
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు. అందులో ముందుగా భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపారు. ఆర్థిక, సామాజిక, వైజ్ఞానికి, సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో భారత్ సాధించిన పురోగతి అందరికీ బాగా తెలుసని అన్న ఆయన ప్రపంచానికి భారత్ ఎంతో చేస్తుందన్నారు.
అంతర్జాతీయ స్థిరత్వానికి, భద్రతకు, ప్రాంతీయ, గ్లోబల్ ఎజెండాతో ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా భారత్ పాత్ర చాలా గొప్పదన్నారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని విలువైనదిగా రష్యా ఎప్పటికీ పరిగణిస్తుందని మున్ముందు కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం ద్వైపాక్షి చర్చలతో, మంచి సహకారంతో అన్ని రంగాల్లో కలిసి సాగేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత ప్రజలు, ప్రధానిగా మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ విజయ పథాన ముందుకు వెళ్లాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పుతిన్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment