రాజెక్టుల బ్యా రేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వా యర్లు, కాల్వ లు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటాయిం పులనే ప్రాజెక్టుల కింద వినియోగించాల్సి ఉం టుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజె క్టులవారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వాటి నిర్వహణనే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఏపీ చేపట్టిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశం ఏమిటని ప్రశ్నిస్తోంది. దీనిపై సోమవారం ప్రభుత్వ సలహా దారు విద్యాసాగర్‌రావు అధికారులతో చర్చించారు. -
కావేరీ నీటిని వదిలేది లేదు: కర్ణాటక సీఎం
నేటి భేటీ తర్వాత తదుపరి నిర్ణయం: కర్ణాటక సీఎం సాక్షి, బెంగళూరు: ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన గురువారం జరిగే ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పన ఈ నెల 30 వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 9.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలపై చర్చించడానికి తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. రెండు సమావేశాల్లోనూ మెజారిటీ సభ్యులు తమిళనాడుకు నీటిని వదలకూడదని తేల్చిచెప్పారు. -
‘కృష్ణా’పై కమిటీని రద్దు చేయండి
- కేంద్రమంత్రి ఉమాభారతికి సీఎం కేసీఆర్ లేఖ - తటస్థ సభ్యులతో కొత్త కమిటీ వేయాలని వినతి సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నిర్వహణపై కేంద్ర జల వనరుల శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో సభ్యుల నియామకాన్ని తప్పు పట్టింది. ఈ కమిటీని రద్దు చేసి తటస్థ సభ్యులతో కమిటీని మళ్లీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కేంద్రమంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నియంత్రణ, విద్యుత్ పంపకాలు తదితరాలపై వివాదాలు రేగుతుండటంతో వాటిపై కమిటీ వేయాలని కేంద్రం మూడు నెలల కిందటే నిర్ణయించింది. ఈ నెల 7న కేంద్ర జల వనరుల శాఖ అయిదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోఉన్న ఇద్దరు సభ్యుల నియామకాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. వీరిద్దరికీ ఏపీతో సంబంధాలున్న దృష్ట్యా తెలంగాణకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా వ్యవహరించే అవకాశముందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ‘‘నిపుణుల కమిటీలో ఉన్న మొహిలే కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్. గతంలో రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా పని చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఉంది. ఆ నివేదికపై తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. నిపుణుల కమిటీలో ఆయనను కొనసాగించటం సరైంది కాదు. మరో సభ్యుడిగా ఉన్న ఎంకే గోయల్.. రూర్కీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో శాస్త్రవేత్తగా ఉన్నారు. కృష్ణా బేసిన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేస్తున్నారు. దీంతో ఆయన తన ప్రయోజనాల కోసం ఏపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశముంది’’ అని ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణకు సంబంధం లేని తటస్థ నిపుణులతో కమిటీని వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు ప్రస్తుత కమిటీని నిలుపుదల చేయాలని కోరారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం దీనిపై నేరుగా కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలసి ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు. -
'కాలుష్యంతో డాల్ఫిన్లకు అంధత్వం'
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కాలుష్యం కారణంగా గంగానదిలో డాల్ఫిన్లు అంధత్వానికి గురవుతున్నాయని బుధవారం ఆమె పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వచ్చిన ఒక దరఖాస్తుకు ఆమె సమాధానం ఇస్తూ.. గంగానదిలో డాల్ఫిన్లు చూపు కోల్పోతున్న ప్రమాదం నేపథ్యంలో ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని తెలిపారు. అయితే, డాల్ఫిన్లు కాలుష్యంతో చూపు కోల్పోతున్నాయనడానికి, దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేదని నిపుణులు తెలిపారని చెప్పారు. డాల్ఫిన్లకు అంధత్వం రావడం వెనుక అనేక పరికల్పనలున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారని ఆమె వివరించారు. అయితే నిపుణుల పేర్లను ఆమె వెల్లడించలేదు. లండన్‌లోని జూలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో వీటి ఉనికిని గుర్తించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. -
రాజ్‌నాథ్‌తో చంద్రబాబు సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా అంతకు ముందు చంద్రబాబు...కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు వివాదంపై ఆయన చర్చించారు. -
నీళ్ల లొల్లిపై కమిటీ
కృష్ణాపై ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం ముగ్గురు సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్లతో అధ్యయనం కేఆర్ఎంబీపై మార్గదర్శకాలు రూపొందించనున్న కమిటీ.. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం సూచన.. మూడోరోజు చర్చల్లోనూ ప్రతిష్టంభన 90 టీఎంసీల వాటాకు తెలంగాణ పట్టు.. వ్యతిరేకించిన ఏపీ అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు టెలిమెట్రిక్ విధానం పెట్టి ప్రతి చుక్కనూ లెక్కించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ మూడోరోజు కూడా ఎటూ తేలలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులూ ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో జగడం తెగలేదు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనల మేరకు గురువారం ఉదయం జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ సమక్షంలో ఇరురాష్ట్రాల నీటి పారుదల మంత్రులు టి.హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశమయ్యారు. గడచిన రెండ్రోజులుగా ఉన్నతాధికారులు చేసిన వాదనలనే మంత్రులూ వినిపించారు. గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించిన నీటిలో తమ వాటాగా 90 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ పట్టుపట్టగా.. దాన్ని ఏపీ వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ కుడికాలువ తమ భూభాగంలో ఉన్నందున తామే నిర్వహించుకుంటామని ఏపీ వాదించగా అది కుదరదని, అన్ని ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాల్సిందేనని తెలంగాణ వాదించింది. ఈ చర్చల్లో ఏదీ తేలే పరిస్థితి లేదని భావించిన కేంద్రం చివరకు... కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీకి ముందు మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చింది. జూలై మొదటి వారంలో కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్లు ముగ్గురితో ఒక కమిటీ వేస్తామని, రెండు మూడు నెలల్లో ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందని, ఆ తర్వాత కేఆర్ఎంబీ పరిధి, అధికారాలు నిర్ణయిస్తామని తెలిపింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగాలని సూచించింది. అందుకు తెలంగాణ అంగీకరించింది. ఏపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఆ కమిటీ మార్గదర్శకాలు రూపొందించాలని, అందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. అయితే యథాతథ స్థితిని కేవలం నెలరోజులకే పరిమితం చేయాలని కోరింది. తాత్కాలిక యాజమాన్య ఏర్పాట్లపై నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రాని పక్షంలో మరోసారి ఇరుపక్షాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రులు విడివిడిగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి: హరీశ్‌రావు సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీది అదే మొండి వైఖరి. నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా వితండ వాదన చేస్తోంది. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటికే బచావత్ అవార్డు స్పష్టత ఇచ్చింది. గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే పైరాష్ట్రాలకు హక్కులు ఉంటాయని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినందున... తెలంగాణ వాటా కింద 90 టీఎంసీలు ఇవ్వాలి. తాత్కాలిక అవగాహన ప్రకారం వచ్చిన 299 టీఎంసీలు కూడా చాలా తక్కువే. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు ఇచ్చే వరకు చేయగలిగిందేమీ లేనందున.. బచావత్ అవార్డు అందుబాటులో ఉన్నందున దాన్ని అమలు చేయాలి. 299 టీఎంసీలకు అదనంగా 90 టీఎంసీలు కేటాయించాలని కోరాం. ఏపీ అందుకు అంగీకరించలేదు. జూలై మొదటి వారంలో ముగ్గురు రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్లతో కమిటీ వేసి వచ్చే మూడు నెలల్లోగా కేఆర్ఎంబీని నిర్వహణలోకి తెస్తామని కేంద్రం చెప్పింది. ఈ మూడు నెలలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం అభ్యర్థించింది. మేం అందుకు సమ్మతించాం. కానీ ఏపీ అందుకు అంగీకరించని పరిస్థితి ఉంది. అనేక సమస్యలకు పరిష్కారం వచ్చాకే కేఆర్ఎంబీ విధులు నిర్వర్తించగలుగుతుంది. దాన్ని నిర్వహణలోకి తేవడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలి. అప్పుడు మాకు అభ్యంతరం ఉండదు. టెలీమెట్రిక్ విధానం పెట్టండి. సంయుక్త బృందాలను ఏర్పాటు చేయండి. ప్రతి చుక్కను కూడా లెక్కపెడితే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మేం సిద్ధంగా ఉన్నామని మేం చెప్పాం. మేం మహారాష్ట్ర, కర్ణాటకతో కలిసి పనిచేయగలుగుతున్నాం. కానీ ఏపీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం. న్యాయస్థానంలో పోరాడుతాం. ఏపీకి సంబంధించి ఒక చుక్క కూడా మాకు అవసరం లేదు. మా హక్కుల కోసం మేం కొట్లాడుతాం. నీటి నిర్వహణలో ఇబ్బందులను వివరించాం: దేవినేని ఉమామహేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ పరిధిని ప్రకటించాలి. సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులతో దీనిపై కమిటీ వేస్తానంది. త్వరితగతిన మార్గదర్శకాలు విడుదల చేసి కేఆర్ఎంబీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. నెల రోజుల తాత్కాలిక ఏర్పాట్లపై మరోసారి చర్చలకు పిలుస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ సీఈ ఆధ్వర్యంలో ఉన్నా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాగానే తెలంగాణ కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని చెప్పాం. రాయలసీమకు మంచినీళ్లు ఇవ్వకుండా విద్యుత్ కోసం గేట్లు ఎత్తేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ వద్ద మా ఎస్పీఎఫ్ను పెట్టుకుంటామని చెబితే.. మొండిగా, తొండిగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన నీళ్లు వాళ్లు ఉపయోగించుకోవాలి. మొండిగా ఒకసారి 45 టీఎంసీలు, తొండిగా మరోసారి 90 టీఎంసీలు అంటున్నారు. -
'పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలి'
ఢిల్లీ: పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని కృష్ణా బోర్డు అధికారులను కేంద్రమంత్రి ఉమాభారతి ఆదేశించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు బృందం కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా రివర్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఉమాభారతికి హరీష్ రావు బృందం ఫిర్యాదు చేసింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా బోర్డు ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి ఉమాభారతి ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు అధికారులు నడుచుకోవాలంటూ ఆమె ఆదేశించారు. రేపు (మంగళవారం) కృష్ణా బోర్డు ఉన్నతాధికారులను కలవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరినట్టు సమాచారం. -
అవసరం అయితే సుప్రీంకోర్టుకు: హరీశ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులు న్యాయబద్ధమైనవేనని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరిన హరీశ్ రావు బృందం సాయంత్రం కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ కానుంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కొనసాగకూడదనేదే తమ వాదన అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలకు పిలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. తమ వాదనను ఉమాభారతి ముందు ఉంచుతామన్నారు. కృష్ణా బోర్డు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని హరీశ్ వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం కోసం అవసరం అయితే సుప్రీంకోర్టు వెళతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్ శాఖ అధికారులు కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నారు. -
రేపు ఢిల్లీకి మంత్రి హరీశ్‌రావు బృందం
హైదరాబాద్: తెలంగాణ భారీనీటిపారుదుల శాఖా మంత్రి హరీశ్‌రావు బృందం రేపు (సోమవారం) ఉదయం ఢిల్లీ వెళ్లనుంది. ఆ రోజు సాయంత్రం కేంద్రమంత్రి ఉమాభారతితో ఆయన బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్ శాఖ అధికారులు కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేయనున్నారు. -
నేడు ఢిల్లీకి చంద్రబాబు
రాత్రికి లండన్ పయనం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమా భారతిలతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. అనంతరం గురువారం రాత్రి ఆయన లండన్ పర్యటనకు బయలుదేరతారు. సీఎం వెంట ఆర్థిక, పురపాలక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ కూడా వెళతారు. స్థానికంగా జరిగే పెట్టుబడిదారుల సమావేశం, అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 13వ తేదీ తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. కాగా, బుధవారం అసెంబ్లీ ఆవరణలో చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు నే తృత్వంలో వాల్మీకి సామాజికవర్గ ప్రతినిధులు సీఎంను కలిశారు. తమను ఎస్టీలో చేరుస్తామని గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడంపై కృత జ్ఞతలు తెలిపారు. రజక సంఘం ప్రతినిధులు కూడా సీఎంను కలిసి తమను ఎస్టీల్లో చేరుస్తామన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిలీనియం అలయెన్స్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో వినూత్న సాంకేతిక పద్ధతుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరిస్తామని వారు సీఎంకు హామీనిచ్చారు. -
'పోలవరం ఎత్తు పెంచేది లేదు'
ఢిల్లీ: అనుకున్న గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు. న్యూఢిల్లీలో ఆమె మంగళవారం మీడియాతో మట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢిల్లీకి ఆహ్వానించానమని ఆమె తెలిపారు. పోలవరం డ్యామ్ ఎత్తు పెంచేది లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు. పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. నాబార్డ్ నుంచి ఆ నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు సహాయం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన కేంద్ర పథకాలతో నిధులు అందిస్తామని వెల్లడించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని.. కాలుష్య నివారణ, భూగర్భ జలాల రీఛార్జ్ కోసం ఖర్చుచేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వివరించారు. -
కర్ణాటక జడ్జి సమ్మతం కాదు
కేంద్ర మంత్రి ఉమాభారతికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 సభ్యుడిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని నియమించడం సమ్మతం కాదని రాష్ట్రం కేంద్రానికి స్పష్టం చేసింది. ‘కృష్ణా’ నీటి కేటాయింపుల వివాదంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి చెందిన జడ్జినే సభ్యుడిగా నియమించడం ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ప్రస్తుతం నామినేట్ చేసిన సభ్యుడి నియామకంపై పునరాలోచించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతికి సోమవారం లేఖ రాశారు. ‘ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా చేయాలి, నీటి లోటు ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్ ఎలా ఉండాలన్నది తేల్చాలి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు ఈ వివాదం కేవలం ఏపీ, తెలంగాణకే పరిమితం అంటున్నాయి. నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలని మేం (తెలంగాణ రాష్ట్రం) కోరుతున్నాం. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కర్ణాటక పిటిషన్లో భాగస్వామి అవుతుంది. ఈ సమయంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన జడ్జినే ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడం సమ్మతం కాదు’ అని లేఖలో విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. న్యాయబద్ధమైన కేటాయింపులు జరగాలంటే జడ్జి నియామకాన్ని వెనక్కు తీసుకునేలా చూడాలని కోరారు. -
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: జగన్
-
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టును చేపట్టినా వీటి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిర్ధిష్ట కేటాయింపులు జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోవాలని ఉమాభారతిని కోరారు. -
పోలవరం పూర్తిచేద్దాం.. సహకరించండి
- కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వినతి - కేంద్ర మంత్రి ఉమాభారతితో భేటీ - అదనపు నిధుల కే టాయింపుపై చర్చ న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని, సత్వరం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చండీగఢ్‌లో మంగళవారం జరగనున్న నీతి ఆయోగ్ ‘స్వచ్ఛ భారత్’ సీఎంల సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావులతో కలసి మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో అరగంటకుపైగా బాబు సమావేశమయ్యారు. రూ.100 కోట్లు వెంటనే ఇవ్వండి! పోలవరం ప్రాజెక్టు కోసం మంజూరు చేసిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరారు. 2016-17 బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. వచ్చే ఖరీఫ్‌లో కృష్ణా జలాల విడుదలలో తెలంగాణ, ఏపీ మధ్య విభేదాలు రాకుండా కేంద్రమే చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఏపీ భవన్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌షాతో సమావేశంలో ఇరు పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా అన్ని సమస్యలూ పరిష్కారం కాబోవన్నారు. కాగా, 6న జరగనున్న ఏపీ రాజధాని శంకుస్థాపనకు షాను ఆహ్వానించినట్టు సమాచారం. ఇదిలావుంటే, పోలవ రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్టు మంత్రి ఉమాభారతి మీడియాకు చెప్పారు. సీఎం చంద్రబాబు సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు. సమస్యలను ఇలా పరిష్కరించుకుందాం: తెలంగాణకు బాబు వినతి విభజన చ ట్టం.. షెడ్యుల్ 9, 10లోని సంస్థల పంపకాలు ఏడాదిలోపు పూర్తి కావాల్సి ఉందని, సమస్యల పరిష్కారంలో తెలంగాణ కలసి రావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘ఇద్దరు సీఎంలం కూర్చుని చర్చిద్దాం. వీలుకాకపోతే కేంద్రం సహకారంతో పెద్ద మనుషులను పెట్టుకుని పరిష్కరించుకుందాం.’ అని సీఎం అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ దిశగా స్పందన ఉండడంలేదన్నారు. మూడేళ్లలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కల నెరవేరాలి మూడేళ్లలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కల సాకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్పై సోమవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, అందువల్ల వైద్యసేవలందించడం సులువవుతుందన్నారు. ఇప్పటికే ఐదేళ్ల లోపు వయసున్న 40 లక్షల మంది చిన్నారుల వివరాల్ని కంప్యూటరీకరించామన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కార్యక్రమాలకు కేంద్రమంత్రి సుజనాచౌదరి సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. సుజనాచౌదరి మాట్లాడుతూ వైద్య పాఠశాలలు, కళాశాల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలుకు వనరుల్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపీఐఐసీ చైర్మన్ పి. కృష్ణయ్యలు పాల్గొన్న ఈ వర్క్‌షాప్‌లో రెడ్డీస్ లేబొరేటరీస్ కో-చైర్మన్ జీవీ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనాథరెడ్డి, అసోచామ్ హెల్త్ కేర్ చైర్మన్ డా.బీకేరావు, టీసీఎస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు గిరీష్ కృష్ణమూర్తి, మేదాంత కో- ఫౌండర్ సునీల్ సచ్దేవ, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అపరాజిత రామకృష్ణన్, కార్నా మెడికల్ డేటాబేస్ జనరల్ మేనేజర్ హిడే టోషీ యమౌచి, రెడ్డీస్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్, కృష్ణమూర్తి విజయన్‌లతోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
పోలవరాన్ని గడువులోగా పూర్తిచేస్తాం
-
పోలవరాన్ని గడువులోగా పూర్తిచేస్తాం: ఉమాభారతి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టేనని, దానిని నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. మంగళవారం ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పోలవరం సత్వర నిర్మాణ ఆవశ్యకతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి తక్షణం ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో దినేష్‌కుమార్, జలవనరుల శాఖ కార్యదర్శి తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. అథారిటీకి కేవలం సీఈవోను నియమించారని, పూర్తిస్థాయిలో అథారిటీ ఏర్పాటుకాలేదని హరిబాబు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడానికి నిధుల కొరతే కారణమన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.16 వేల కోట్లు అవసరం కాగా.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి ఉమాభారతి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని, తగిన కార్యాచరణ రూపొందించి ప్రాజెక్టును నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేలా అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గంగానదిలో 100 మృతదేహాలు
సర్వత్రా కలవరం; సమాచారం కోరిన కేంద్రం వున్నావ్ జిల్లాలో రెండు రోజుల్లోనే 104 మృతదేహాలు వెలికితీత పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గటంతో బయటపడ్డ శవాలు లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 వరకూ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. 45 గ్రామాల నుంచి వివరాల సేకరణ... మృతదేహాల వెలికితీత ఉదంతంపై పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎ.కె.గుప్తా ఆదేశించారు. మృతదేహాల్లో చాలావరకూ పురుషులో, స్త్రీలో గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయని, వీటికి శవపరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో డీఎన్ఏ పరీక్షల కోసం 80 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించారు. మిగతా మృతదేహాలు మరింత తీవ్రంగా దెబ్బతిని ఉండటం వల్ల వాటి నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకోవటం సాధ్యం కాలేదని ఐజీ ఎ.సతీష్గణేష్ తెలిపారు. ఈ మృతదేహాలు అవివాహిత యువతులు, చిన్నపిల్లలవి కావచ్చునని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా మృతదేహాలను ఖననం చేసే పరియార్ ఘాట్ వద్ద నీటి మట్టం తగ్గిపోవటంతో ఈ మృతదేహాలు బయటపడ్డాయని చెప్పారు. అవివాహితులు, చిన్నపిల్లలు మృతి చెందినపుడు వారి మృతదేహాలను బంధువులు ఖననం చేయకుండా గంగానదిలో విడిచిపెడుతుంటారని స్థానికులు వివరించినట్లు ఆయన చెప్పారు. వున్నావ్ చుట్టుపక్కల పరియార్ ఘాట్ వద్ద మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే 45 గ్రామాలను గుర్తించామని, గత ఏడాది కాలంలో ఆయా గ్రామాల్లో చనిపోయిన, మృతదేహాలకు పరియార్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబాల వివరాలివ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరామని వివరించారు. ఆ వివరాలు అందగానే.. సదరు కుటుంబాల డీఎన్ఏ నమూనాలతో.. నదిలో లభ్యమైన మృతదేహాల డీఎన్ఏ నమూనాలతోపోల్చి తనిఖీ చేస్తామని చెప్పారు. సామూహిక ఖననానికి నిర్ణయం... మృతదేహాలు పూర్తిగా దెబ్బతిని ఉండటంతో వాటిని వెలికి తీసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరాకరిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీలను వినియోగించటంపై స్థానికులు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం రాత్రి ఘటనా ప్రాంతాన్ని సందర్శించి.. వెలికితీసిన మృతదేహాలను తగిన రీతిలో ఖననం చేయాలని, ఈ మొత్తం ఉదంతంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలన్నారు. బృందాన్ని రప్పిస్తున్నాం: ఉమాభారతి గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడటంపై వాస్తవాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని పంపించాలని తమ శాఖ కార్యదర్శికి నిర్దేశించినట్లు కేంద్ర జల వనరులు, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కాన్పూర్ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతున్నందున.. గంగానదిలో నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో అనేక మృతదేహాలు నీటిపై తేలుతూ బయటపడ్డాయని ఉమాభారతి పేర్కొన్నారు. -
నేడు ఢిల్లీకి చంద్రబాబు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు మంత్రులతో ఈ సందర్భంగా ఆయన భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి నేతృత్వంలో జరిగే జల్‌మంథన్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయి రైల్వే ప్రాజెక్టులపై చర్చిస్తారు. 12.30కు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో బ్యాండ్విడ్త్పై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై చర్చిస్తారు. ఆ తర్వాత జాతీయ రహదారుల అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అవుతారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా బాబు భేటీ అయ్యే అవకాశముంది. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఇవ్వండి
కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ప్రాజెక్టుల గురించి బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు ప్రస్తావించలేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాలకు కొత్తగా కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరాం. ఆమె సానుకూలంగా స్పందించారు’ అని హరీశ్ తెలిపారు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కూడా కోరగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని ఆమె చెప్పారన్నారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం(ఏఐబీపీ) కింద చొక్కారావు-దేవాదుల ప్రాజెక్టుకు విడుదల కావాల్సిన నిధుల అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు చైర్మన్‌గా ఉన్న సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్విన్ పాండ్యాను, గోదావరి జలాల నిర్వహణ బోర్డు చైర్మన్ మహేంద్రన్ను లిశారు. దేవాదుల, కల్వకుర్తి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను హరీశ్ కోరారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. -
రాముడితో పాటు బాబానూ పూజిస్తా
-
క్రిమినల్ కేసుల్లో 53 మంది ఎంపీలు
* 24 మంది బీజేపీ, ఐదుగురు శివసేన సభ్యులపై అభియోగాలు * ఏడీఆర్ వెలువరించిన జాబితాలో ఒవైసీ, బాల్క సుమన్ పేర్లు సాక్షి, న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభకు ఎన్నికైన 541 మందిలో సభ్యుల్లో 53 మందిపై వివిధ నేరాభియోగాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (1), సెక్షన్ 8 (3) కింద ఈ అభియోగాలు నమోదైనట్టు తమ పరిశీలనలో తేలిందని ఏడీఆర్ వెల్లడించింది. అభియోగాలున్న వారంతా దోషులుగా తేలితే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హులవుతారని పేర్కొంది. నేరాభియోగాలు ఉన్న సభ్యుల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, బీజేపీ ఎంపీలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ కూడా ఉన్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది. ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ జగదీప్ చొక్కర్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు తెలిపారు. - అభియోగాలున్న సభ్యులనుంచి పార్లమెంటుకు విముక్తి కల్పించేందుకు, పెండింగ్ కేసులను ఏడాదిలోపు తేల్చేయాలంటూ సుప్రీంను కోరదామంటూ ప్రధాని మోడీ ఇటీవలే పిలుపు ఇచ్చారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని జగదీప్ చొక్కర్ గుర్తుచేశారు. క్రిమినల్ కేసులున్న 53 మంది సభ్యుల్లో 23మంది తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనవారని తెలిపారు. - {పజాప్రాతినిధ్య చట్టం కింద నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ ఎంపీలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహేశ్ గిరి, నళిన్ కుమార్ ఖతిల్, సురేష్ అంగాడి, గణేశ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ ప్రతాప్ సిన్హా భోంస్లే, పీఎంకే ఎంపీ ఎ.రాందాస్ ఉన్నారన్నారు. - అభియోగాలున్న వారి జాబితాలో 24 మంది బీజేపీ సభ్యులు, ఐదుగురు శివసేన సభ్యులు ఉన్నారు. తృణమల్ నుంచి నలుగురు, ఏఐఏడీఎంకే, ఆర్జేడీల నుంచి ముగ్గురేసి సభ్యులు, సీపీఎంనుంచి ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఎల్జేపీ, ఎన్సీపీ, పీఎంకే, ఆర్ఎస్పీ, బీజేడీ, ఎంఐఎం, స్వాభిమాన్ పక్ష, టీఆర్ఎస్ పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారని జగదీప్ చొక్కర్ చెప్పారు. - తెలంగాణలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై ఉన్న కేసులతో వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉందన్నారు. -
డిగ్రీ లేని స్మృతికి హెచ్ఆర్డీ శాఖా?
* ఆమెకు కీలకశాఖ అప్పగింతపై కాంగ్రెస్ ధ్వజం * సోనియా గాంధీ విద్యార్హత ఏంటి: ఉమా భారతి న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కనీసం డిగ్రీ కూడా లేని స్మృతికి కీలకమైన ఈ శాఖను ఎలా కట్టబెడతారని కాంగ్రెస్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏ విద్యార్హతతో యూపీఏ సర్కారును నడిపించారని బీజేపీ ఎదురు ప్రశ్నించింది. ‘మోడీ కేబినెట్‌ను చూడండి. స్మృతి గ్రాడ్యుయేట్ కూడా కాదు. ఆమె ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది’ అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మంగళవారం ట్విట్టర్లో రాశారు. దీనిపై బుధవారం కేంద్ర మంత్రి ఉమా భారతి మండిపడ్డారు. కాంగ్రెస్ మొదట సోనియా ఏం చదివారో, ఎక్కడ చదివారో సర్టిఫికెట్లు చూపి, తర్వాతే స్మృతి గురించి మాట్లాడాలని అన్నారు. ఆరోగ్య మంత్రికి డాక్టర్ పట్టా అక్కర్లేదని, వ్యక్తుల పనితీరు చూడాలి తప్ప పట్టాలు కాదని అన్నారు. విద్యకు కీలకమైన ఈ మంత్రిత్వ శాఖను స్మృతికి ఎలా కేటాయిస్తారంటూ మానవ హక్కుల కార్యకర్త మధు కిష్వార్ ట్విట్టర్లో ప్రశ్నించి ఈ వివాదాన్ని లేవనెత్తారు. స్మృతి అఫిడవిట్లో తేడాలు.. స్మృతి లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో తేడాలు ఉండడంతో బీజేపీ ఇరుకున పడనుంది. ఆమె 2004లో చాందినీ చౌక్ నుంచి పోటీ చేసినపుడు దూరవిద్య ద్వారా ఢిల్లీ వర్సిటీ నుంచి 1996లో బీఏ చేశానని తెలిపారు. 2014లో అమేథీ నుంచి పోటీ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం 1994లో ఢిల్లీ వర్సిటీ నుంచి దూరవిద్యలో బీకాం పార్ట్-1 చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో అభ్యర్థులు తప్పుడు సమాచారమిస్తే వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్మృతి విద్యార్హత వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. -
విధుల్లోకి పలువురు మంత్రులు
న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి వెంకయ్యనాయుడు సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు బుధవారం తమ బాధ్యతలను స్వీకరించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఇతర మంత్రుల్లో అనంత్‌కుమార్(రసాయనాలు, ఎరువులు), ఉమాభారతి( జలవనరులు), మేనకాగాంధీ(మహిళా శిశు సంక్షేమం), జితేంద్రసింగ్(పీఎంఓ, శాస్త్ర, సాంకేతిక శాఖ- సహాయ మంత్రి), రాధామోహన్ సింగ్(వ్యవసాయం) తదితరులున్నారు. ఒకే మంత్రిపదవి, అదీ భారీ పరిశ్రమల శాఖ కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చిన శివసేన నేత అనంత్ గీతే కూడా బుధవారం విధుల్లో చేరారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మరో ముఖ్యమైన శాఖకు మారుస్తామన్న హామీ గీతేకు లభించినట్లు సమాచారం. శాఖ కేటాయింపునకు సంబంధించి మోడీతో తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చ సంతృప్తికరంగా ముగిసిందని గీతే తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా పలువురు మంత్రులు తమ ప్రాధామ్యాలను మీడియాకు వివరించారు. అవి.. ‘దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గ్రామీణ్ సించయీ యోజన పేరుతో గ్రామీణ నీటిపారుదల కార్యక్రమాన్ని, రైతుల ఆదాయ పరిరక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభిస్తాం. గత 5-7 ఏళ్లలో రైతుల సగటు ఆదాయాన్ని గణించిన తరువాత బీమా పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దేశీయ ఆవుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక పథకం ప్రారంభించాలనుకుంటున్నాం. దిగుబడి ఖర్చుపై 50శాతం అదనంగా లభించేలా కనీస మద్దతు ధరను నిర్ణయించేలా ప్రణాళిక రూపొందిస్తాం’ - రాధామోహన్ సింగ్, వ్యవసాయ శాఖ ‘ఫార్మా కంపెనీలతో మాట్లాడి ముఖ్యమైన ఔషధాల ధరను 25% నుంచి 40% వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాను’ - అనంత్‌కుమార్, రసాయనాలు, ఎరువులు ‘ఎన్నికల సందర్భంగా మోడీ హామీ ఇచ్చిన గంగానది ప్రక్షాళనపైన ప్రధానంగా దృష్టి పెడతాను. ఇతర ముఖ్యమైన నదుల శుద్ధికి కృషి చేస్తాను’ - ఉమాభారతి, జలవనరులు -
మరి.. సోనియా ఏం చదివారో??
-
రాహుల్ వైఫల్యం వల్లే ప్రచారంలోకి ప్రియాంక
ఝాన్సీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఘోరంగా విఫలయ్యారని...ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఆయన సోదరి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో తెరపైకి తెచ్చిందని బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత ఉమా భారతి ఎద్దేవా చేశారు. ప్రియాంక చేస్తున్న విమర్శలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని... రాహుల్ విఫలమయ్యారనేందుకు ఇదే నిదర్శమని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే ప్రియాంకకు ఎటువంటి రాజకీయ హోదా లేనందున ఆమె విమర్శలకు బదులివ్వబోనన్నారు. యూపీలోని ఝాన్సీ నుంచి పోటీ చేస్తున్న ఉమాభారతి...ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఐటీ హబ్‌గా మారుస్తానన్నారు. -
మోడీపై సీడీ... రగిలిన వేడి
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో బీజేపీని ఇరుకున పెట్టేలా మూడేళ్ల నాటి ఓ సీడీని కాంగ్రెస్ గురువారం విడుదల చేసి వేడిని రగిల్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై పార్టీ సీనియర్ నేత ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది. గుజరాత్‌ను అభివృద్ధి చేశానంటున్న మోడీ మాటలు బూటకమని, ఆయనో విధ్వంసకారుడని ఉమాభారతి అందులో ఘాటుగా విమర్శించారు. బీజేపీతో తెగతెంపుల అనంతరం భారతీయ జనశక్తి పార్టీని స్థాపించాక ఉమాభారతి 2011లో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్లో హిందువులు ఇంతగా భయపడటం నేనెప్పుడూ చూడలేదు. అక్కడ భయం గూడుకట్టుకుని ఉంది. ఆయన(మోడీ) 1973 నుంచి నాకు తెలుసు. ఆయన వికాస పురుషుడు కాదు.. వినాశ పురుషుడు. మోడీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి’ అని ఉమా అందులో పేర్కొన్నారు.