గోదావరి బోర్డుపై కేంద్రానికి ఫిర్యాదు! | complaint on godhavari board | Sakshi
Sakshi News home page

గోదావరి బోర్డుపై కేంద్రానికి ఫిర్యాదు!

Published Tue, Nov 22 2016 3:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

complaint on godhavari board

♦  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
♦  రేపు ఢిల్లీకి మంత్రి హరీశ్‌రావు
♦  కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి బోర్డు అంశం తీసుకెళ్లే అవకాశం
 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రాజెక్టులను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు గోదావరి బోర్డు చేస్తు న్న ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై కేంద్రా నికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ వెళ్లనున్న నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతి ని కలసి బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను ఆమె దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు న్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన గోదావరి బోర్డు... శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరు, లోయర్‌ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలి సిందే. ముసాయిదా అమల్లోకి వస్తే ప్రాజెక్టుల బ్యా రేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వా యర్లు, కాల్వ లు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్‌ పాంట్ల హెడ్‌ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి.

మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటాయిం పులనే ప్రాజెక్టుల కింద వినియోగించాల్సి ఉం టుంది.  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజె క్టులవారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వాటి నిర్వహణనే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఏపీ చేపట్టిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశం ఏమిటని ప్రశ్నిస్తోంది. దీనిపై సోమవారం ప్రభుత్వ సలహా దారు విద్యాసాగర్‌రావు అధికారులతో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement