'పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలి'
Published Mon, Jun 6 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
ఢిల్లీ: పునర్విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని కృష్ణా బోర్డు అధికారులను కేంద్రమంత్రి ఉమాభారతి ఆదేశించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు బృందం కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా రివర్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఉమాభారతికి హరీష్ రావు బృందం ఫిర్యాదు చేసింది.
ఈ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా బోర్డు ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి ఉమాభారతి ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు అధికారులు నడుచుకోవాలంటూ ఆమె ఆదేశించారు. రేపు (మంగళవారం) కృష్ణా బోర్డు ఉన్నతాధికారులను కలవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరినట్టు సమాచారం.
Advertisement