పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్ | no permission to palamuru-rangareddy project: ys jagan | Sakshi
Sakshi News home page

పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్

Published Sun, Jun 14 2015 4:35 PM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM

పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్ - Sakshi

పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్

హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విభజన చట్టం ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టును చేపట్టినా వీటి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిర్ధిష్ట కేటాయింపులు జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోవాలని ఉమాభారతిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement