lettre
-
ఇప్పుడు రాలేను.. ఈడీకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లేఖ.. విచారణపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు గడువు కావాలని ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ రాశారు. విచారణ షెడ్యూల్ మార్చాలని కోరారు. ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని రోహిత్ రెడ్డి అంటున్నారు. వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ.. దాని నమూనాను నోటీసులతో జత చేసింది. చదవండి: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఫోకస్ -
ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు.. మైసూరులో పెద్ద ఎత్తున భూముల కబ్జా..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్ ప్రకాశ్‌కు లేఖ రాశారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. -
'భారత్ గొప్పది.. స్నేహం విలువైనది'
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు. అందులో ముందుగా భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపారు. ఆర్థిక, సామాజిక, వైజ్ఞానికి, సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో భారత్ సాధించిన పురోగతి అందరికీ బాగా తెలుసని అన్న ఆయన ప్రపంచానికి భారత్ ఎంతో చేస్తుందన్నారు. అంతర్జాతీయ స్థిరత్వానికి, భద్రతకు, ప్రాంతీయ, గ్లోబల్ ఎజెండాతో ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా భారత్ పాత్ర చాలా గొప్పదన్నారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని విలువైనదిగా రష్యా ఎప్పటికీ పరిగణిస్తుందని మున్ముందు కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం ద్వైపాక్షి చర్చలతో, మంచి సహకారంతో అన్ని రంగాల్లో కలిసి సాగేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత ప్రజలు, ప్రధానిగా మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ విజయ పథాన ముందుకు వెళ్లాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పుతిన్ లేఖలో పేర్కొన్నారు. -
‘మేం ట్విన్ టవర్స్‌ను అందుకే కూల్చాం’
న్యూయార్క్: సాధారణంగా.. 2001, సెప్టెంబర్ 11 అని చెప్పగానే అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి గుర్తొస్తుంది. అల్ కాయిదా చేసిన ఈ దాడి పేరు చెబితే ప్రపంచం గురించేమోగానీ ప్రతి అమెరికన్ మాత్రం ఉలిక్కిపడతాడు. అయితే, వాడి దాడి చేయడానికి కారణాలు పెద్దగా ప్రపంచానికి తెలియదు. ప్రతి సమస్యను పరిష్కరించుకునేందుకు మాట్లాడుకునే వెసులుబాటు ఉండగా విధ్వంసాన్ని సృష్టించిన కారణాలు ఎంతపెద్దవైనా వాటికి విలువ ఉండదు.. అయితే వాటిని తెలుసుకోవడం కొంతవరకు మంచిదే. ఈ నేపథ్యంలోనే అమెరికాపై తాము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వివరిస్తూ సరిగ్గా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజులకు ముందు ఖలీద్ షేక్ మహ్మద్ అనే వ్యక్తి ఓ లేఖను పంపించాడు. నాటి దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ ఉన్నప్పటికీ కీలక సూత్రదారి మాత్రం ఇతనే అని చెప్తారు. విధ్వంసకర విధానాలకు ప్రతీకారంగానే తాము నాడు దాడి చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఖలీద్ షేక్ చెప్పిన విషయాలేమిటంటే.. విదేశాంగ విధానం ‘ అమెరికా విదేశాంగ విధానం మాకు నచ్చలేదు. అమెరికన్ ఇండియన్స్‌పై దాడుల, వియత్నాం, కొరియా, టోక్యో, హిరోషిమా, నాగాసాకి, డ్రెస్డెన్, లాటిన్లాంటి దేశాల్లో మీ దేశ నేరాలు కోకొల్లలు. చైనా, మెక్సికో, శాంతా అన్నా దేశాల నియంతలకు మీరిచ్చే మద్దతు నచ్చలేదు. మీకు నచ్చిన దేశాల్లో మీ ఆర్మీ పెట్టుకుంటే మేం పట్టించుకోం.. కానీ మా ముస్లిం దేశాల్లో కూడా సైన్యాన్ని నిలిపారు అందుకు మేం ఒప్పుకోం’ పాలస్తీనా విషయంలో.. ‘గత 60 ఏళ్లుగా పాలస్తీనాలో మీరు మారణకాండను సృష్టిస్తున్నారు. 4మిలియన్లమందిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ సేనతో చేతులు కలిపి ఐక్యరాజ్యసమితి వారి నేరాలు బయటకు రాకుండా చూశారు. 60 ఏళ్లపాటు ఈ వ్యవహారం చూసి తట్టుకోలేక దాడి చేశాం’ మీడియా.. అబ్రహం లింకన్.. మీరు మీ దేశం మీడియా నిపుణులు కలిసి నిజాలు తొక్కిపెడతారు.. మీ దేశాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేందుకు నిజాలను సమాధి చేస్తారు. అబ్రహం లింకన్ చెప్పినట్లు.. ‘మీరు అందర్నీ కొన్నిసార్లు వెదవల్ని చేయొచ్చు..కొంతమంది ప్రజలు మాత్రం అన్నిసార్లు చేస్తారు.. అయితే, అందర్నీ అందరూ అన్నిసార్లు మాత్రం వెదవల్ని చేయలేరు. మీకు వ్యతిరేకంగా తొలుత యుద్ధం మొదలుపెట్టింది మేం కాదు.. మీరే మా భూమిలో అడుగుపెట్టి యుద్ధం చేసే పరిస్థితి తెచ్చారు. ఇరాక్‌ను ఉద్దేశిస్తూ ఇరాక్‌ను ఒక రక్తపు తివాచీలా మార్చారు. ఇరాక్‌లో మీరెప్పుడైనా భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలు చూశారా? కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాయభార కార్యాలయం కోసం మంచి చోటు మాత్రం చూసుకున్నారు. దాని ద్వారా ఆయిల్ వ్యాపారంలో అడుగుపెట్టి మీ చెప్పుచేతల్లో ఉన్నవారి సహాయంతో గుత్తాధిపత్యం కోసం ఇదంతా సృష్టించారు.. అందుకే దాడి చేశాం. ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై.. బిన్ లాడెన్‌ను అల్లా కృప ఉంటుంది. న్యూయార్క్‌పై దాడి చేసి మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బకొట్టాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఒక్క వాణిజ్యసముదాయంపైనే దాడి చేశాడే తప్ప స్కూళ్లు, ఆస్పత్రులు, శరణాలయాలు, నివాసాలు, చర్చిలపై దాడి చేయలేదు.. అయితే, కొందరి ప్రాణాలు పోయాయి.. మా అసలు లక్ష్యం మీ ఆర్థిక వ్యవస్థను కూల్చడమే. కానీ, మీరు మీ సైన్యం చేసిన ప్రతి దాడిలో మా చిన్నారులతో సహా ప్రాణాలుపోయాయి’ లాడెన్‌ను చంపడంపై.. మీ విలువలేమిటో ప్రపంచానికి తెలిసింది. కనీసం దర్యాప్తు చేయకుండా ప్రాథమిక విచారణ జరపకుండా లాడెన్‌ను హతమార్చారు. అతడి దేహాన్ని సముద్రంలో పడేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ తంతు మొత్తాన్ని అధ్యక్షుడు చూశాడు’ అంటూ ఓ భారీ లేఖను విడుదల చేశాడు. -
మిగతా జీవితం మహారాణిగా బతికేస్తా: జయ లేఖ
చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కాదు.. నటిగా ఉన్నప్పటి నుంచే జయలలిత ప్రతి విషయంలో చాలా స్పష్టతను కొనసాగించే వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం, విమర్శలకు కూడా ఓపికగా సమాధానాలు ఇచ్చే తీరు, అవమనాలను సైతం చిరునవ్వుతో స్వీకరించి పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలని తపించే తత్వం ఆమెకు చిన్నప్పటి నుంచే ఓ జీవన చర్యగా అలవాటైనట్లు తెలుస్తోంది. అందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. అది 1980 జూన్ 10.. జయ స్వహస్తాలతో ఖాస్ బాత్ అనే మేగజిన్ ఎడిటర్ పియోస్ జీకి ఓ లేఖ రాశారు. అంతకుముందు అదే ఏడాది మే 25న జయ గురించి విమర్శిస్తూ ఆ మేగజిన్‌లో ప్రచురించడమే ఆమె ఈ లేఖ రాయడానికి కారణం. జయ ఇక సినిమాల్లోకి రావడం కష్టంగా మారిందని, ఆమె తిరిగి తెరపై కనిపించే అవకాశాలు మందగించినట్లేనని, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె తెగ పోరాడుతున్నారంటూ ఖాస్ బాత్ ప్రచురించింది. ఇది చూసిన జయ వెంటనే లేఖ రాశారు. ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘ప్రియమైన పియోస్ జీ, మీ ఖాస్ బాత్ ఆదివారం సంచిక(మే 25, 1980)లో నాపై ఎన్నో ప్రశంసలు కురిపించారు. ముందుగా అందుకు మీకు ధన్యవాదాలు. నేను తిరిగి చిత్ర రంగంలోకి అడుగుపెట్టలేక ఇబ్బంది పడుతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దానిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అసలు ఇలాంటి సమాచారం ఎక్కడి నుంచి అందిందో, మీకు నాపై ఇలాంటి అభిప్రాయం ఎలా వచ్చిందో అర్ధం చేసుకోలేకపోతున్నాను. నిజానికి నేను ఎన్నో గొప్పగొప్ప అవకాశాలు వదిలేశాను. మీకు తెలియదు కావచ్చు. ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను బిల్లా సినిమా కోసం సంప్రదించారు. ఆ చిత్రంలో నాయిక పాత్రను చేయాలన్నారు. అది కూడా తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ పక్కన. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాతే బాలాజీగారు ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బాలాజీగారు కూడా స్వయంగా ప్రకటించారు. ఇంతమంచి ఆఫర్లు వదిలేసుకున్న నేను నిజంగా సినిమాల్లోకి మరోసారి వచ్చేందుకు కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నానా? వాస్తవానికి ఇక నాకు సినిమాల్లో చేయాల్సిన అవసరం లేదు. నాకు పెద్దగా సినిమా జీవితంపై ఆసక్తి లేదు. దేవుడి దయవల్ల ఆర్థికంగా బాగానే కుదురుకున్నాను. నేను మిగిలిన జీవితమంతా కూడా రాణిమాదిరిగా బతికేయగలను ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ ఆమె ఏమాత్రం దాపరికం లేకుండా ఖాస్ బాత్కు లేఖ రాశారు. -
ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు. -
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: జగన్
-
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని లేఖలో కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టువల్ల రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టును చేపట్టినా వీటి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిర్ధిష్ట కేటాయింపులు జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకోసం ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు జోక్యం చేసుకోవాలని ఉమాభారతిని కోరారు.